బీరుట్
బీరుట్ లెబనాన్ దేశపు రాజధాని, అతి పెద్ద నగరం. 2014 నాటికి గ్రేటర్ బీరుట్ జనాభా సుమారు 25 లక్షలు.[1] ఇది మధ్యధరాసముద్ర తీర ప్రాంతంలో నెలకొని ఉంది. బీరుట్ లో సుమారు 5000 సంవత్సరాల నుంచీ ప్రజలు నివాసం ఉంటున్నారు. ఇది ప్రపంచంలో అత్యంత పురాతనమైన నగరాల్లో ఒకటి. ఇది పశ్చిమాసియా ప్యారిస్ నగరంగా పేరు గాంచింది.[2]
బీరుట్ లెబనాన్ ప్రభుత్వ కేంద్ర. లెబనీస్ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. నగరంలో అనేక బ్యాంకులు, కార్పొరేషన్లు ఉన్నాయి. బీరుట్ ఈ ప్రాంతానికంతటికీ ముఖ్యమైన ఓడరేవు. గ్లోబలైజేషన్ వరల్డ్ సిటీస్ రీసెర్చ్ నెట్‌వర్క్ దీనిని ఒక ప్రపంచ నగరం అని పేర్కొన్నారు.[3] లెబనీస్ అంతర్యుద్ధం, 2006 లెబనాన్ యుద్ధం, 2020లో బీరుట్ నౌకాశ్రయంలో జరిగిన భారీ పేలుడు కారణంగా బీరుట్ తీవ్రంగా దెబ్బతిన్నది. దాని నిర్మాణ మరియు జనాభా నిర్మాణం ఇటీవలి దశాబ్దాలలో పెద్ద మార్పుకు గురైంది.[4][5][6][7]
చరిత్ర
మార్చుబీరుట్ యొక్క తొలి స్థావరం బీరుట్ నదిలోని ఒక ద్వీపంలో ఉంది. కానీ దానిని ఒడ్డు నుండి వేరుచేసే నీటి పాయ పూడిపోవడంతో అది భూభాగంలో కలిసిపోయింది. నగర కేంద్రప్రాంతంలో జరిగిన త్రవ్వకాల్లో ఫోనిషియన్, హెలెనిస్టిక్, రోమన్, బైజాంటైన్, అరబ్, క్రూసేడర్, పర్షియన్, ఇంకా ఒట్టోమన్ అవశేషాల పొరలు బయటపడ్డాయి.[8]
మూలాలు
మార్చు- ↑ "Questions & Answers: Water Supply Augmentation Project, Lebanon Archived 28 మే 2019 at the Wayback Machine". The World Bank. 30 September 2016. Retrieved 20 March 2016.
- ↑ "Beirut: ఒకప్పటి పశ్చిమాసియా పారిస్.. బీరుట్." EENADU. Retrieved 2024-09-25.
- ↑ "The World According to GaWC 2020". GaWC – Research Network. Globalization and World Cities. Archived from the original on 24 August 2020. Retrieved 31 August 2020.
- ↑ Reconstruction of Beirut Archived 16 జనవరి 2009 at the Wayback Machine, Macalester College
- ↑ Lebanon's Reconstruction: A Work in Progress, VOA News
- ↑ "Beirut: Between Memory And Desire". Worldview. Archived from the original on 3 March 2016.
- ↑ Antelava, Natalia (10 May 2010). "'Ugly Beirut' struggles to survive peace". BBC News. Archived from the original on 5 August 2023. Retrieved 5 August 2023.
- ↑ "Research Projects – History and Archeology". American University of Beirut (AUB). Archived from the original on 6 December 2008.