బుదౌన్
బుదౌన్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం. దీన్ని బాదౌన్ అని కూడా అంటారు. గతంలో వోదమాయుత అని అనేవారు. ఇది బదాయూన్ జిల్లా ముఖ్యపట్టణం.[1] ఇది పశ్చిమ ఉత్తర ప్రదేశ్ మధ్యలో, గంగా నది [2] సమీపంలో ఉంది. సుల్తాన్ ఇల్‌టుట్‌మిష్ పాలనలో సా.శ. 1210 నుండి సా.శ. 1214 వరకు నాలుగు సంవత్సరాల పాటు బదాయూన్ ఢిల్లీ సుల్తానేట్‌కు రాజధానిగా ఉంది. మొఘల్ పాలనలో ఇది ఉత్తర సరిహద్దుల్లో అతి ముఖ్యమైన ప్రదేశం. బదాయూన్ ఒక పెద్ద మార్కెట్. చారిత్రికంగా ప్రసిద్ధి గాంచిన, మతపరంగా ముఖ్యమైన నగరం. ఇది రోహిల్‌ఖండ్ ప్రాంతానికి గుండెకాయ వంటిది.[3][4] ఇది ఢిల్లీ నుండి 229 కి.మీ. దూరంలో ఉంది.[5] ఈ పట్టణం సోట్ నది ఎడమ ఒడ్డున ఉంది.
బుదౌన్ | |
---|---|
నగరం | |
Coordinates: 28°03′N 79°07′E / 28.05°N 79.12°E | |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
ప్రాంతం | రోహిల్‌ఖండ్ |
డివిజను | బరేలీ |
జిల్లా | బదాయూన్ |
స్థావరం | సా.శ. 905 (ఆధునిక పట్టణం), సా.పూ.220 (ప్రాచీన పట్టణం) |
Government | |
• Body | మునిసిపల్ కార్పొరేషను |
విస్తీర్ణం | |
• నగరం | 81 కి.మీ2 (31 చ. మై) |
Elevation | 164 మీ (538 అ.) |
జనాభా (2011) | |
• నగరం | 3,69,221 |
• Rank | 17 |
• జనసాంద్రత | 5,489/కి.మీ2 (14,220/చ. మై.) |
• Metro | 4,57,665 (Budaun Metro Area) |
భాషలు | |
• అధికారిక | హిందీ, ఉర్దూ,, |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 243601 |
టెలిఫోన్ కోడ్ | 05832 |
ISO 3166 code | IN-UP-BD |
Vehicle registration | UP-24 |
శీతోష్ణస్థితి | HS-TH (Köppen) |
Website | http://www.badaun.nic.in/ |
ప్రొ. గోటి జాన్, లక్నో మ్యూజియం వద్ద రాతి లిపి ఆధారంగా కాలంలో ఈ నగరానికి బేడమూత్ అని పేరు ఉండేదని చెప్పాడు. తరువాత ఈ ప్రాంతాన్ని పాంచాల్ అని పిలిచేవారు. రాతి లిపిలోని పంక్తుల ప్రకారం నగరానికి సమీపంలో భదౌన్లక్ అనే గ్రామం ఉండేది. ముస్లిం చరిత్రకారుడు రోజ్ ఖాన్ లోధీ మాట్లాడుతూ, అశోకుడు ఒక బుద్ధ విహారాన్ని, ఒక కోటనూ నిర్మించాడని చెప్పాడు. అతను దీనికి బుద్ధమౌ ( బదాయూన్ కోట) అని పేరు పెట్టాడు . జార్జ్ స్మిత్ ప్రకారం, బదాయూన్ పేరు అహిర్ రాజకుమారుడు బుద్ధుడి పేరు మీదుగా వచ్చింది.[6][7]
సాంప్రదాయిక కథనాల ప్రకారం, బదాయూన్‌ను సా.శ. 905 లో స్థాపించారు. 12 వ శతాబ్దానికి చెందిన ఒక శాసనంలో, అప్పట్లో వోడామాయుత అని పిలిచే బదాయూన్‌ను పాలించిన పన్నెండు రాథోడ్ రాజుల జాబితాను చూపిస్తుంది. 1085 తరువాత ఘజ్నవీడ్ సుల్తాను కుమారుడు మహమ్మద్ కనౌజ్‌ను జయించి, రాష్ట్రకూట రాజును తరిమి కొట్టాడు. ఈ రాష్ట్రకూట రాజు తన రాజధానిని వోడమాయుతకు తరలించాడు. అక్కడ వారు కుతుబ్-ఉద్-దిన్ ఐబక్ చేతిలో ఓడే వరకు పరిపాలించారు.[8]
1196 లో కుతుబ్-ఉద్-దిన్ ఐబాక్‌కు వశమైన ఘటన, ఇక్కడ జరిగిన మొట్టమొదటి ప్రామాణికమైన చారిత్రక సంఘటన. ఆ తరువాత ఢిల్లీ సామ్రాజ్యపు ఉత్తర సరిహద్దులో ఇది చాలా ముఖ్యమైన స్థానంగా మారింది. 1223 లో షమ్స్-ఉద్-దిన్ ఇల్టుట్మిష్, గోపురంతో కూడి, బృహత్పరిమాణంలో ఉన్న మసీదును ఇక్కడ నిర్మించాడు. త్ను, అతని కుమారుడు రుక్న్ ఉద్ దిన్ ఫిరూజ్ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించారు. 1571 లో పట్టణం దహనం చేయబడింది. సుమారు వంద సంవత్సరాల తరువాత, షాజహాన్, రాజప్రతినిధి పదవిని సహస్పూర్-బిలారికి అప్పగించాడు. బదాయూన్‌ను, దాని జిల్లానూ 1801 లో ఔధ్ నవాబు బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పగించాడు.
1911 లో, బదాయూన్ పట్టణం యునైటెడ్ ప్రావిన్స్‌లోని రోహిల్‌ఖండ్ విభాగంలో ఉండేది. ఆ సమయంలో, ఒక అమెరికన్ మెథడిస్ట్ మిషన్ అనేక బాలికల పాఠశాలలను నిర్వహించింది. అబ్బాయిల కోసం ఒక ఉన్నత పాఠశాల కూడా నెలకొల్పింది.
జనాభా
మార్చు2011 జనగణన ప్రకారం, బదాయూన్ జనాభా 3,69,221 (1,88,475 పురుషులు 1,80,746 స్త్రీలు. లింగనిష్పత్తి: 1000/907). వీరిలో ఆరేళ్ళ లోపు పిల్లలు 39,613 మంది (12.3%). వయోజన అక్షరాస్యత 73%. నగరంలో విస్తృతంగా మాట్లాడే భాష హిందీ, ఉర్దూ. పంజాబీ కూడా మాట్లాడుతారు. పిల్లల్లో లింగ నిష్పత్తి 882. నగరం వైశాల్యం 81 చదరపు కి.మీ. బదాయూన్ మెట్రో ఏరియా విస్తీర్ణం 103 చ.కి.మీ. జనాభా 4,17,000. బదాయూన్ నగరంతో పాటు షేఖుపూర్, బహేది, ఇస్లామ్‌గంజ్, చందన్‌పూర్, సాలార్‌పూర్, సాలార్‌పూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, షేఖుపూర్ ఫైరింగ్ రేంజ్, పదౌనా, ఖేరా బుజుర్గ్‌లు బదాయూన్ మెట్రోలో భాగంగా ఉన్నాయి..[9][10]
మూలాలు
మార్చు- ↑ "Budaun District : Census 2011 data". Indian Census 2011. Retrieved 17 January 2014.
- ↑ "Archived copy". Archived from the original on 21 July 2011. Retrieved 21 October 2011.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ http://indiatoday.intoday.in/story/yadavs-growing-clout-resents-by-both-upper-castes-and-other-backward-castes/1/294220.html
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-10. Retrieved 2020-11-24.
- ↑ http://www.mapsofindia.com/distance/new-delhi-to-badaun.html
- ↑ George Smith (1882). The student's geography of India: the geography of British India : political and physical. John Murray. pp. 223–. Retrieved 17 February 2012.
- ↑ http://www.jagran.com/uttar-pradesh/badaun-shortage-of-milk-in-kilk-prodective-area-10672897.html
- ↑ Majumdar, Ramesh Chandra (1977). Ancient India (in ఇంగ్లీష్). Motilal Banarsidass. p. 315. ISBN 9788120804364. Retrieved May 23, 2017.
- ↑ "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 2012-07-07.
- ↑ http://pib.nic.in/release/release.asp?relid=28770
- ↑ "Budaun City Population Census 2011". Census 2011 India. Office of the Registrar General and Census Commissioner, India. Retrieved 2015-11-29.