మసీ​దు

(మస్జిద్ నుండి దారిమార్పు చెందింది)

మసీదు లేక మస్జిద్ : ఇస్లాం మతాన్ని అవలంబించు ముస్లింల ప్రార్థనాలయం. మసీదు అరబ్బీ పేరు, (مسجد), బహువచనం మసాజిద్ (مساجد). సాధారణ మసీదు కు, చిన్న మసీదు కు మసీదు అని, పెద్ద మసీదు కు జామా మసీదు (جامع), లేక మసీదు-ఎ-జామి అని అంటారు. ప్రాథమికంగా మసీదు అనగా ప్రార్థనా స్థలము. ప్రస్తుతం ప్రపంచంలో మసీదు లు సర్వసాధారణం. ముస్లింసమాజపు ప్రాముఖ్యాన్నిబట్టి మసీదు లు తమ నిర్మాణశైలులు పొందియున్నాయి. ఇవి మస్జిద్-ఎ-ఖుబా , మస్జిద్-ఎ-నబవి 7వ శతాబ్దంలో నిర్మితమయిన ఆధారంగా నిర్మింపబడుచున్నవి.

మక్కాలోని మసీదు అల్ హరామ్.
వ్యాసముల క్రమము


ఇస్లాం మతం

విశ్వాసాలు

అల్లాహ్ · ఏకేశ్వర విశ్వాసం దేవుడు
ముహమ్మద్ · ఇతర ప్రవక్తలు

ఆచరణీయాలు

మూల విశ్వాసం · నమాజ్
ఉపవాసం · దాన ధర్మాలు · తీర్థయాత్ర

గ్రంధాలు, చట్టాలు

ఖుర్'ఆన్ · సున్నహ్ · హదీస్
ఫిఖ॰ · షరియా · కలాం · సూఫీ తత్వం

చరిత్ర, ఖలీఫాలు

ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
అహ్లె బైత్ · సహాబా
సున్నీ · షియా
రాషిదూన్ ఖలీఫాలు · ఇమామ్

సంస్కృతి, సమాజం

విద్య · జంతువులు · కళలు
కేలండరు · పిల్లలు
జనగణన · పండుగలు
మస్జిద్‌లు · తత్వము
శాస్త్రము · స్త్రీ
రాజకీయాలు · దావాహ్ · జిహాద్

ఇస్లాం, ఇతర మతములు

క్రైస్తవం · యూదమతము
హిందూ మతము · సిక్కు మతం · జైన మతము

'

విమర్శ ·  ముస్లింలలో అపవిశ్వాసాలు
ఇస్లామోఫోబియా
ఇస్లామీయ పదజాలము

భారతదేశంలో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం

వీక్షణం

మార్చు

అరబ్బీ లో మసీదు అనగా సజ్దా (మోకరిల్లడం) చేయు ప్రదేశం. సజ్దా లేక సజద పదానికి మూలం 'సజ్ద్' అనగా మోకరిల్లడం (క్రియ). సాజిద్ (కర్త) అనగా సజ్దా చేయువాడు లేక మోకరిల్లువాడు. 'మస్జూద్' (కర్మ) అనగా సజ్దా చేయించుకొన్నవాడు (అల్లాహ్). 'మసీదు' అనగా సజ్దా చేయు ప్రదేశం.

ఇస్లామీయ గ్రంధాలలో మసీదు

మార్చు

మసీదు అనేపదము ఖురాన్లో ప్రస్తావించబడింది. ఎక్కువసార్లు మక్కా నగరంలోని కాబా ప్రస్తావింపబడింది. ఖురాన్ మసీదు ను ప్రార్థనాప్రదేశంగా వర్ణిస్తుంది. హదీసులులో గూడా మసీదు ప్రార్థనాలయం.[1]

చరిత్ర

మార్చు

ఇస్లాం ఆవిర్భవించిన మొదటలో మసీదు లు విశాలమైన హాలులలో నిర్వహింపబడేవి. రాను రాను మసీదు ల నిర్మాణశైలిలో ఎత్తైన మీనార్లు చోటు చేసుకొన్నవి. ఇస్లామీయ ప్రథమ 3 మసీదు లు సాదాసీదా మసీదు లు. తరువాతి 1000 సంవత్సరాలకాలంలో నిర్మింపబడిన మసీదు లు ఇస్లామీయ నిర్మాణ శైలులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నిర్మాణ శైలులతో మిళితమై నిర్మింపబడినవి.

మొదటి మసీదు

మార్చు

ఇస్లామీయ విశ్వాసాల ప్రకారం ఆదమ్ ప్రవక్త మక్కా లోని కాబా గృహాన్ని నిర్మించి ప్రథమ మసీదు గా ఉపయోగించారు (ప్రార్థనా విధానం నమాజ్ కంటే భిన్నంగా వుండేది). ఇబ్రాహీం ప్రవక్త తనకాలంలో అల్లాహ్ ఆజ్ఞతో తన కుమారుడైన ఇస్మాయీల్ సహకారంతో కాబాను పునర్నిర్మించారు. మహమ్మదు ప్రవక్త మక్కాలో జీవించినకాలంలో కాబాను పవిత్రంగా భావించి తన అనుయాయులతో నమాజు ప్రార్థనలను నిర్వహించారు. పాగన్ అరబ్బులు కాబాగృహంలో తమ ధార్మిక సంప్రదాయాలను తీర్చుకొనేవారు. కాబాగృహానికి ఆధిపత్యం వహించేవారు ఖురేషులు. ఈ కాబా గృహంలో 360 దేవతావిగ్రహాలుండేవి. మహమ్మదు ప్రవక్త మక్కాపై రక్తరహిత విజయం సాధించిన తరువాత, ఈ విగ్రహాలను తొలగించి ఇదే కాబాగృహానికి "ఏకేశ్వరోపాసక తీర్థయాత్రాకేంద్రం"గా ప్రకటించారు. 1577 లో ఉస్మానియా సామ్రాజ్య ఖలీఫాలు నేటి రూపంలో వున్న కాబా ని తీర్చిదిద్దారు.[2] మక్కా నుండి మదీనా కు హిజ్రత్ చేసిన తరువాత, మదీనా నగర పొలిమేరల్లోని ఖుబా గ్రామ ప్రాంతంలో మహమ్మదు ప్రవక్త , అనుచరగణం నమాజ్ ను ఆచరించారు, ఈ ప్రదేశమే ఖుబా. ముస్లింలచే నిర్మింపబడిన పురాతన మసీదు మసీదు-ఎ-ఖుబా.[3] మదీనాకు హిజ్రత్ చేసిన కొద్ది రోజులలోనే మసీదు-ఎ-నబవి నిర్మింపబడింది..[4] ఇందులో నిర్మింపబడిన 'మింబర్' విధానం ప్రపంచంలోని అన్ని మసీదు లలోనూ కాన వస్తుంది. ఈ రోజుల్లో మక్కా లోని మసీదు-అల్-హరామ్, మదీనా లోని మసీదు-ఎ-నబవి , జెరూసలేం లోని అల్-అఖ్సా మసీదు ముస్లింలకు మూడు ప్రధాన పవిత్ర క్షేత్రాలు.[5]

ప్రపంచంలో మసీదు ల విస్తరణ

మార్చు

అరేబియా ద్వీపకల్పం లోనే గాక ప్రపంచంలోని పలు దేశాలలో మసీదు ల నిర్మాణాలు , వాటి విస్తరణలూ ఆరంభమయ్యాయి. ఈజిప్టు రాజధాని కైరో (ఖాహెరా) నగరానికి "వెయ్యి మీనార్ల నగరం" అని పేరు.[6] సిసిలీ , స్పెయిన్ (హస్పానియా) లోని నగరాలలో 'ముస్లిం మూర్'లు ఉపయోగించిన నిర్మాణాకృతులు కానవస్తాయి.[7] 8వ శతాబ్దం చైనాలో ప్రథమ మసీదు ప్రసిధ్ధ జియాన్ మసీదు. దీని యందు 'సైనో-ఇస్లామీయ' కళాకృతులు ఉట్టి పడుతాయి. తూర్పు చైనా లోని మసీదు లలో పగోడాలు కానవస్తాయి.[8] భారతదేశం 16 , 17వ శతాబ్దాలలో మొఘల్ సామ్రాజ్య కాలంలో మసీదు లు ఎక్కువగా స్థాపింపబడ్డాయి. మొఘలులు తమ నిర్మాణాకృతులు ఢిల్లీ జామా మసీదు రీతిలో నిర్మించారు.

11వ శతాబ్దం ఉస్మానియా సామ్రాజ్య కాలంలో మసీదు లు ప్రముఖ నిర్మాణాలుగా వెలిసాయి. ముఖ్యంగా టర్కీ, ఇస్తాంబుల్ లోని హాజియా సోఫియా మసీదు ఉస్మానియా నిర్మాణాలకు మచ్చుతునక.[9] ఐరోపా దేశాలలోని నగరాలు రోమ్, లండన్ , మ్యూనిచ్ లలోనూ మసీదు లు కానవస్తాయి, కారణం ముస్లింలు వలసలు వెళ్ళడం.[10] యు.ఎస్.ఎ. లో 20వ శతాబ్దంలో స్థాపించారు.[11]

వివిధ దేశాలలో మసీదు లు

మార్చు

స్థలాలను మసీదు లు గా మార్పు

మార్చు

నవీన ముస్లిం చరిత్రకారుల ప్రకారం ఉమయ్యద్ ఖలీఫాలు అబ్బాసీ ఖలీఫాలు, ఇస్తాంబుల్ , కాన్స్టాంటినోపిల్ (కుస్తున్ తునియా) లోనూ మసీదు లను నిర్మించారు..[1] ఖలీఫాలు, మసీదు లను నిర్మించడం ధార్మిక కర్తవ్యంగా భావించేవారు. స్పెయిన్లో మూర్ లు 1492 కాలంలో మసీదు లను నిర్మించారు.[12] ఈ మసీదు లలో ప్రసిధ్ధమైనది కార్డోబా మసీదు (ఖర్తబా మసీదు).

మతపరమైన శుభకార్యములు

మార్చు

ప్రార్థనలు

మార్చు

మసీదు లు ప్రముఖంగా ప్రార్థనల కొరకు నిర్మింప బడతాయి. ప్రార్థనలు (సలాహ్ లేదా నమాజ్) ప్రతిదినం ఐదు సార్లు ఆచరిస్తారు. అనగా సూర్యోదయాత్పూర్వం నుండి సూర్యాస్తమయం తరువాత గూడా మసీదు లు ప్రార్థనల కొరకు తెరవబడివుంటాయి. సామూహిక ప్రార్థనలు అధిక ప్రాధాన్యతలు గలవి. ఈ సామూహిక ప్రార్థనా కేంద్రాలే మసీదు లు.[13]

 
ముస్లింలు సలాహ్ ఆచరిస్తున్నారు.

రోజువారి ఐదు పూటల నమజ్ కాక 'శుక్రవారపు ప్రత్యేక నమాజ్', రంజాన్ మాసంలో 'తరావీయ్ నమాజ్', షబ్-ఎ-ఖద్ర్, షబ్-ఎ-బరాత్, షబ్-ఎ-మేరాజ్ ల నమాజ్ లు కూడా సామూహికంగా మసీదు లలో ఆచరిస్తారు.[14] ముస్లింలు మరణించినపుడు, ఖనన సంస్కారాలకు ముందు సలాతుల్ జనాజా (జనాజా నమాజ్) ఆచరిస్తారు, ఇది కూడా మసీదు లలోనే సామూహికంగా ఆచరిస్తారు.[15] సూర్య చంద్ర గ్రహణాల సమయాలలో కూడా మసీదు లలో "సలాతుల్-ఖుసుఫ్" సామూహిక ప్రార్థనలు ఆచరిస్తారు.[16] ఈద్ లైన ఈదుల్-ఫిత్ర్ , ఈదుల్-అజ్ హా దినాలలో కూడా ఈద్ ప్రార్థనలు మసీదు లలో ఆచరిస్తారు.[17]

రంజాన్ పర్వాలు

మార్చు

రంజాన్ నెల భక్తులకు పుణ్యకాయ్రాలు చేసేందుకు చక్కటి నెల. సౌమ్ (రోజా) ఉపవాస దీక్షలు, ఉపవాసం దీర్చే ఇఫ్తార్ లు, ఐదు పూటల నమాజులు. సెహర్ లూ, ఏతెకాఫ్ దీక్షలూ, సలాత్-అల్-తరావీహ్, ఖురాన్ పఠనమూ, షబ్-ఎ-ఖద్ర్ నమాజ్ లూ, వీటన్నిటికీ కేంద్రాలు ఈ మసీదు లు.[14] [18]

దానధర్మాలు

మార్చు

ఇస్లాం ఐదు మూలస్థంభాలలో నాలుగవదైనటువంటి జకాత్ రంజాన్ నెలలోనే ఇస్తారు. సాథారణంగా జకాత్ పంచేవారు పంచుటకు (జకాత్ డబ్బు మసీదు కు ఇవ్వకూడదు, నిషేధం.) , స్వీకరించేవారు స్వీకరించుటకు మసీదు లకు వెళతారు. మసీదు లు ఇలాంటి దానధర్మాలకు నిలయాలు. జకాత్ యొక్క ముఖ్య ఉద్దేశం పేదరికాన్ని పారద్రోలడం.

సామాజిక కార్యక్రమాలు

మార్చు
 
జెన్నే మసీదు, ఇక్కడ సాలీన పర్వం నిర్వహిస్తారు.
దస్త్రం:Somaliamosque11.jpg
మొఘదిషులోని ఇస్లామీయ మసీదు లో ఒక ఎత్తైన మీనార్
 
టర్కీ లోని ఒక మసీదు లో ప్రార్థనా హాలు, ఇందులోని మిహ్రాబ్.

ముస్లిం సముదాయ కేంద్రం

మార్చు

మహమ్మదు ప్రవక్త పరమదించిన తరువాత, అనేకమంది పాలకులు మసీదు లను నిర్మించి ఇస్లాం పట్ల తమ భక్తిని చాటుకున్నారు. మక్కా , మదీనా లలో మసీదు-అల్-హరామ్ , మసీదు-ఎ-నబవి నిర్మించినట్లు ఇరాక్ లోని కర్బలాలో ఇమామ్ హుసేన్ రౌజా నిర్మించారు. ఇరాన్ లోని ఇస్ఫహాన్ 8వ శతాబ్దంలో నిర్మించిన షాహ్ మసీదు ప్రసిద్ధ మసీదు. "[19] 17వ శతాబ్దపు ప్రారంభంలో సఫవీదు రాజ్యపు షాహ్ అబ్బాస్ I ఇస్ఫహాన్ నగరాన్ని ప్రపంచంలోనే అతిసుందరనగరంగా తీర్చిదిద్దాలనే ఆశయంతో నిర్మాణం చేపట్టాడు. దీని భాగంగానే షాహ్ మసీదు , నఖ్ష్-ఎ-జహాం కూడలి నిర్మాణం కొరకు ఆజ్ఞాపించాడు.[20] అమెరికాలో కూడా మసీదు ల నిర్మాణాలు ఊపందుకొన్నాయి. ముఖ్యంగా పట్టణ , నగరప్రాంతాలలో కన్నా ఉప పట్టణ , ఉపనగర ప్రాంతాలలో.[21]

విద్య

మార్చు

మసీదు ల ఇంకో ప్రాథమిక కార్యక్రమం విద్యా సౌలభ్యాలు. యే దేశాలలో అయితే మదరసా సౌకర్యాలు లేవో అలాంటి దేశాలలో మసీదు లే ఇస్లామీయ ధార్మిక విద్యాకేంద్రాలుగా పనిచేస్తున్నాయి. ఈ మదరసా లేక పాఠశాల (సాధారణంగా ధార్మిక విద్యాలయాలు) లో ఇస్లామీయ విద్య అందజేయబడుతుంది. మదరసాలు రెండు రకాలు, ఒకటి మక్తబ్, ఇక్కడ ప్రాథమిక విషయాలు మాత్రమే బోధింపబడుతాయి. ఉదయసాయంకాలాలు ఓ గంట లేదా రెండు గంటలు మాత్రం విద్యనందిస్తారు. రెండోరకం మదరసా లేదా దారుల్ ఉలూమ్, ఇవి పూర్తిసమయ పాఠశాలలు. ఇక్కడ ధార్మిక విద్య సంపూర్ణంగా అందజేయబడుతుంది. మసీదు లు ధార్మికవిషయాల పట్ల లోతైన అవగాహన కొరకు విద్యనొసంగు కేంద్రాలుగా కూడా పనిచేస్తుంటాయి.

కార్యక్రమాలు , ధనసమీకరణలు

మార్చు

మసీదు లకు ఆదాయవనరులు అంతగా ఉండవు, భక్తులు సమర్పించే అతియా లేదా చందాలపై మాత్రమే ఆధారపడి నిర్వహణాకార్యక్రమాలు జరుగుచున్నవి. నికాహ్లు మసీదు లలోనూ జరుపుతారు. ఈ నికాహ్ నుండి వసూలయ్యే ఫీజులు కూడా మసీదు ల నిర్వహణకొరకు ఉపయోగిస్తారు.[14] ఇంకోప్రత్యేకమైన విషయాలు మసీదు లలో కానవస్తాయి, అవి సామూహిక శ్రమదానాలు. వీటితోనే చాలా మొత్తం మిగులవుతుంది.

సమకాలీన రాజకీయ పాత్ర

మార్చు

20వ శతాబ్దపు ఆఖరులో అనేక మసీదు లలో రాజకీయ కార్యక్రమాలు జరిగాయి. పశ్చిమదేశాలలో పౌరకార్యక్రమాలను మసీదు లలో ప్రోత్సహిస్తున్నారు. మసీదు లు ముస్లింసముదాయ సమూహా కేంద్రాలు. శాంతిని సౌభ్రాతృత్వాన్ని, సామాజిక కర్తవ్యాలను బోధించుటకు అనువైన స్థలాలు.

ఉపయోగాలు

మార్చు

ముస్లింలు అల్పసంఖ్యాకులుగా గల దేశాలలో, మసీదు లు పౌరకార్యక్రమాలకొరకు చక్కగా పనికొస్తున్నాయి. సామాజిక అవగాహనా కార్యక్రమాలకొరకు మంచి ఫలితాలనిస్తున్నాయి.[22] అమెరికాలో మసీదు లను ఓటర్ల నమోదు కేంద్రాలుగా ఉపయోగ పడుతున్నాయి. అమెరికాలో ముస్లింలు దాదాపు రెండవ లేక మూడవ తరం పౌరులు. వీరికి అమెరికాలోని పౌర హక్కులు, పౌర కార్యక్రమాల పట్ల సరియైన అవగాహన ఉండకపోవచ్చు. అలాంటి సమయాల్లో ఈ మసీదు లు చక్కటి సామాజిక అవగాహనా కేంద్రాలుగా పనిచేస్తున్నాయి.[22] మసీదు లలో ఇంకో ముఖ్యమైన అవకాశం, ప్రజలను సమకూర్చడం. ముస్లింలు ప్రతిరోజూ ఐదుపూటలా నమాజ్ ఆచరించుటకు మసీదు కు వస్తారు. సాధారణంగా సభలు ఏర్పాటు చేయాలంటే ప్రజలను సమకూర్చే బాధ్యత చాలా బరువైనది. కాని మసీదు లలో ప్రజలు ఎవరూ పిలువకున్ననూ ప్రార్థనలకు హాజరవుతారు, పిలిచే పనిభారం తగ్గుతుంది.[23]

సామాజిక ఘర్షణలు

మార్చు

"బాబ్రీ మసీదు - రామమందిర్" అనే వివాదం కారణంగా ఈ మసీదును కూల్చివేయడం ఫలితంగా దేశమంతటా రాజకీయంగాను, మత పరంగాను తీవ్రమైన స్పందనలు, సంఘర్షణలు చోటు చేసుకొన్నాయి.

నిర్మాణాలు

మార్చు

శైలులు

మార్చు

ఇస్లామీయ ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో వివిధ నిర్మాణశైలులు కానవస్తాయి. ఇందులో

  • అబ్బాసీయుల నిర్మాణ శైలి : ఈ నిర్మాణ శైలిలోని నిర్మాణాకృతులు 'T' ఆకారంలో వుంటాయి.[1]
  • అనటోలియా నిర్మాణ శైలి : ఈ నిర్మాణాల మధ్యలో 'గుంబద్' (డూమ్) లు వుంటాయి.
  • ఉమయ్యద్ ల నిర్మాణ శైలి : ఈ నిర్మాణాలు చతురస్రాకారంలోనూ లేక దీర్ఘచతురస్రాకారంలోనూ వుంటాయి.[1]
  • ఉస్మానియా నిర్మాణ శైలి : ఈ నిర్మాణ శైలిలో గుంబద్ లు మధ్యలోనే కాక ఒకే నిర్మాణంలో పలుచోట్ల వుంటాయి.[1][24]
  • ఇవాన్ నిర్మాణ శైలి : ఈ శైలి ఇరాన్లో ప్రముఖంగా కనిపిస్తుంది. ఈ నిర్మాణ శైలిలో మసీదు ల బయట విశాలమైన 'ఇవాన్' లేక ప్రాంగణం కానవస్తుంది.

మీనార్ లు

మార్చు

మసీదు కు వుండే ఒక సాధారణ లక్షణం మీనార్ వుండడం. మీనార్లు ఎత్తుగాను, నిటారుగాను, నాజూకైన నిర్మాణ హంగును కలిగి వుంటుంది. మసీదు ల ఎత్తును బట్టి మీనర్ల ఎత్తుగూడా పెరుగుతుంది. ప్రారంభకాలపు మసీదు లకు మీనార్లు వుండేవిగావు. తరువాతి కాలంలో ఈ మీనార్లు ముఅజ్జిన్లు అజాన్ పలుకుటకు ఉపయేగించేవారు. మీనార్లు మసీదు ల హుందాతనాన్ని కూడా చాటేవి. అతి ఎత్తైన మీనారు మొరాకో (అరబ్బీ:మరాఖష్) లోని కాసాబ్లాంకా లోగల హసన్ II మసీదులో గలదు.[25]

గుంబద్ లు (గుమ్మటాలు)

మార్చు

గుంబద్లు లేక డూమ్ లు, ప్రార్థనాహాలుల మధ్య ప్రదేశంలో నిర్మింపబడి వుంటాయి. ఈ గుంబద్ లు ఆకాశం , స్వర్గానికి చిహ్నం.[26] సమయానుసారంగఅ ఈ గుంబద్ ల ఆకారం , సైజు పెరుగుతూ వచ్చింది. సాధారణంగా ఈ గుంబద్ లు అర్ధగోళాకారంలోనుంటాయి. మొఘలుల కాలంలో ఈ గుంబద్ లను 'ఉల్లిపాయ' ఆకారంలో నిర్మించారు. ఈలాంటి గుంబద్ లు, దక్షిణాసియా, పర్షియా , భారతదేశంలో కానవస్తాయి.[27] కొన్ని మసీదు లలో ఒకటి కంటే ఎక్కువ గుంబద్ లు కనిపిస్తాయి. ఈ గుంబద్ ల నిర్మాణాలకు కారణం ఇంకోటుంది, ఇమామ్ తన వాణిని వినిపించునపుడు శబ్దతరంగాలు పరావర్తనం చెంది శబ్దం అధికమగుటకు అవకాశము గలదు.

ప్రార్థనా హాలు

మార్చు

ప్రార్థనా హాలుకు ఇంకో పేరు ముసల్లా, ఇందులో ఏలాంటి ఫర్నిచరు వుండదు; కారణం నమాజు ఆచరణా పద్ధతికి ఇవి అనానుకూలం.[28] మసీదు లలో ఇస్లామీయ లిపీ కళాకృతులు ప్రముఖంగా కానవస్తాయి, సాధారణంగా ఖురాన్ సూక్తులు.[14] సాధారణంగా మసీదు లో ప్రవేశద్వారానికి వ్యతిరేక దిశలో ఖిబ్లా వుంటుంది. మసీదు ఖిబ్లా గోడ కాబా వైపున వుంటుంది.[29] నమాజీలు ఖిబ్లా వైపు తిరిగి వరుసక్రమంలో నిలుస్తారు. మిహ్రాబ్ ఖిబ్లా గోడవైపున వుంటుంది. శుక్రవారపు నమాజులో 'ఖతీబ్' (ఖుత్బా ఇచ్చువాడు లేక ప్రసంగీకుడు) మింబర్ పై నిలబడి ఖుత్బా ఇస్తాడు.[30]

వజూ సౌకర్యాలు

మార్చు

వజూ అనగా నమాజ్ ఆచరించడాని ముందు ముఖం, కాళ్ళూ చేతులూ శుభ్రంగా కడుక్కొని, నమాజ్ కొరకు శారీరక శుభ్రతా పరంగా తయారుకావడం. మసీదు లలో వజూ కొరకు 'వజూ ఖానా'లు, నీటికొలను రూపంలోనూ, కొళాయిల రూపంలోని లేదా ఇతర విధాలుగా నీటిసౌకర్యాన్ని కలిగి వుంటాయి.[31] మసీదు లలో చెప్పులు ధరించి వెళ్ళడం నిషేధం, వీటిని వదులుటకు మసీదు ప్రాంగణాలలో ప్రత్యేక స్థలాల ఏర్పాట్లు వుంటాయి.[28]

నిర్దేశాలు , సూత్రాలు

మార్చు

మసీదు లు ఇస్లామీయ సంప్రదాయాల నిలయాలు, ఇందు అనేక నిర్దేశాలు సూత్రాలూ గలవు, ఇవన్నియూ అల్లాహ్ను ప్రార్థించి అతన్ని ప్రసన్నుడిని చేసుకొనుటకొరకే. మసీదు లో పాదరక్షలు ధరించిరావడం ప్రపంచంలోని అన్ని మసీదు లలోనూ నిషేధం. మరికొన్ని నిర్దేశాలు;

ఇమామ్ నియామకం

మార్చు

మసీదు లో ప్రార్థనల నిర్వహణకు ఇమామ్ అవసరం. అతడు తర్ఫీదు పొందినవాడైయుండుట నియమం.[32]ఇమామ్ ధార్మికవిషయాలలో అధికారికంగా వ్యవహరిస్తాడు.[32] మసీదు లు వివిధదేశాలలో వివిధ విధంగా మసీదు లనిర్మాణాలు జరుగుతాయి. ఇస్లామిక్ దేశాలలో ప్రభుత్వాలు వీటిని నిర్మిస్తాయి.[32] మన దేశంలో వీటిని ప్రభుత్వాలు నిర్మించవు. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి, చందాలు సేకరించి వీటి నిర్మాణాలు చేయిస్తారు. కాని వీటి నియంత్రణ మాత్రం వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉంటుంది. మసీదు, మదరసాల నిర్మాణాలకు ప్రభుత్వాల అనుమతి అవసరం చేయబడాలి. ఎక్కడైనా ప్రజలు వీటిని నిర్మింప దలిస్తే ప్రభుత్వాలు వీటికొరకు ఉదారంగా అనుమతులు ఇవ్వాలి. వక్ఫ్ బోర్డుల ఆధ్వర్యంలో పకడ్బందీగా వీటి నిర్వహణ ఉంచాలి. ఇమామ్ ల నియామకాధికారం స్థానిక మసీదు ల కమిటీల చేతుల్లోనే వుంటుంది. వీటిని వక్ఫ్ బోర్డు చేతుల్లోకి మార్చాలి.

పరిశుభ్రత

మార్చు

మసీదు లలో పరిశుభ్రత చాలా అవసరం. వజూ అందులోని భాగమే. పాదరక్షలు బయటనే వుంచవలెను. నమాజ్ కు వచ్చు భక్తులు చక్కటి పరిశుభ్రత పాటిస్తారు.

ఇస్లాం పరస్పర గౌరవాన్ని ప్రకటించే బట్టలు, శరీరాన్ని కప్పివుంచే ధారణల కొరకు నిర్దేశిస్తుంది. శరీరాన్ని బహిర్గతంచేయడం షైతాన్ పనిగా చెబుతుంది. మసీదు కు వచ్చువారు శుభ్రమైన బట్టలు ధరిస్తారు, శరీరపు ఆకృతులు బగిర్గతం చేసే బట్టలు నిషేధం. బిగుతైన బట్టలు ధరించడం నగ్నత్వంతో సమానమని నిర్దేశిస్తుంది. పురుషులు లూజైన బట్టలు ధరించాలి, తమ మోజేతివరకు బట్టలు ధరించాలి. స్త్రీలు హిజాబ్ ధరించడం నియమం.[14]

ధ్యానం

మార్చు

మసీదు లు ప్రార్థనా గృహాలు, ఇక్కడ శబ్దాలు నిషేధం, ప్రార్థనలు ధ్యానంతో ఆరంభమయి ధ్యానంతోనే అంతమౌతాయి. బిగ్గరగా మాట్లాడడం, ఇతరుల ధ్యానాన్ని భంగం చేయడం తగదు.[33] మసీదు ల యందు గోడలపై ఏలాంటి ఆకృతులు వుండవు, ఇస్లామీయ లిపీకళాకృతులు అవీ ఖురాన్ సూక్తులు వుంటాయి కావున ధ్యానభంగం కలిగే స్థితులే వుండవు, మిగతా ధ్యానవిషయాలు భక్తులపైనే ఆధారపడి వుంటాయి

స్త్రీ పురుషులకు వేరు వేరు ఏర్పాట్లు

మార్చు
 
శ్రీనగర్ లోని ఒక మసీదు లో పురుషులు తమకు కేటాయింపబడిన ప్రార్థనాహాలులో ప్రార్థనలు ఆచరిస్తున్నారు.

షరియా ప్రకారం స్త్రీ పురుషులకు ప్రార్థనాలయాలలో వేరు వేరు ఏర్పాట్లు వుంటాయి. మహమ్మదు ప్రవక్త స్త్రీలకు ఇండ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని కోరారు.[34]

మసీదు లలో ముస్లిమేతరులు

మార్చు

షరియా న్యాయసూత్రాలనుసరించి మసీదు లలో ముస్లిమేతరులకు ప్రవేశం నిషేధం లేదు. కానీ వారుకూడా శుధ్ధిగానూ నిర్మలంగాను పవిత్రమయిన హ్రదయంతో కల్మషాలు లేకుండా వుండవలెను. మాలికి మజ్ హబ్ ఫిఖహ్ ప్రకారం ముస్లిమేతరులకు ఏలాంటి పరిస్థితులలోనూ ప్రవేశముండరాదు అని వాదిస్తారు.[32] ఖురాన్లో ఈ విధంగా ప్రవచింప బడినది; బహుదేవతారాధకుల గురించి అత్ తౌబా సూరా లో ఈ విధంగా వర్ణించబడింది.

అల్లాహ్ స్థానంలో బహుదేవతారాధన నిషేధం, ఇలాంటి బహుదేవతారాధకులకు మసీదు ల నిర్వహణ అంటగట్టడం అవివేకం, వారు తమ అంతరాత్మకే విరుధ్ధంగా ముష్రిక్ లయ్యారు. వీరి కార్యములు సత్ఫలితాలనివ్వదు: నరకాగ్ని వీరి నివాసం. (యూసుఫ్ అలీ (ఖురాన్ : 9-17)

ఇదే సూరాలోని 28వ సూక్తి ముస్లిమేతరులకు మసీదు-అల్-హరామ్ మక్కాలో ప్రవేశం గూర్చి ఇంకనూ స్పష్ఠంగా చెబుతుంది;

ఓ విశ్వాసులారా! సత్యంగా పాగన్లు (అరేబియాకు చెందిన బహువిగ్రహారాధకులు) అశుధ్ధులు; కావున వారిని ఈ సంవత్సరం నుండి మసీదు పరిసరాలకు కూడా రానీయకండి. మీరు పేదరికం గూర్చి భయపడుతున్నారా! (భయపడకండి) తొందరలోనే మిమ్ములను అల్లాహ్ ధనవంతులు చేస్తాడు, అతను కోరుకుంటే, అతని కరుణ ద్వారా, అల్లాహ్ అంతయూ తెలిసినవాడు, సర్వజ్ఞాని. (యూసుఫ్ అలీ ఖురాన్ : 9-28)

నవీన కాలంలో సౌదీ అరేబియా లోని మసీదు-అల్-హరామ్, మసీదు-ఎ-నబవి లలో ముస్లిమేతరులకు ప్రవేశం నిషిద్ధం. అదే విధంగా అరేబియా ప్రాంతంలోని ఇతర మసీదు లలో కూడా ముస్లిమేతరులకు ప్రవేశం నిషిధ్ధం.[35] ప్రపంచంలోని ఇతరప్రాంతాలలో కొన్ని నిర్దిష్ఠమైన సమయాలలో, మసీదు ల నిర్వాహకుల అనుమతితో ప్రవేశం జరుగుతుంది.[14]

మసీదులో క్రైస్తవుల ప్రార్థనలు

మార్చు

నజ్రాన్ నుండి కొందరు క్రైస్తవ పండితులు ప్రవక్తగారిని కలిసి తమ సందేహాలను తీర్చుకోవడానికి మదీనా వచ్చారు. ప్రవక్త గారిని కలిసి మదీనాలోనే మూడు రోజులు మకాం ఐనారు. ఈ సందర్భంగా ఆదివారం వచ్చింది, క్రైస్తవుల ఆదివార ప్రార్థనల్ని మసీదులోనే చేసుకొమ్మని ప్రవక్త చెబితే అక్కడే వారు ప్రార్థన చేసుకున్నారు. క్రైస్తవులూ ఏకేశ్వరోపాసకు, తమప్రార్థనలు శాంతితో చేసేవారు. చర్చీలలో ఇదేవిషయం కానవస్తుంది. (సాక్షిలో అబ్దుల్ హక్ వివరణ 27.6.2008)

ప్రఖ్యాత మసీదు లు

మార్చు

ఇవీచూడండి

మార్చు



మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Masdjid1 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. Weinsinck, A.J. P.J. Bearman, Th. Bianquis, C.E. Bosworth, E. van Donzel and W.P. Heinrichs (ed.). Masdjid al-Haram. Brill Academic Publishers. ISSN 1573-3912. {{cite encyclopedia}}: |work= ignored (help)CS1 maint: multiple names: editors list (link)
  3. "Masjid Quba'". Ministry of Hajj - Kingdom of Saudi Arabia. Retrieved 2006-04-15.
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; first-state అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. "The Ottoman: Origins". Washington State University. Archived from the original on 2006-04-09. Retrieved 2006-04-15.
  6. "Cairo, Egypt". The Independent. Archived from the original on 2007-05-28. Retrieved 2007-09-22.
  7. "Theoretical Issues of Islamic Architecture". Foundation for Science Technology and Civilisation. Retrieved 2006-04-07.
  8. Cowen, Jill S. (July 1985). "Muslims in China: The Mosque". Saudi Aramco World. pp. 30–35. Archived from the original on 2006-03-22. Retrieved 2006-04-08.
  9. "Mosques". Charlotte Country Day School. Archived from the original on 2006-05-07. Retrieved 2006-04-07.
  10. Lawton, John (January 1979). "Muslims in Europe: The Mosque". Saudi Aramco World. pp. 9–14. Archived from the original on 2006-03-22. Retrieved 2006-04-17.
  11. (2001). "The Mosque in America: A National Portrait". Council on American-Islamic Relations. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original on 2007-05-10. Retrieved 2020-12-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  12. Wagner, William (2004) [2004]. How Islam Plans to Change the World. Kregel Publications. p. 99. ISBN 0-8254-3965-5. Retrieved 2006-06-22. When the Moors were driven out of Spain in 1492, most of the mosques were converted into churches
  13. "Prayer in Congregation". Compendium of Muslim Texts. University of Southern California. Archived from the original on 2006-06-28. Retrieved 2006-04-06.
  14. 14.0 14.1 14.2 14.3 14.4 14.5 Maqsood, Ruqaiyyah Waris (2003-04-22). Teach Yourself Islam (2nd ed.). Chicago: McGraw-Hill. pp. 57–8, 72–5, 112–120. ISBN 0-07-141963-2.
  15. "Fiqh-us-Sunnah, Volume 4: Funeral Prayers (Salatul Janazah)". Compendium of Muslim Texts. University of Southern California. Archived from the original on 2006-05-25. Retrieved 2006-04-16.
  16. "Eclipses". Compendium of Muslim Texts. University of Southern California. Archived from the original on 2006-06-21. Retrieved 2006-04-16.
  17. "'Id Prayers (Salatul 'Idain)". Compendium of Muslim Texts. University of Southern California. Archived from the original on 2005-12-23. Retrieved 2006-04-08.
  18. "Charity". Compendium of Muslim Texts. University of Southern California. Archived from the original on 2006-02-05. Retrieved 2006-04-17.
  19. Abouei, Reza. "Urban Planning of Isfahan in the Seventeenth Century" (PDF). University of Sheffield School of Architecture. Archived from the original (PDF) on 2006-05-24. Retrieved 2006-04-07.
  20. Madanipour, Ali (2003-05-09). Public and Private Spaces of the City. Routledge. pp. 207. ISBN 0-415-25629-1.
  21. Abdo, Geneive (2005). "Islam in America: Separate but Unequal". The Washington Quarterly. 28 (4): 7–17. Archived from the original on 2007-06-21. Retrieved 2006-04-07.
  22. 22.0 22.1 Jamal, Amany. "The Role of Mosques in the Civic and Political Incorporation of Muslim American". Teachers' College – Columbia University. Archived from the original on 2007-09-28. Retrieved 2006-04-22.
  23. Swanbrow, Diane (2005-06-23). "Study: Islam devotion not linked to terror". The University Record Online. Archived from the original on 2006-12-30. Retrieved 2007-02-24.
  24. "Vocabulary of Islamic Architecture". Massachusetts Institute of Technology. Archived from the original on 2006-09-18. Retrieved 2006-04-09.
  25. Walters, Brian (2004-05-17). "The Prophet's People". Call to Prayer: My Travels in Spain, Portugal and Morocco. Virtualbookworm Publishing. p. 14. ISBN 1-58939-592-1. Its 210-meter minaret is the tallest in the world
  26. Mainzer, Klaus (1996-06-01). "Art and Architecture". Symmetries of Nature: A Handbook for Philosophy of Nature and Science. p. 124. ISBN 3-11-012990-6. the dome arching over the believers like the spherical dome of the sky
  27. Asher, Catherine B. (1992-09-24). "Aurangzeb and the Islamization of the Mughal style". Architecture of Mughal India. Cambridge University Press. pp. 256. ISBN 0-521-26728-5.
  28. 28.0 28.1 "Mosque FAQ". The University of Tulsa. Archived from the original on 2004-12-30. Retrieved 2006-04-09.
  29. Bierman, Irene A. (1998-12-16). Writing Signs: Fatimid Public Text. University of California Press. pp. 150. ISBN 0-520-20802-1.
  30. "Terms 1: Mosque". University of Tokyo Institute of Oriental Culture. Retrieved 2006-04-09.
  31. "Religious Architecture and Islamic Cultures". Massachusetts Institute of Technology. Retrieved 2006-04-09.
  32. 32.0 32.1 32.2 32.3 Abu al-Hasan Ali Ibn Muhammad Ibn Habib, Al-Mawardi (2000). The Ordinances of Government (Al-Ahkam al-Sultaniyya w’al-Wilayat al-Diniyya). Lebanon: Garnet Publishing. p. 184. ISBN 1-85964-140-7.
  33. Connecting Cultures, Inc.. "Building Cultural Competency: Understanding Islam, Muslims, and Arab Culture" (Doc). Connecting Cultures, Inc.. Archived 2006-07-24 at the Wayback Machine "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2006-07-24. Retrieved 2008-02-09.
  34. Doi, Abdur Rahman I. "Women in Society". Compendium of Muslim Texts. University of Southern California. Archived from the original on 2006-04-09. Retrieved 2006-04-15.
  35. Goring, Rosemary (1997-05-01). Dictionary of Beliefs & Religions. Wordsworth Editions. ISBN 1-85326-354-0.
  36. Miller, Pamela (2006-01-07). "Journey of a lifetime". Star Tribune. p. 12E.
  37. Abu-Nasr, Donna (2004-12-09). "Many Saudis criticize attack". Ventura County Star. p. 16.
  38. "Arafat to be buried in soil from Islam's third holiest site". Associated Press. 2004-11-11.
  39. "Press Release: First in Pakistan". Embassy of Pakistan, Washington, D.C. Archived from the original on 2006-04-27. Retrieved 2006-04-10.
  40. "Building Big: Databank: Hagia Sophia". PBS. Retrieved 2006-04-10.
  41. Lach, Donald F., and Edwin J. Van Kley (1998-12-01). "The Empire of Aurangzib". Asia in the Making of Europe:. University of Chicago Press. p. 721. ISBN 0-226-46767-8. The Jami Masjid, the largest mosque in India{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)

పుస్తకాలు , పత్రికలు

మార్చు
  • Accad, Martin (2003). "The Gospels in the Muslim Discourse of the Ninth to the Fourteenth Centuries: An Exegetical Inventorial Table (Part I)". Islam and Christian-Muslim Relations. 14 (1). ISSN 0959-6410.
  • Adil, Hajjah Amina; Shaykh Nazim Adil Al-Haqqani, Shaykh Muhammad Hisham Kabbani (2002). Muhammad: The Messenger of Islam. Islamic Supreme Council of America. ISBN 978-1-930409-11-8.
  • Ahmed, Akbar (1999). Islam Today: A Short Introduction to the Muslim World (2.00 ed.). I. B. Tauris. ISBN 978-1-86064-257-9.
"https://te.wikipedia.org/w/index.php?title=మసీ​దు&oldid=4213368" నుండి వెలికితీశారు