బుర్హాన్‌పూర్ (మధ్య ప్రదేశ్)

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని నగరం

బుర్హాన్‌పూర్ మధ్యప్రదేశ్ లోని నగరం, బుర్హాన్‌పూర్ జిల్లా ముఖ్యపట్టణం. ఇది తప్తీ నది ఉత్తర ఒడ్డున, రాష్ట్ర రాజధాని నగరం భోపాల్‌కు నైరుతిలో 340 కి.మీ. దూరంలో ఉంది. నగర పరిపాలనను మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది.

బుర్హాన్‌పూర్
నగరం
పైనుండి, ఎడమ నుండి కుడికి: బుర్హాన్‌పూర్ పట్టణ వీధులు, షాహీ కిలా, అసీర్‌గఢ్ కోట, జామా మసీదు, దర్గా-ఇ-హకీమీ, బుర్హాన్‌పూర్ రైల్వే స్టేషను
బుర్హాన్‌పూర్ is located in Madhya Pradesh
బుర్హాన్‌పూర్
బుర్హాన్‌పూర్
మధ్య ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 21°18′N 76°14′E / 21.3°N 76.23°E / 21.3; 76.23
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాబుర్హాన్‌పూర్
స్థాపన1380
విస్తీర్ణం
 • Total181.06 km2 (69.91 sq mi)
Elevation
247 మీ (810 అ.)
జనాభా
 (2011)[1]
 • Total2,10,891
 • జనసాంద్రత1,200/km2 (3,000/sq mi)
భాషలు
 • అధికారికహిందీ[2]
Time zoneUTC+5:30 (IST)
PIN
450331
టెలిఫోన్ కోడ్(+91) 7325
ISO 3166 codeIN-MP
Vehicle registrationMP-68

రవాణా సౌకర్యాలు

మార్చు

బుర్హాన్‌పూర్ ఒక చారిత్రక నగరం. నగరంలో ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడి నుండి భారతదేశంలోని ఇతర నగరాలకు చక్కటి రైలు సౌకర్యాలున్నాయి. సమీప నగరాలకు ప్రయాణించడానికి సాధారణ బస్సులు అందుబాటులో ఉన్నాయి. సమీప విమానాశ్రయం జల్గావ్ విమానాశ్రయం. ఇది నగరానికి ఉత్తరం వైపున ఉంది.

చరిత్రచరిత్ర

మార్చు

1601 లో, మొఘల్ చక్రవర్తి అక్బర్ ఖాందేష్ సుల్తానేట్ను స్వాధీనం చేసుకున్నాడు. బుర్హాన్‌పూర్‌ ఖాందేష్ సుబాకు రాజధాని అయింది. [3] మొఘల్ సామ్రాజ్యంలోని మూడు కొత్త ఉన్నత స్థాయి ప్రావిన్సులలో ఒకటి అయింది (1869 లో బెరార్ సుబా, 1601-35 లో అహ్మద్ నగర్ సుబా వంటివి). అతను డెక్కన్‌ను జయించుకుంటూ పోయే కొద్దీ మొదట ఉన్న డజను సుబాలకు మరిన్ని చేర్చాల్సి వచ్చింది. అక్బర్ కుమారుడు దానియల్ పేరిట ఖాందేష్ పేరును దానేష్ గా మార్చారు. 1609 లో, మొఘల్ చక్రవర్తి జహంగీర్ తన రెండవ కుమారుడు పర్విజ్‌ను దక్కన్ మొఘల్ ప్రావిన్సులకు రాజప్రతినిధిగా నియమించాడు. యువరాజు బుర్హన్‌పూర్‌ను తన ప్రధాన కార్యాలయంగాను, తన నివాసంగానూ ఎంచుకున్నాడు.

1705 లో, సంతాజీ ఘోర్పడే బుర్హాన్‌పూర్‌, ఖాందేష్ సుబాలపై దాడి చేసాడు. దానితో ఔరంగజేబు ఖాందేష్‌లో మరిన్ని బలగాలను మోహరించవలసి వచ్చింది. దీనివలన కర్ణాటక, మరాఠా స్వరాజ్యాలపై మొఘల్ సైన్యాల ఒత్తిడి తగ్గింది. 1720 లలో, మాళ్వా, ఢిల్లీలపై చేసిన దండయాత్రలో మరాఠా పేష్వా బాజీరావ్ నగరాన్ని ఆక్రమించాడు. 1750 లలో, హైదరాబాద్ నిజాంను ఓడించిన సదాశివరావు భావు ఆధ్వర్యంలోని మరాఠా సైన్యం నగరాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. మరాఠా సామ్రాజ్యం పతనమైనప్పుడు, ఈ నగరాన్ని సింధియాలోని మరాఠా సర్దార్ హోల్కార్ అధీనం లోకి వెళ్ళింది. చివరికి 1818 లో మరాఠాలు బ్రిటిష్ వారికి అప్పగించారు. [4]

భౌగోళికం

మార్చు

బుర్హాన్‌పూర్ మధ్యప్రదేశ్ నైరుతి సరిహద్దులో, తపతి నది ఒడ్డున ఉంది.

జనాభా

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం బుర్హాన్‌పూర్ జనాభా 2,10,886, వీరిలో పురుషులు 1,08,187, మహిళలు 1,02,699. ఆరేళ్ళ లోపు పిల్లలు 28,930, వీరిలో 15,035 మంది పురుషులు, 13,895 మంది మహిళలు ఉన్నారు. బుర్హాన్‌పూర్‌లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 1,47,056, ఇది జనాభాలో 69.7%, పురుషుల అక్షరాస్యత 73.3% స్త్రీల అక్షరాస్యత 65.9%. బుర్హాన్‌పూర్‌లో ఏడేళ్ళకు పైబడిన వారిలో అక్షరాస్యత రేటు 80.8%, ఇందులో పురుషుల అక్షరాస్యత 85.1%, స్త్రీల అక్షరాస్యత 76.3%. షెడ్యూల్డ్ కులాల జనాభా14,440, షెడ్యూల్డ్ తెగల జనాభా 2,179. బుర్హాన్‌పూర్ లో 2011 లో 38,118 గృహాలున్నాయి. [1]

పరిశ్రమలు

మార్చు

బుర్హాన్‌పూర్ వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. రాష్ట్రంలో విద్యుత్ మగ్గం పరిశ్రమకు ఇది అతిపెద్ద కేంద్రంగా ఉంది. ఇక్కడ ఒక ఎన్‌టిసి (నేషనల్ టెక్స్‌టైల్ కార్పొరేషన్) ప్రాజెక్టు ఉంది. ఇంటర్‌లైన్ బట్టలు, గ్రే మార్కిన్, బ్లీచెడ్ ధోతి, కేంబ్రిక్, విద్యుత్ మగ్గం వస్త్రం బక్రామ్, ఇతర రకాల వస్త్రా‌లకు ఇది ప్రసిద్ది చెందింది. నగరంలో అనేక నూలు మిల్లులు, నూనె మిల్లులు కూడా ఉన్నాయి. [5]

ప్రజా సంస్కృతిలో

మార్చు
  • జూల్స్ వెర్న్ రాసిన అరౌండ్ ది వరల్డ్ లో 80 డేస్ లో ఈ నగరాన్ని బుర్హాంపూర్ గా పేర్కొన్నాడు. [6]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Census of India: Burhanpur". www.censusindia.gov.in. Retrieved 26 October 2019.
  2. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). Nclm.nic.in. Ministry of Minority Affairs. p. 45. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 10 జనవరి 2021.
  3. Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. p. 164. ISBN 978-9-38060-734-4.
  4. Jaswant Lal Mehta (1 January 2005). Advanced Study in the History of Modern India 1707-1813. Sterling Publishers Pvt. Ltd. pp. 212–. ISBN 978-1-932705-54-6. Retrieved 2 June 2012.
  5. "Brief Industrial Profile of Burhanpur District" (PDF). Government of India Ministry of MSME. p. 3. Archived from the original (PDF) on 22 మార్చి 2020. Retrieved 24 November 2019.
  6. "The Project Gutenberg eBook of Around the World in Eighty Days, by Jules Verne". www.gutenberg.org. Retrieved 6 October 2020.