బూడ్దిపాడు
బూడ్దిపాడు, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, మానోపాడ్ మండలానికి చెందిన గ్రామం.
ప్రస్తుతం ఈ గ్రామం నిర్జన గ్రామం. ఒకప్పుడు జనావాసంగా ఉండిన ఈ గ్రామం కారాణాంతరాలచే నేడు కనుమరుగైపోయింది. మానోపాడ్, అలంపూర్ మండలాల సరిహద్దులో ఈ గ్రామం ఉండేది. ఒకనాటి ఈ గ్రామానికి సమీపంలో ఉన్న మూడు రోడ్ల కూడలిని నేడు బూడ్దిపాడు స్టేజి గా వ్యవహరిస్తున్నారు. ఈ మూడు రహదారులలో ఒకటి అలంపూర్ కు,మరొకటి ఉండవెల్లికి, ఇంకోటి అలంపూర్ చౌరస్తాకు మార్గాలు. ప్రస్తుతం ఈ స్టేజి దగ్గర ఆర్.డి.ఎస్. క్యాంప్ ఉంది. క్యాంప్‌కు సమీపంలోనే శ్రీఆంజనేయస్వామి దేవాలయం, దాని వెనుక మౌలాలి స్వామి దర్గా ఉన్నాయి. సమీపంలో కొన్ని పరిశ్రమలు కూడా ఉన్నాయి.
చిత్రమాల
మార్చు-
మౌలాలిస్వామి దర్గా, బూడ్దిపాడు
-
ఆర్.డి.ఎస్. క్యాంప్, బూడ్దిపాడు