జోగులాంబ గద్వాల జిల్లా

తెలంగాణ లోని జిల్లా

జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా పరిపాలన కేంద్రం గద్వాల.[1]ఈ జిల్లా 2016 అక్టోబరు 11న అవతరించింది. ఈ జిల్లాలో 12 మండలాలు, 1 రెవెన్యూ డివిజన్ ఉన్నాయి. ఇందులోని అన్ని మండలాలు మునుపటి మహబూబ్ నగర్ జిల్లా లోనివే.[2].

జోగులాంబ జిల్లా
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా స్థానం
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
ముఖ్య పట్టణంగద్వాల
విస్తీర్ణం
 • మొత్తం2,928 చ.కి.మీ. కి.మీ2 (Formatting error: invalid input when rounding చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం6,64,971
జనాభా వివరాలు
 • అక్షరాస్యత51 శాతం
Vehicle registrationTS-33

భౌగోళిక పరిస్థితి

మార్చు
 
జోగులాంబ గద్వాల జిల్లా
 
జోగులాంబ గద్వాల జిల్లా

ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదునుండి నైరుతి దిశలో 200 కిలోమీటర్ల దూరంలో పూర్వపు జిల్లా కేంద్రం మహబూబ్ నగర్ కి దక్షిణాన 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జిల్లా పేరు వెనుక చరిత్ర

మార్చు

దేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన ఐదవ శక్తి పీఠం జోగులాంబ అమ్మ వారి పేరిట ఈ జిల్లాకు నామకరణం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది నారాయణపేట జిల్లాలో ప్రవేశించిన పిదప, జోగులాంబ గద్వాల జిల్లాలో అడుగుపెడుతుంది. తుంగభద్ర నది ప్రవహించే ఏకైక తెలంగాణ జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా మాత్రమే.

సమీప జిల్లాలు, నదులు

మార్చు

ఈ జిల్లాకు దక్షిణాన తుంగభద్ర నది, కర్నూలు జిల్లా; ఉత్తర, ఈశాన్య, తూర్పు, నైరుతి దిశల్లో వనపర్తి జిల్లా; పశ్చిమ, వాయువ్య దిశల్లో కర్ణాటక లోని రాయచూరు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. ఉత్తర భాగంలో నారాయణపేట జిల్లాతోనూ అతి స్వల్పంగా సరిహద్దు ఉంది.

జిల్లా ప్రముఖులు

మార్చు
 
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, జోగులాంబ గద్వాల జిల్లా

సురవరం ప్రతాపరెడ్డి, పాగ పుల్లారెడ్డి లాంటి స్వాతంత్ర్య సమరయోధులు, గడియారం రామకృష్ణ శర్మ లాంటి సాహితీవేత్తలు, సురవరం సుధాకర్ రెడ్డి, డి.కె.సమర సింహారెడ్డి, డి. కె. భరతసింహారెడ్డి, డి. కె. అరుణ, ఆముదాలపాడు జితేందర్ రెడ్డి, మందా జగన్నాథం లాంటి వర్తమాన రాజకీయవేత్తలకు ఈ జిల్లా పుట్టినిల్లు.

ప్రత్యేకతలు

మార్చు

చేనేత వస్త్రాలకు పేరుగాంచిన గద్వాల, రాజోలి, కాకతీయుల సామంత రాజ్యానికి రాజధానిగా విలసిల్లిన వల్లూరు, ఒకప్పుడు మామిడిపండ్లకు పేరుగాంచిన అలంపూర్, కృష్ణా, తుంగభద్రల నడుమ 60 కిలోమీటర్ల మేర సాగిపోయే 44వ నెంబరు జాతీయ రహదారి, రెండు రాష్ట్రాలను కలుపుతూ రెండు నదులపై రెండు వంతెనలు, సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం ఈ జిల్లానుంచే వెళ్ళుచున్నాయి.

పరిపాలనా విభాగాలు

మార్చు
 

జిల్లాలోని మండలాలు

మార్చు

మునుపటి మహబూబ్ నగర్ జిల్లా లోని తొమ్మిది మండలాలు విడగొట్టి నూతనంగా ఏర్పడిన ఈ జిల్లాలో విలీనం చేసారు.వడ్డేపల్లి మండలంలోని రాజోలి,మానవపాడ్ మండలంలోని ఉండవెల్లి, గట్టు మండలంలోని కాలూర్‌తిమ్మన్‌దొడ్డి గ్రామాలు కొత్తమండలాలుగా ఏర్పడినవి.[3]

క్ర. సం. గద్వాల శాసన సభ నియోజక వర్గం
1 గద్వాల మండలం
2 మల్దకల్ మండలం
3 ధరూర్ మండలం
4 గట్టు మండలం
5 కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలం *
క్ర. సం. అలంపూర్ శాసనసభ నియోజక వర్గం
6 అలంపూర్ మండలం
7 మానవపాడ్ మండలం
8 ఇటిక్యాల మండలం
9 వడ్డేపల్లి మండలం
10 ఉండవెల్లి మండలం *
11 రాజోలి మండలం *
12 అయిజ మండలం

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (3)

జిల్లాలో దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు

మార్చు

చిత్రమాల

మార్చు

ప్రధానమైన పంటలు.

మార్చు

ఈ జిల్లాలో పత్తి, వేరుశనగ, శనగ, మిరప, వరి ముఖ్యమైన పంటలు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-04-20.
  2. తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247; Revenue (DA - CMRF) Department, Dt: 11-10-2016
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-04-20.
  4. ఆంధ్రప్రదేశ్ దర్శిని, 1982 ముద్రణ, పేజీ 133

వెలుపలి లింకులు

మార్చు