బృందావని వుంది (పాట)
బృందావని వుంది పాట 1984లో విడుదలైన కాంచనగంగ చిత్రంలోని పాట. ఈ పాట రాసినందుకు వేటూరి సుందరరామ్మూర్తి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. కె. చక్రవర్తి సంగీతం అందించిన ఈ పాటను ఎస్.పి. బాలసుబ్రమణ్యం పాడాడు.[1]
"బృందావని వుంది" | |
---|---|
రచయిత | వేటూరి సుందరరామ్మూర్తి |
సంగీతం | కె. చక్రవర్తి |
సాహిత్యం | వేటూరి సుందరరామ్మూర్తి |
ప్రచురణ | కాంచనగంగ (1984) |
రచింపబడిన ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
భాష | తెలుగు |
గాయకుడు/గాయని | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
పాటలోని సాహిత్యం
మార్చుపల్లవి:
బృందావని ఉంది.. యమునా నది ఉంది
మధురాపురి ఉంది… కాళింది ఉంది…
లేని వాడొక్కడే శ్రీకృష్ణమూర్తి
కలిలోన శిలయైన కళ్యాణ మూర్తి….
చరణం 1:
పుట్టగానే పెరిగేటి మాయబంధనాలకన్నా…
పుడుతూనే తొలిగేటి చెరసాలలే మిన్న…
ఆ కిటుకు తెలిసేరా…
ఆ కిటుకు తెలిసేరా… శ్రీకృష్ణమూర్తి
చెరసాలలో పుట్టె చైతన్యమూర్తి.
పురస్కారాలు
మార్చు- వేటూరి సుందరరామ్మూర్తి - ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారాలు - 1984.
మూలాలు
మార్చు- ↑ తెలుగు వన్, ప్రివ్యూ. "వేటూరి జయంతి". www.teluguone.com. Retrieved 22 December 2020.