నంది పురస్కారాలు
సినిమా, నాటక, టీవీ రంగాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుయ్త్వం అందించే పురస్కారాలు
(నంది బహుమతి నుండి దారిమార్పు చెందింది)
నంది పురస్కారాలు అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమాలకు ఏటా ఇచ్చే పురస్కారాలు. తెలుగు చరిత్ర, కళలకు ప్రతీకలలో ఒకటైన లేపాక్షి నంది పేరిట ఉత్తమ చిత్రాలకు,, ఉత్తమ కళాకారులకు ఈ పురస్కారాలు ఇస్తారు. ఈ సంప్రదాయం 1964 సంవత్సరములో ప్రారంభమైనది. ఆ రోజులలో చిత్ర నిర్మాణము చాలా తక్కువగా ఉండేది, ఏడాదికి సుమారు 25 నుండి 30 వరకు చిత్రాలు మాత్రమే తయారవుతుండేవి. రాను రాను వాటి సంఖ్య 125 నుండి 130 వరకూ పెరిగింది. చిత్ర నిర్మాణం సరళి, నాణ్యత, ప్రమాణాలు తగ్గుతూ భారీ వ్యయ ప్రయాసలకు లోనవుతుంది. మొదటిలో బంగారు, రజిత, కాంస్య నంది అనే 3 బహుమతులూ కథకు 2 బహుమతులూ, మొత్తము 5 పురస్కారాలుండేవి. చిత్ర నిర్మాణములో అన్ని శాఖలకు గుర్తింపు, ప్రోత్సాహము అందించే విధంగా ఇప్పుడు 42 నందులకు పెరిగినవి.
నంది పురస్కారాలు
మార్చు- ఉత్తమ చిత్రాలు
- ఉత్తమ నటులు
- ఉత్తమ నటీమణులు
- ఉత్తమ దర్శకులు
- ఉత్తమ నూతన దర్శకులు
- ఉత్తమ సంగీతదర్శకులు
- ఉత్తమ సహాయనటులు
- ఉత్తమ సహాయనటీమణులు
- ఉత్తమ నేపథ్య గాయకులు
- ఉత్తమ నేపథ్య గాయనీమణులు
- ఉత్తమ సినిమాపుస్తకాలు
- ఉత్తమ సినిమా ఎడిటర్లు
- ఉత్తమ ఛాయాగ్రహకులు
- ఉత్తమ ప్రతినాయకులు
- ఉత్తమ డబ్బింగు కళాకారిణి
- ఉత్తమ డబ్బింగు కళాకారుడు
- ఉత్తమ కథా రచయితలు
- ఉత్తమ గీత రచయితలు
- ఉత్తమ హాస్యనటులు
- ఉత్తమ హాస్యనటీమణులు
- ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లు
- ఉత్తమ బాలనటులు
- ఉత్తమ బాలనటీమణులు
- స్పెషల్ ఎఫెక్ట్స్
- అక్కినేని అవార్డు పొందిన చిత్రాలు