బెంగళూరు వైద్య కళాశాల
(బెంగళూరు మెడికల్ కాలేజ్ నుండి దారిమార్పు చెందింది)
బెంగళూరు వైద్య కళాశాల (బెంగళూరు మెడికల్ కాలేజ్, ప్రస్తుతం బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గా పేరు మార్చబడింది, దీనిని బిఎంసి అని పిలుస్తారు) అనేది కర్ణాటక ప్రభుత్వంచే నడపబడుతున్న ఒక వైద్య కళాశాల, పరిశోధనా సంస్థ. ఇది బెంగళూరులోని కృష్ణ రాజేంద్ర రోడ్ (KR రోడ్) లో సిటీ మార్కెట్ దగ్గర ఉంది. ఇది ప్రభుత్వ వైద్య కళాశాల. ఇది బెంగళూరులోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఉన్న ఒక స్వయంప్రతిపత్తి సంస్థ. దీని కింద నాలుగు ప్రధాన ఆసుపత్రులు అనేక ఇతర ఆసుపత్రులు ఉన్నాయి.
పూర్వపు నామములు | బెంగళూరు మెడికల్ కాలేజీ |
---|---|
రకం | ప్రభుత్వ వైద్య కళాశాల |
స్థాపితం | 1955 |
డీన్ | Dr.C R జయంతి |
అండర్ గ్రాడ్యుయేట్లు | సంవత్సరానికి 250 |
పోస్టు గ్రాడ్యుయేట్లు | సంవత్సరానికి 135 |
డాక్టరేట్ విద్యార్థులు | సంవత్సరానికి 12 |
ఇతర విద్యార్థులు | సంవత్సరానికి 420a |
స్థానం | బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం 12°57′33.78″N 77°34′29.07″E / 12.9593833°N 77.5747417°E |
కాంపస్ | పట్టణ, 200 ఎకరాలు |
అనుబంధాలు | రాజీవ్ గాంధీ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం, స్వయంప్రతిపత్తి (అటానమస్) |
జాలగూడు | అధికారిక వెబ్సైటు |
a పారామెడికల్ కోర్సులు. |