ఆకస్మికంగా కాలుజారుట వలన, తమాయించుకోవడానికి ప్రయత్నించడంలో స్నాయువు లేదా సంధి కండరాలు (Ligaments) బాగా లాగబడడం లేదా మలపడడం గాని జరిగి వాచిపోయి తీవ్రమైన నొప్పి కలుగుతుంది. దీనినే బెణుకులు (Sprains) అంటారు. ఇంకా ప్రమాదమైన పరిస్థితులలో ఈ సంధి కండరాలు పూర్తిగా తెగిపోవచ్చును. అటువంటి పరిస్థితులలో శస్త్రచికిత్స అవసరమవుతుంది.

A mild second-degree sprained ankle, rotated inwards

బెణుకులు ఎక్కువగా మడమ, మోకాలు, మోచేయి, మణికట్టు కీళ్ళకు జరుగుతుంది.

తీవ్రత బట్టి వర్గీకరణ

మార్చు

బెణుకుని ఆంగ్లంలో స్పెరియిన్ అని పిలుస్తారు. స్పెరియిన్ తీవ్రత బట్టి మూడు రకాలుగా వర్గీకరిస్తారు.

  • మొదటి డిగ్రీ - సంధి కండరాలు లాగబడ్డాయి, కాని చాలా ఎక్కువగా లాగబడలేదు, తెగిపోలేదు.
  • రెండవ డిగ్రీ - సంధి కండరాలు బాగా లాగబడ్డాయి. చాలా కొద్ది భాగంలో కండరాలు తెగిపోవచ్చు కూడా. ఈ రకం బెణుకు అత్యంత నొప్పిని ఇస్తుంది
  • మూడవ డిగ్రీ - సంధి కండరాలు చాలా వఱకు తెగిపోయాయి. ఈ రకం బెణుకుకి శస్త్ర చికిత్స అవసరం. చాలా తీవ్రత కలిగిన ఈ బెణుకు వల్ల నొప్పి తీవ్రత తక్కువగా ఉంటుంది.

ప్రధమ చికిత్స

మార్చు

చికిత్సని ప్రధానంగా RICE [1] అనే ఆంగ్ల పదంలో గుర్తు పెట్టుకొని చేస్తారు.

  • ఏ పనిచేస్తున్నప్పుడు బెణికిందో ఆ పని మళ్ళీ చేయవద్దు.
  • Rest- విశ్రాంతి-నొప్పిపెడుతున్న భాగానికి పూర్తి విశ్రాంతి అవసరం.
  • Ice- ఐస్ మంచుముక్కలను ఆ భాగం చుట్టూ మధ్యలో విరామంతో పెడుతుంటే నొప్పి త్వరగా తగ్గుతుంది.
  • Compression- కంప్రెషన్ బాండేజీ గుడ్డతో గట్టిగా చుట్టూ కట్టుకట్టి ఎత్తులో ఉంచండి.
  • Elevation- ఆ భాగాన్ని ఎత్తులో ఉంచడం

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-10-07. Retrieved 2007-10-20.
"https://te.wikipedia.org/w/index.php?title=బెణుకు&oldid=2888717" నుండి వెలికితీశారు