బెరీలియం బోరోహైడ్రైడ్

(బెరీలియంబోరోహైడ్రైడు నుండి దారిమార్పు చెందింది)

బెరీలియం బోరోహైడ్రైడ్ ఒక రసాయన సమ్మేళనం. ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళన పదార్థం.ఈ సంయోగపదార్ధం యొక్క రసాయన సంకేతపదం Be (BH4) 2.ఇది బెరీలియం మూలకం యొక్క సంయోగపదార్ధం.బెరీలియం బోరోహైడ్రైడ్‌ను బెరీలియం టెట్రాహైడ్రోబోరేట్ (1-) అనికూడా పిలుస్తారు.

బెరీలియం బోరోహైడ్రైడ్
పేర్లు
IUPAC నామము
బెరీలియం బోరోహైడ్రైడ్
ఇతర పేర్లు
బెరీలియం టెట్రాహైడ్రోబోరేట్(1-)
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [17440-85-6]
పబ్ కెమ్ 6101896
SMILES [Be+2].[BH4-].[BH4-]
ధర్మములు
Be(BH4)2
మోలార్ ద్రవ్యరాశి 38.70 g/mol
స్వరూపం white crystals
సాంద్రత 0.604 g/cm3
ద్రవీభవన స్థానం 91.3 °C (196.3 °F; 364.4 K)
బాష్పీభవన స్థానం 123 °C (253 °F; 396 K)
reacts
ద్రావణీయత soluble in benzene, diethyl ether
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
tetragonal
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
-108 kJ/mol
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
Infobox references

భౌతిక లక్షణాలు మార్చు

బెరీలియంబోరోహైడ్రైడ్ తెల్లని స్పటికాలవలె ఉండును.బెరీలియం బోరోహైడ్రైడ్ యొక్క అణుభారం 38.70 గ్రాములు/మోల్.25 °C వద్ద ఈ సంయోగపదార్ధం సాంద్రత 0.604గ్రాములు/సెం.మీ3.బెరీలియం బోరోహైడ్రైడ్ సంయోగపదార్ధం ద్రవీభవన స్థానం 91.3 °C (196.3 °F;364.4K)., దీని బాష్పీభవన స్థానం 123 °C (253 °F;396K), ఈ ఉష్ణోగ్రత ఈ రసాయనపదార్ధం వియోగం చెందును.నీటితో చర్య జరుపును.బెంజీన్, డైఇథైల్ ఈథర్ లలో కరుగుతుంది.చతుర్భుజాకార స్పటికసౌష్టవాన్ని ప్రదర్శించును.

అణునిర్మాణం మార్చు

బెరీలియం బోరోహైడ్రైడ్అణువుచతుర్భుజాకార స్పటికసౌష్టవాన్ని ప్రదర్శించును.BH4Be, BH4 రసాయనపదార్థాల హెలికల్ పాలిమర్ అణుసౌష్టవాన్ని చూపును[1] .

ఉత్పత్తి మార్చు

ఈథర్ ద్రావణంలో డైబొరెన్ తో బెరీలియం హైడ్రైడ్ రసాయనచర్య వలన బెరీలియంబోరోహైడ్రైడ్ సంయోగపదార్ధం ఏర్పడుతుంది.

వినియోగం మార్చు

బెరీలియం బోరోహైడ్రైడ్ పదార్ధంతో ట్రైఫినైల్‌ఫాస్ఫైన్ (triphenylphosphine, PPh3) చర్య వలన శుద్ధమైన బెరీలియంబోరోహైడ్రైడ్ ఉత్పత్తి అగును:[2] Be(BH4)2 + 2PPh3 → 2Ph3PBH3 + BeH2

బెరీలియం, బెరీలియం సమ్మేళనాలు చాలా సైనిక అనువర్తనాల్లో ఉపయోగిస్తారు. [3]

మూలాలు మార్చు

  1. Marynick, Dennis S.; Lipscomb, William N. (1 April 1972). "Crystal structure of beryllium borohydride". Inorganic Chemistry. 11 (4): 820–823. doi:10.1021/ic50110a033.
  2. Greenwood, Norman N.; Earnshaw, Alan (1997). Chemistry of the Elements (2nd ed.). Butterworth-Heinemann. ISBN 0080379419.
  3. Petzow, Günter et al. (2005) "Beryllium and Beryllium Compounds" in Ullmann's Encyclopedia of Industrial Chemistry, Wiley-VCH, Weinheim. doi:10.1002/14356007.a04_011.pub2