బెల్ ల్యాబ్స్ అమెరికాకు చెందిన వైజ్ఞానిక పరిశోధన, వ్యాపార సంస్థ. ఇక్కడ పని చేసిన పరిశోధకులు, రేడియో ఆస్ట్రానమీ, ట్రాన్సిస్టర్, లేజర్, ఫోటో వోల్టాయిక్ సెల్, ఛార్జ్ కపుల్డ్ డివైస్ (సిసిడి), ఇన్‌ఫర్మేషన్ థియరీ, యునిక్స్ ఆపరేటింగ్ సిస్టం, B, C, C++, S, SNOBOL, AWK, AMPL లాంటి ప్రోగ్రామింగ్ భాషలను ఆవిష్కరించారు. ఇక్కడి పూర్తి చేసిన పరిశోధనలకు గాను 10 నోబెల్ పురస్కారాలు, 5 ట్యూరింగ్ పురస్కారాలు దక్కాయి.[1]

నోకియా బెల్ ల్యాబ్స్
రకంసబ్సిడరీ
పరిశ్రమటెలికమ్యూనికేషన్, సాంకేతిక విజ్ఞానం, పదార్థ విజ్ఞానశాస్త్రం
స్థాపనజనవరి 1925; 99 సంవత్సరాల క్రితం (1925-01) (as Bell Telephone Laboratories, Inc.)
ప్రధాన కార్యాలయంముర్రే హిల్, న్యూజెర్సీ, అమెరికా
మాతృ సంస్థ
అనుబంధ సంస్థలునోకియా షాంఘై బెల్
వెబ్‌సైట్www.bell-labs.com Edit this on Wikidata

ఈ సంస్థ 19వ శతాబ్దం చివరలో వెస్టర్న్ ఎలక్ట్రిక్ సంస్థ ఇంజనీరింగ్ విభాగంగా న్యూయార్క్ నగరంలో ప్రారంభమైంది. బెల్ సబ్సిడరీ సంస్థ అయిన వెస్టర్న్ ఎలక్ట్రిక్ కొన్ని సంవత్సరాల పాటు పరిశోధన, అభివృద్ధి సాగించిన తర్వాత ఆ ఇంజనీరింగ్ విభాగం 1925 లో బెల్ టెలిఫోన్ ల్యాబొరేటరీస్ పేరుతో ప్రత్యేక సంస్థగా అవతరించింది. ఇది వెస్టర్న్ ఎలక్ట్రిక్, అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ కంపెనీ (AT & T) సంస్థల సంయుక్త అజమాయిషీలో పనిచేసేది. 1960వ దశకంలో ఈ సంస్థ ప్రధాన కార్యాలయాలం న్యూ జెర్సీలోని ముర్రే హిల్స్ కి తరలించబడింది. 1984 లో బెల్ సిస్టమ్స్ విడిపోయిన తర్వాత బెల్ ల్యాబ్స్ AT & T నిర్వహణ కిందకు వచ్చింది. తర్వాత దీనికి నిధులు భారీగా తగ్గాయి.[2][3]

మూలాలు

మార్చు
  1. "2018 Nobel Prize in Physics laureate Arthur Ashkin delivers his Nobel Lecture at Nokia Bell Labs". Nokia (in ఇంగ్లీష్). Archived from the original on April 7, 2022. Retrieved April 9, 2020.
  2. Georgescu, Iulia (February 2022). "Bringing back the golden days of Bell Labs". Nature Reviews Physics (in ఇంగ్లీష్). 4 (2): 76–78. doi:10.1038/s42254-022-00426-6. ISSN 2522-5820. PMC 8792522.
  3. Brumfiel, Geoff (2008-08-01). "Bell Labs bottoms out". Nature (in ఇంగ్లీష్). 454 (7207): 927–927. doi:10.1038/454927a. ISSN 1476-4687.