సీ ప్లస్ ప్లస్

ఒక ప్రోగ్రామింగ్ భాష

సీ ప్లస్ ప్లస్ సీని పోలి ఉండే మరియొక ప్రాచుర్యం చెందిన భాష. ఇది సీ భాషకు కొనసాగింపు అని చెప్పవచ్చు. ఎందుకంటే సీ ప్లస్ ప్లస్ లో సీ భాషకు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ విధానాలను జత చేర్చారు. దీన్ని అమెరికాకు చెందిన బెల్ పరిశోధనా సంస్థలో పని చేసే బ్యాన్ స్తౌస్తుప్ అనే కంప్యూటర్ శాస్త్రవేత్త రూపొందించడం జరిగింది. దీని ప్రధాన లక్ష్యం, పెద్ద సాఫ్టువేర్లను రాయడంలో సంక్లిష్టతను ఎదుర్కొనడం కోసమే. అంతే కాక ప్రోగ్రామింగ్ లో అప్పుడప్పుడూ ఉపయోగపడే కొన్ని అల్గారిథమ్‌లు, డేటా స్ట్రక్చర్‌లు లైబ్రరీల రూపంలో రూపొందించబడ్డాయి. దీని వలన ప్రోగ్రాములు వ్రాయడం సులభతరం అవడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది.

బ్యాన్ స్తౌస్తుప్, C++ ప్రోగ్రామింగ్ భాష ఆవిష్కర్త

సీ ప్లస్ ప్లస్ లో hello world ప్రోగ్రాము ఈ విధంగా ఉంటుంది.

#include<iostream> 
int main()
{
 cout<<"hello world"
}

కొత్త ఫీచర్లు

మార్చు

ఫంక్షన్ ఓవర్ లోడింగ్, డీఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, ఇన్ లైన్ ఫంక్షన్సు, క్లాసులు, మొదలైనవి.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు