సోడియం బైకార్బొనేట్

రసాయన సమ్మేళనం
(బేకింగ్ సోడా నుండి దారిమార్పు చెందింది)
సోడియం బైకార్బొనేట్
Ball and stick model of a sodium cation
Ball and stick model of a sodium cation
Ball and stick model of a bicarbonate anion
Ball and stick model of a bicarbonate anion
Sample of sodium bicarbonate
పేర్లు
IUPAC నామము
Sodium hydrogen carbonate
ఇతర పేర్లు
Baking soda, bicarbonate of soda, nahcolite, sodium bicarbonate, sodium hydrogencarbonate
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [144-55-8]
పబ్ కెమ్ 516892
యూరోపియన్ కమిషన్ సంఖ్య 205-633-8
డ్రగ్ బ్యాంకు DB01390
కెగ్ C12603
వైద్య విషయ శీర్షిక Sodium+bicarbonate
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:32139
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య VZ0950000
ATC code B05CB04,B05XA02
SMILES [Na+].OC([O-])=O
  • InChI=1/CH2O3.Na/c2-1(3)4;/h(H2,2,3,4);/q;+1/p-1

బైల్ స్టెయిన్ సూచిక 4153970
ధర్మములు
CHNaO3
మోలార్ ద్రవ్యరాశి 84.01 g·mol−1
స్వరూపం White crystals
సాంద్రత 2.20 g cm−3[1]
ద్రవీభవన స్థానం 50 °C (122 °F; 323 K)
69 g/L (0 °C)[2]

96 g/l (20 ºC)[3]
165 g/l (60 ºC)[3]
236 g/L (100 °C)[2]

log P -0.82
ఆమ్లత్వం (pKa) 10.329[4]

6.351 (carbonic acid)[4]

వక్రీభవన గుణకం (nD) 1.3344
Pharmacology
Routes of
administration
Intravenous, oral
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు Causes serious eye irritation
Lethal dose or concentration (LD, LC):
4.22 g kg
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Ammonium bicarbonate

Potassium bicarbonate

Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

సోడా లేదా వంట సోడా (baking soda) లేదా సోడియం బైకార్బొనేట్ అనేది ఒక రసాయన పదార్థం. వంట సోడాని మనం కేకులు, బజ్జీలు వగైరాలు గుల్లబారి మృదువుగా వస్తాయని ఉపయోగిస్తాము. కానీ ఈ రసాయనానికి అనేక ఇతర ఉపయోగాలు ఉన్నాయి.

సోడా, తినే సోడా, వంట సోడా, బేకింగ్ సోడా, బైకార్బనేట్ ఆఫ్ సోడా (Bicarbonate of soda) లేదా సోడియం బైకార్బనేట్ (sodium bicarbonate) - ఇవన్నీ NaHCO3 అనే రసాయనం పేర్లే. ఇది తెల్లటి గుండ రూపంలో బజారులో దొరుకుతుంది. దీనిని ప్రయోగశాలలో తయారుచేయగలినా ప్రకృతిసిద్ధంగా దొరికె బేకింగ్ సోడాను నాకొలైట్ (nahcolite) అంటారు. ఇది క్షారగుణము కలిగి ఉంటుంది .

బేకింగ్ పౌడర్ అని మరొక పదార్థం ఉంది. అది వేరు. బేకింగ్ సోడా అంటే పక్కా సోడియం బైకార్బొనేట్. బేకింగ్ పౌడర్ అన్నది సోడియం బైకార్బొనేట్ + పొటాసియం బైకార్బొనేట్ (cream of tartar) కలిపి ఉన్న మిశ్రమము. ఇదీ తెల్లటి గుండ రూపంలోనే ఉంటుంది. దీనిని కూడా వంటలలో వాడతారు.

వాషింగ్ సోడా (చాకలి సోడా) అనేది వేరొక రసాయనం. దీనిని బట్టలు ఉతకడానికి వాడతారు. ఇదీ తెల్లటి గుండ రూపంలోనే ఉంటుంది. కాని దీనిని తినకూడదు.

వంటలలో

మార్చు
  • కూరగాయలు లేక పళ్ళ మీద ఉన్న పురుగుల మందుల అవశేషాలు పోయి శుభ్రపడాలంటే కొంచెం బేకింగ్ సోడా వేసిన నీళ్ళతో కడిగితే సరి.
  • మాంసం వండటానికి ముందు దానికి బేకింగ్ సోడా పట్టించి రెండు లేక మూడు గంటలు ఫ్రిజ్ లో ఉంచి తీయండి. తరువాత దానిని శుభ్రంగా కడిగి వండితే మృదువైన, రుచికరమైన మాంసం తయార్.
  • టొమాటో వంటి పుల్లటి సూప్ కు మంచి రుచి రావాలంటే చిటికెడు బేకింగ్ సోడా కలిపితే సరి.

ఇంటిలో

మార్చు
  • ఫర్నిచర్ మీద పెన్సిల్ గీతలు, క్రేయాన్ మరకలు, సిరా మరకలు పడ్డాయా? తడిపిన స్పాంజ్ మీద కొంచెం బేకింగ్ సోడా చల్లి దాంతో ఆ మరకల మీద రుద్దండి.
  • ఒక లీటర్ నీళ్ళలో కొంచెం బేకింగ్ సోడా వేసి ఆ నీటితో ఫ్లాస్క్ ను శుభ్రం చేస్తే దానిలోని వాసనలన్నీ మాయమవుతాయి.
  • తడిపిన స్పాంజ్ మీద కొంచెం బేకింగ్ సోడా చల్లి దాంతో ఫ్రిజ్ ను తుడిస్తే శుభ్రంగా ఉంటుంది. ఒక చిన్నబాక్స్ లో కొంచెం బేకింగ్ సోడాను ఉంచి దాన్ని ఫ్రిజ్ లో ఉంచితే దుర్వాసనలన్ని పోయి చక్కగా ఉంటుంది.
  • కొంచెం బేకింగ్ సోడాను పేస్టులాగా చేసి దానిని వంటగదిలో గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల జిడ్డుగా ఉన్న చోట రాసి ముందు తడిబట్టతో ఆపై పొడిబట్టతో తుడిస్తే శుభ్రపడుతుంది
  • కొంచెం వేడి నీళ్ళలో ఒక చెంచా బేకింగ్ సోడా వేసి దానిలో మురికిగా ఉన్న దువ్వెనలు, బ్రష్ లు వేసి, కొంచెంసేపు తర్వాత మంచి నీళ్ళతో కడిగితే మురికి పోతుంది .

వైద్యంలో

మార్చు
  • పొట్టలో మంట లేక అస్వస్థతగా ఉన్నప్పుడు కప్పు నీళ్ళలో పావు చెంచా బేకింగ్ సోడా వేసుకుని తాగితే వెంటనే ఫలితం కనిపిస్తుంది. కానీ ఇది ఎప్పుడన్నా మాత్రమే వాడాలి. తరుచుగా వాడకూడదు.
  • చెమటతో శరీరం దుర్వాసన వస్తుంటే చెమట పట్టే ప్రదేశాల్లో కొంచెం బేకింగ్ సోడాను చెల్లితే శరీర దుర్వాసన మాయం.
  • శరీరంలోని ట్యాన్ ను తొలగిస్తుంది. అంతే కాదు అండర్ ఆర్మ్స్, మోచేతులు, మోకాళ్లపై నలుపును ఇది పోగొడుతుంది. ఒక స్పూన్ బేకింగ్ సోడాకు సమానంగా నిమ్మరసం కలిపి గట్టి మిశ్రమంగా తయారుచేసి ఆయా ప్రాంతాల్లో సమానంగా రాసి పదినిమిషాల తరువాత కడిగేయాలి. అలా కొంత కాలం చేసి ఫలితం చూడండి.

మూలాలు

మార్చు
  1. "Physical Constants of Inorganic Compounds". CRC Handbook, p. 4-85.
  2. 2.0 2.1 "Aqueous solubility of inorganic compounds at various temperatures". CRC Handbook, p. 8-116.
  3. 3.0 3.1 "Sodium Bicarbonate" (PDF). UNEP Publications. Archived from the original (PDF) on 2011-05-16. Retrieved 2011-09-20.
  4. 4.0 4.1 Goldberg, Robert N.; Kishore, Nand; Lennen, Rebecca M. "Thermodynamic quantities for the ionization reactions of buffers in water". CRC Handbook. pp. 7–13.
  • Mark Sircus, Sodium Bicarbonate: Nature's Unique First Aid Remedy, Square One Publisher, Garden City, NJ, USA, ISBN 978-0-7570-0394-3