బైచరాజు వెంకటనాధుడు

పంచతంత్రం అను నీతికధలను సంస్కృతము నుండి తెలుగులోకి అనువదించిన కవులలో ప్రముఖులలో ఒకరు ఈ బైచరాజు వెంకటనాధుడు. ఈతడు తన కావ్యమును హరిహరనాధుని కంకితము ఇచ్చాడు. ఈ హరిహరనాధుడు నెల్లూరు లో నెలకొన్న దేవతామూర్తి. బైచరాజు వెంకటనాధుడు ని కాలమును నిర్ణయించడానికి సరిఅయిన ఆధారములు చాలవు. ఈతడు 1500 సం. ప్రాంతమువాడని బ్రౌను దొర వ్రాసిన దానినే ఇప్పటికీ స్థిరపరచుకుందుమని వీరేశలింగం గారు వ్రాసియున్నారు. ఈతడు శ్రీనాధుడు ని సంరించాడు కాబట్టి అతనికి తరువాతి వాడన్న మాట స్పష్టము. కవి తన వంశమును వర్ణించుకుంటూ, "మహావిరోధి సంహార విహారి సాళ్వబిరుదాంకితుడైన" బైచరాజుకు తిమ్మరాజు పుట్టినాడని, ఆతిమ్మ రాజుకును తిపాంబికను వీరభద్రుడున్ను, వీరభద్రునికి తుంకుట్ల శ్రీపతి రాజు కూతురైన లింగమక్క వల్ల లింగరాజు, పర్వతరాజు అను ఇద్దరు కొడుకులు పుట్టినారని, వీరిలో పర్వతరాజు ఫలితిమ్మరాజు కూతురు అన్నమాంబను పెండాడినాడని, వీరిద్దరికి తాను పుట్టినాడని చెప్పుకొనినాడు. అతని వంశాచార్యుడు బైచరాజు.