బైరతి బసవరాజ్

భారత దేశపు రాజకీయవేత్త

బైరతి బసవరాజ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కృష్ణరాజపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, బి.ఎస్.యడ్యూరప్ప మంత్రివర్గంలో ఆ తరువాత 04 ఆగష్టు 2021 నుండి 2023 మే 13 వరకు బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]

బైరతి బసవరాజ్

పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
04 ఆగష్టు 2021
గవర్నరు వాజుభాయ్ వాలా
ముందు యూ. టి. ఖాదర్

ఎమ్మెల్యే
పదవీ కాలం
13 మే 2013 – ప్రస్తుతం
నియోజకవర్గం కృష్ణరాజపురం

వ్యక్తిగత వివరాలు

జననం (1964-02-04) 1964 ఫిబ్రవరి 4 (వయసు 60)
బైరతి
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
(2019–ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
(2019 వరకు)
జీవిత భాగస్వామి పద్మావతి బసవరాజ్
బంధువులు అయ్యాలి అమ్బరేష్
సంతానం 3
నివాసం బైరతి, హెన్నూర్ రోడ్, బెంగుళూరు అర్బన్, కర్ణాటక 560077

రాజకీయ జీవితం

మార్చు

బైరతి బసవరాజ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి కార్పొరేటర్‌గా తొలిసారి ఎన్నికయ్యాడు. ఆయన 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణరాజపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. బైరతి బసవరాజ్ 2018లో రెండోసారి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికై, 2019లో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై 2021 04 ఆగష్టు 2021 నుండి 2023 మే 13 వరకు బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[2]

మూలాలు

మార్చు
  1. Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
  2. Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.