బొచ్చు సమ్మయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పరకాల నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై[1] ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేశాడు.[2]

బొచ్చు సమ్మయ్య

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1978 - 1985
ముందు పింగళి ధర్మారెడ్డి
తరువాత ఒంటేరు జయపాల్
నియోజకవర్గం పరకాల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

మరణం 2017 ఆగష్టు 22
హైదరాబాద్
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

బొచ్చు సమ్మయ్య కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1978లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ అభ్యర్థి మారేపల్లి ఎలియ్య గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1983లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పని చేశాడు. సమ్మయ్య 1985, 1989, 1994 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యునిగా పని చేశాడు.

సమ్మయ్య హన్మకొండలోని తన నివాసంలో బాత్రూంలో జారిపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆగస్టు 9న హైదరాబాద్‌ నిమ్స్‌కు హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ 2017 ఆగష్టు 22న మరణించాడు.[3]

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (12 April 2022). "అసెంబ్లీ స్థానాలు-ప్రత్యేకతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  2. Sakshi (12 November 2018). "అంతుపట్టని పరకాల తీర్పు". Archived from the original on 4 June 2022. Retrieved 4 June 2022.
  3. Sakshi (22 August 2017). "మాజీ మంత్రి సమ్మయ్య కన్నుమూత". Archived from the original on 4 June 2022. Retrieved 4 June 2022.