బొమ్మల రామారం (సినిమా)
బొమ్మల రామారం అనేది 2016, ఆగస్టు 12న విడుదలైన తెలుగు సినిమా.[1] మిడివల్ స్టోరీస్ టెల్లర్స్ పతాకంపై పుదారి అరుణ నిర్మించిన ఈ సినిమాకి నిషాంత్ పుదారి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సూరి, రూపారెడ్డి, ప్రియదర్శి,[2] తిరువీర్, మోహన్ భగత్ ప్రధాన పాత్రల్లో నటించారు.[3]
బొమ్మల రామారం | |
---|---|
దర్శకత్వం | నిషాంత్ పుదారి |
రచన | నిషాంత్ పుదారి |
నిర్మాత | పుదారి అరుణ |
తారాగణం | సూరి, రూపారెడ్డి, ప్రియదర్శి, తిరువీర్, మోహన్ భగత్ |
ఛాయాగ్రహణం | బి.వి.అమర్‌నాధ్‌రెడ్డి |
కూర్పు | శివ శ్రీనివాస్ |
సంగీతం | కార్తీక్ కొడకండ్ల, శ్రావణ్ మైఖేల్ |
నిర్మాణ సంస్థ | మిడివల్ స్టోరీస్ టెల్లర్స్ |
విడుదల తేదీ | 12 ఆగస్టు 2016(థియేటర్) |
సినిమా నిడివి | 160 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథా నేపథ్యం
మార్చుగ్రామీణ నేపథ్యంలో జరిగే క్రైమ్ డ్రామా కథతో ఈ సినిమా రూపొందించబడింది.
నటవర్గం
మార్చు- సూరి (సూరి)
- రూపారెడ్డి (ఉమాదేవి)
- ప్రియదర్శి (రామన్న)
- తిరువీర్ (మల్లేష్)
- మోహన్ భగత్ (అంజి)
- విమల్ కృష్ణ (గణేష్)
- కేశవ్ దీపక్
- సంగీర్తన
- జ్యోతివర్మ (సుజాత)
- అభయ్
- గుణకర్
- శివ
- జాన్ కొట్టొల్లి (లాయర్ చంద్రమౌళి)
- శ్వేత శ్రీవాత్సవ్
సాంకేతికవర్గం
మార్చు- రచన, దర్శకత్వం: నిషాంత్ పుదారి
- నిర్మాత: పుదారి అరుణ
- ఛాయాగ్రహణం: బి.వి.అమర్‌నాధ్‌రెడ్డి
- కూర్పు: శివ శ్రీనివాస్
- సంగీతం: కార్తీక్ కొడకండ్ల, శ్రవణ్ మైఖేల్
- నిర్మాణ సంస్థ: మిడివల్ స్టోరీస్ టెల్లర్స్
పాటలు
మార్చుఈ సినిమాకు కార్తీక్ కొడకండ్ల, శ్రావణ్ మైఖేల్ సంగీతం అందించాడు. ఈ సినిమా ఆడియోను ప్రముఖ నేపథ్యగాయని పి. సుశీల ఆవిష్కరించింది.[4] ఈ పాటలన్నీ గాయనీమణులు పాడడం ఒక విశేషమయితే.. చిత్రీకరణలో బ్యాగ్రౌండ్ లో రావడం మరో విశేషం. అంతా మాంటేజ్ విధానంలో, భావాన్నీ వ్యక్తీకరించడానికి మాత్రమే దర్శకుడు ఈ పాటలను వినియోగించుకున్నాడు.[5]
క్రమసంఖ్య | పాటపేరు | రచన | గాయకులు | నిడివి |
---|---|---|---|---|
1 | బొమ్మల రామారం | సుహాసిని | పి. సుశీల | 2:40 |
2 | వెండి వెన్నెల | రామన్, శ్రీమన్ | స్వాతి బెక్కెర | 3:10 |
3 | ఏదో తెలియని దిగులు | సుహాసిని | మానస ఆచార్య | 3:49 |
4 | ఆ కళ్ళతోని | అరవింద్ రామా | నూతన | 4:07 |
5 | మనసు చేదిరి | సుహాసిని | ప్రణవి | 2:03 |
మూలాలు
మార్చు- ↑ "Bommala Ramaram". Spicyonion.com (in ఇంగ్లీష్). Archived from the original on 2016-08-15. Retrieved 2022-11-20.
- ↑ "మల్లేశం` వాస్తవికత ఉన్న బయోపిక్!- ప్రియదర్శి". tupaki. 2019-06-20. Archived from the original on 2019-06-22. Retrieved 2022-11-20.
- ↑ "అశ్లీలత లేని బొమ్మల రామారం". andhrabhoomi.net. Archived from the original on 2022-11-20. Retrieved 2022-11-20.
- ↑ "Photos - Bommala Ramaram Songs Launch". www.ragalahari.com (in ఇంగ్లీష్). Archived from the original on 2019-01-26. Retrieved 2022-11-20.
- ↑ "మెలోడీ మయం.. బొమ్మల రామారం". Filmy Focus (in ఇంగ్లీష్). 2016-08-09. Archived from the original on 2022-11-20. Retrieved 2022-11-20.