తిరువీర్

రంగస్థల నటుడు, దర్శకుడు, చలనచిత్ర నటుడు.

తిరువీర్ (జననం. జూలై 23) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రంగస్థల నటుడు, దర్శకుడు, సినిమా నటుడు.[2][3] 2019లో వచ్చిన జార్జ్ రెడ్డి సినిమాలోని లలన్ సింగ్, 2020లో వచ్చిన పలాస 1978 సినిమాలోని రంగారావు పాత్రలతో గుర్తింపు పొందాడు.[4][5] 2022లో వచ్చిన మసూద సినిమాలో తొలిసారిగా హీరోగా నటించాడు.[6]

తిరువీర్
జననం
తిరుపతిరెడ్డి[1]

జూలై 23
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు
ఎత్తు6 అడుగుల 1 అంగుళం
తల్లిదండ్రులుపి. వెంకట్ రెడ్డి, వీరమ్మ

జననం మార్చు

తిరువీర్, జూలై 23న వెంకట్ రెడ్డి, వీరమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, నందిగామ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో జన్మించాడు.[7] తండ్రి వ్యవసాయం చేసేవాడు. ఆ తరువాత కుటుంబం హైదరాబాదు నగరానికి వలస వచ్చి, కాటేదాన్‌ పారిశ్రామిక ప్రాంతంలో ఉండేవారు.[8] తిరుపతిరెడ్డి తన తల్లి పేరులోని వీర్ అనే పదాన్ని తీసుకుని తిరువీర్ అని పెట్టుకున్నాడు.[9]

విద్యాభ్యాసం మార్చు

మైలార్‌ దేవ్‌పల్లి, రాజేంద్రనగర్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. హైదరాబాదులోని సిటి కళాశాలలో డిగ్రీ చదివిన తిరువీర్, నటనపై ఉన్న ఆసక్తితో తెలుగు విశ్వవిద్యాలయంలోని రంగస్థల కళలశాఖలో ఎం.పి.ఎ. పూర్తిచేశాడు.

నాటకరంగం మార్చు

నటుడిగా మార్చు

టాక్స్ ఫ్రీ, జూ స్టొరీ, లా ఒక్కింతయు లేదు, కిషోర్ శాంతభాయ్ కాలే, న్యూ భారత్ కేఫ్, బర్బరీకుడు[10], ఎకనామిక్ హిట్ మాన్, ఆంటిగని, కాయితం పులి,[11] కళ్యాణి, వర్ణ నిర్మూలన సిద్ధాతం, దావత్ మొదలైన నాటకాలలో నటించాడు.

దర్శకుడిగా మార్చు

అమ్మ చెప్పిన కథ,[12] నా వల్ల కాదు, దావత్,[13][14] ఏ మాన్ విత్ ఏ లాంప్,[15] పుష్పలత నవ్వింది[16] మొదలైన నాటికలకు దర్శకత్వం వహించాడు.

నాటకోత్సవాలు - శిక్షణ శిబిరాలు మార్చు

  1. దక్షిణ కొరియాలో 23 రోజులపాటు జరిగిన నాటక ఏసియన్ రెసిడెన్సి ప్రాజెక్టు (2014, జూన్ 29 నుండి జూలై 21 వరకు) లో పాల్గొని నాటక ప్రదర్శనలో మెలకువలు తెలసుకొని... నాలుగు దేశాల (బంగ్లాదేశ్, జపాన్, ద. కొరియా, భారతదేశం) నాటకరంగ కళాకారులతో కలిసి నాటికను ప్రదర్శించాడు.
  2. 2014, ఫిబ్రవరి 17-23 వరకు న్యూఢిల్లీలో జరిగిన టిఫ్లి అంతర్జాతీయ చిన్నారుల నాటకోత్సవంలో పాల్గొని దాదాపు 20 దేశాల నాటకరంగ కళాకారులతో కలిసి శిక్షణ శిబిరంలో పాల్గొన్నాడు.
  3. గౌహతి, తిరువనంతపురం, పాలక్కాడు, పాట్నా మొదలైన ప్రాంతాలలో జరిగిన చిన్నారుల నాటకోత్సవాలలో పాల్గొన్నాడు.

పాప్‌కార్న్ థియేటర్ స్థాపన మార్చు

తిరువీర్, తెలుగు నాటకరంగంలో కృషి చేస్తున్న యువతలో కొంతమంది మిత్రులతో కలిసి 2014, మార్చి 20న హైదరాబాద్ అబిడ్స్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో అమ్మ చెప్పిన కథ అనే నాటిక ప్రదర్శనతో పాప్‌కార్న్ థియేటర్ ను ప్రారంభించాడు. పాప్‌కార్న్ థియేటర్ ద్వారా చిన్నారులను, యువతను నాటకరంగంవైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు.[17]

టీవీరంగం మార్చు

మొదట్లో టీవీల్లో వచ్చే అనువాద చిత్రాలకు, ధారావాహికలకు అనువాద కళాకారుడిగా, జీ తెలుగు ఛానల్ లో వచ్చిన డ్రామా జూనియర్స్ కు సూపర్ మెంటర్ గా పనిచేశాడు.

సినిమారంగం మార్చు

తిరువీర్ తన చిన్నతనంలో సినిమాల వాల్‌పోస్టర్లు చూసి కథలు చెప్పేవాడు. ఖాజా పాషా దర్శకత్వంలో వెన్నెల కిషోర్ హీరోగా వచ్చిన D/O వర్మ చిత్రంలోని పిల్లాడికి నటనలో శిక్షణ ఇస్తూ, అదే చిత్రానికి సహాయ దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు.[18] తరువాత కొన్ని సినిమాలలో సహనటుడిగా నటించాడు. ‘మల్లేశం’ సినిమా తిరువీర్ సినీ జీవితంలో ఓ మలుపుగా నిలిచింది. ‘మల్లేశం’, ‘పలాస’, ‘జార్జిరెడ్డి’ వంటి సినిమాలలో నటించి ప్రముఖ దర్శకుల, నిర్మాతల దృష్టిలో పడ్డాడు. 2022లో విడుదలైన ‘మసూద’ సినిమాలోని గోపీ పాత్రతో కామన్‌ ఆడియన్స్‌కు కూడా దగ్గరయ్యాడు.[19][20]

నటించినవి మార్చు

సంవత్సరం సినిమా పేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2016 బొమ్మల రామారం మల్లేష్ తెలుగు మొదటి సినిమా[21]
2017 ఘాజీ డెప్త్ కంట్రోలర్ హిందీ, తెలుగు మొదటి హిందీ సినిమా[22]
2017 ఏ మంత్రం వేసావె హరి తెలుగు
2018 శుభలేఖ+లు పరిమళ్ తెలుగు
2019 మల్లేశం వీరప్రతాప్ తెలుగు
2019 జార్జ్ రెడ్డి లలన్ సింగ్ తెలుగు జీ సినిమా ఉత్తమ ప్రతినాయకుడు అవార్డు[23][24]
2020 పలాస 1978 రంగారావు తెలుగు ఉత్తమ సహాయ నటుడిగా సైమా అవార్డ్స్ - 2020 కు నామినేట్[25][26][27]
ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - 2020 కు నామినేట్
2021 టక్‌ జగదీష్‌ తిరుమల నాయుడు తెలుగు [28]
2022 మసూద గోపికృష్ణ తెలుగు ప్రధాన పాత్రలో మొదటి సినిమా[29]
2023 పరేషాన్ ఐసాక్ తెలుగు [30]
2023 పారాహుషార్ తెలుగు పోస్టు ప్రొడక్షన్ లో ఉంది
2023 మోక్షపటం తెలుగు పోస్టు ప్రొడక్షన్ లో ఉంది
2023 ఏసియన్‌ ఫిలిమ్స్‌ బ్యానర్ లో తెలుగు [31]

వెబ్ సిరీస్ మార్చు

సంవత్సరం పేరు పాత్రపేరు భాష ఛానల్
2020 సిన్ ఆనంద్ తెలుగు ఆహా[32]
2020 మెట్రో కథలు చందు తెలుగు ఆహా[33]
2023 కుమారి శ్రీమతి తెలుగు అమెజాన్ ప్రైమ్ వీడియో

లఘుచిత్రాలు మార్చు

అతల కుతల పాతాళం, కలర్స్, కుమార సంభవం, సోడాబుడ్డి భాస్కర్, ఆయుధం మొదలైన లఘు చిత్రాలలో నటించాడు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 'రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో నిర్వహించబడిన సినివారంలో 2017 జనవరి 21న ప్రదర్శించిన కుమార సంభవం లఘుచిత్రంలో తన నటన చూసి జార్జిరెడ్డి సినిమాలో అవకాశం ఇచ్చారని' ఒక ఇంటర్వ్యూలో తిరువీర్ తెలిపాడు.

రేడియో మార్చు

మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినందున సినిమారంగంలో తన కెరీర్‌ను కొనసాగించడానికి ముందు కొంతకాలం హైదరాబాద్ లోని రెయిన్ బో ఎఫ్.ఎం (101.9) లో ఆరు నెలలపాటు ఆర్జేగా పనిచేశాడు. రేడియో నాటకాలలో కూడా పాల్గొన్నాడు.

పురస్కారాలు మార్చు

  1. తెలుగు విశ్వవిద్యాలయ రంగస్థల యువ పురస్కారం 2017[34][35]
  2. జీ సినిమా ఉత్తమ ప్రతినాయకుడు అవార్డు (లలన్ సింగ్ - జార్జిరెడ్డి సినిమా)

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (29 November 2022). "సినిమా పోస్టర్లు చూసి కథ చెప్పేవాణ్ణి" (in ఇంగ్లీష్). Archived from the original on 29 November 2022. Retrieved 29 November 2022.
  2. Namasthe Telangana (23 July 2023). "థియేటర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. హ్యాపీ బర్త్‌ డే టు తిరువీర్‌". Archived from the original on 23 July 2023. Retrieved 23 July 2023.
  3. 10 TV (20 August 2020). "బ్యాగ్రౌండ్ లేదు కానీ ప్రూవ్ చేసుకున్నారు!." (in telugu). Archived from the original on 21 జూలై 2021. Retrieved 21 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. The Hindu, Entertainment (Movies) (2 December 2019). "Thiruveer is the new villain on the block after 'George Reddy'". The Hindu (in Indian English). Y. Sunita Chowdhary. Archived from the original on 2 December 2019. Retrieved 2 December 2019.
  5. The Times of India, Entertainment (8 March 2020). "I still can't believe people are appreciating my role in Palasa 1978: Thiruveer". Paturi Rajasekhar. Archived from the original on 9 March 2020. Retrieved 9 March 2020.
  6. telugu, NT News (2022-11-20). "Thiruveer | మసూద మూవీలో ఉన్న ఈ నటుడు ఇన్ని సినిమాల్లో నటించాడా?". www.ntnews.com. Archived from the original on 2022-11-20. Retrieved 2022-11-20.
  7. నాటకం కలిపింది సినిమా నడిపిస్తోంది, వి6 వెలుగు లైఫ్, నరేష్ కుమార్ సూఫీ, 11 ఫిబ్రవరి 2020, పుట. 5.
  8. telugu, NT News (2023-06-07). "మన యాస.. పాయసం!". www.ntnews.com. Archived from the original on 2023-06-07. Retrieved 2023-06-07.
  9. "నాకు ఎక్కువగా విలన్‌, సైకో పాత్రలే వచ్చేవి : నటుడు తిరువీర్‌". Sakshi. 2022-11-28. Archived from the original on 2022-11-28. Retrieved 2022-11-29.
  10. www.mytheatrecafe.com/. "Review: "Barbareekudu": Tracing the Caste Conflict in the Epic War – Telugu Play". Archived from the original on 30 July 2016. Retrieved 25 August 2016.
  11. The Hindu, FRIDAY REVIEW (29 July 2011). "Tale about the downtrodden". Retrieved 25 August 2016.
  12. LIFESTYLE, BOOKS AND ART, Deccan Chronicle (24 March 2014). "Promoting children's theatre in Hyderabad". Retrieved 23 August 2016.
  13. తెలుగు వన్ ఇండియా. "గోల్డెన్ త్రెషోల్డ్ లో "దావత్"". telugu.oneindia.com. Archived from the original on 15 June 2016. Retrieved 25 March 2017.
  14. తెలుగు ఫిల్మీబీట్. "రవీంధ్ర భారతిని నవ్వులలో ముంచెత్తిన "దావత్" : ఆకట్టుకున్న పాప్ కార్న్ థియేటర్ టీమ్". telugu.filmibeat.com. Retrieved 25 March 2017.[permanent dead link]
  15. Youtube. "A Man with a Lump". Retrieved 25 August 2016.
  16. నవతెలంగాణ, జాతర-స్టోరి (16 July 2019). "ప్రయోగాత్మక నాటికలు". Archived from the original on 16 July 2019. Retrieved 7 September 2019.
  17. "నటించటం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు :"ఘాజి" తిరువీర్ (ఇంటర్వ్యూ )". telugu.filmibeat. 2017-03-06. Archived from the original on 2022-11-20. Retrieved 2022-11-20.
  18. Eenadu (19 September 2021). "నాటకమే.. నడక నేర్పింది". EENADU. Archived from the original on 18 September 2021. Retrieved 19 September 2021.
  19. "సినిమా పోస్టర్లు చూసి కథ చెప్పేవాణ్ణి". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-11-29. Archived from the original on 2022-11-29. Retrieved 2022-11-29.
  20. "హీరో.. అనడం నాకు నచ్చదు". EENADU. 2022-11-29. Archived from the original on 2022-11-29. Retrieved 2022-11-29.
  21. Bommalaramaram. "Bommalaramaram Team". Bommalaramaram. Archived from the original on 8 August 2016. Retrieved 23 August 2016.
  22. ఇండియన్ ఎక్స్ ప్రెస్. "Ghazi: Indian submarine's depth controller shares what all went behind making the courageous film". Retrieved 25 March 2017.
  23. నమస్తే తెలంగాణ, సినిమా వార్తలు (1 August 2019). "విప్లవమే జీవితం". www.ntnews.com. Archived from the original on 2 August 2019. Retrieved 2 August 2019.
  24. Hindustan Times, Regional News (12 January 2020). "Zee Cine awards Telugu 2020: Samantha Akkineni, Chiranjeevi and Nani win top laurels" (in ఇంగ్లీష్). Archived from the original on 14 January 2020. Retrieved 15 January 2020.
  25. SIIMA (2021). "SIIMA AWARDS | 2020 | Nominations". Archived from the original on 24 ఆగస్టు 2021. Retrieved 24 August 2021.
  26. ఈనాడు, సినిమా (6 March 2020). "రివ్యూ: ప‌లాస 1978". Archived from the original on 6 March 2020. Retrieved 6 March 2020.
  27. టివి9, రివ్యూ (6 March 2020). "పలాస 1978 మూవీ రివ్యూ". డా. చల్లా భాగ్యలక్ష్మి. Archived from the original on 6 March 2020. Retrieved 6 March 2020.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  28. "Tuck Jagdish will release on 16 April, Nani, director Shiva Nirvan announce with new poster - Entertainment News". Firstpost. 9 January 2021. Retrieved 25 April 2021.
  29. Namasthe Telangana (30 November 2022). "విలక్షణ నటుడు అనిపించుకోవాలి". Archived from the original on 30 November 2022. Retrieved 30 November 2022. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 29 నవంబరు 2022 suggested (help)
  30. "Actor Thiruveer: Theatre and cinema helped me survive". The Hindu. 2023-05-30. ISSN 0971-751X. Archived from the original on 2023-05-30. Retrieved 2023-05-31.
  31. Namasthe Telangana (10 April 2023). "మసూద హీరో తిరువీర్ పీరియాడిక్ సినిమా.. వివరాలివే". Archived from the original on 10 April 2023. Retrieved 10 April 2023.
  32. India Today Features New, Life Style (27 March 2020). "Your Weekend Planner March 27: How to get through a lockdown?". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 27 March 2020. Retrieved 30 March 2020.
  33. The Times of India (6 August 2020). "Harish Sankar launches the poster of Karuna Kumar's Metro Kathalu" (in ఇంగ్లీష్). Archived from the original on 7 August 2020. Retrieved 7 August 2020.
  34. వెబ్ ఆర్కైవ్, సాక్షి (09.05.2017). "రంగస్థలానికి ఉజ్వల భవిష్యత్తు". Archived from the original on 10 మే 2017. Retrieved 10 May 2017.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: numeric names: authors list (link)
  35. ప్రజాశక్తి, తెలంగాణ (18 March 2017). "20 నుంచి జాతీయ నృత్యోత్సవం". Archived from the original on 27 March 2019. Retrieved 27 March 2019.

ఇతర లంకెలు మార్చు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో తిరువీర్ పేజీ
  2. యూట్యూబ్ లో ఉస్కో సినిమా ట్రైలర్
  3. యూట్యూబ్ లో బొమ్మలరామారం సినిమా ట్రైలర్
"https://te.wikipedia.org/w/index.php?title=తిరువీర్&oldid=3985543" నుండి వెలికితీశారు