క్రికెట్‌లో, బ్యాటరు రక్షించుకుంటూ ఉన్న వికెట్లను లక్ష్యంగా చేసుకుని బౌలరు, బౌలింగు చేసి, వికెట్లను పడవేసి, ఆ బ్యాటరును ఔట్ చేయడాన్ని బౌల్డ్ అంటారు. బౌలింగు చేసే చర్యను కూడా ఇంగ్లీషులో భూతకాలంలో బౌల్డ్ అనే అంటారు.[1][2]

బౌల్డ్ ఔటైన బ్యాటరు

స్కోరుకార్డులో బ్యాటర్‌ను అవుట్ చేసినది ఏ బౌలరో చూపించేందుకు ఈ పదాన్ని వడాతారు. బ్యాటరు బౌల్డ్ అయినప్పుడు, లెగ్ బిఫోర్ వికెట్ (LBW), క్యాచ్, స్టంప్డ్ లేదా హిట్ వికెట్ అయిన సందర్భాల్లో ఇలా వాడతారు.

బ్యాటర్ ఔటవడం

మార్చు
 
NSW బ్రేకర్స్ ఆల్ రౌండర్ నికోలా కారీ బౌల్డ్ అయ్యాడు. బంతిని ఎగిరిన బెయిళ్ళను గమనించండి, ఒక బెయిలు రెండు ముక్కలైంది.

బౌల్డ్ పద్ధతిలో ఔటవడాన్ని క్రికెట్ చట్టాల లోని చట్టం 32 (బౌల్డ్) ద్వారా నిర్వచించారు.[3]

బౌలర్ వేసిన బంతి వికెట్లను పడగొడితే, సంబంధిత బ్యాటరు అవుటైనట్లు. వికెట్లను పడగొట్టడానికి ముందు బంతి, బ్యాటును, గ్లోవ్‌లను, బ్యాటర్‌ శరీరాన్ని తాకిందా లేదా అనేది అప్రస్తుతం. అయితే అది మరొక ఆటగాడిని గానీ అంపైర్‌ను గానీ తాకి ఉండకూడదు. అంటే బౌల్డ్ ఔటనేది అన్ని రకాల ఔట్ల లోకీ చాలా స్పష్టమైనది. దాదాపుగా అంపైర్‌కి అప్పీల్ చెయ్యాల్సిన అవసరమే ఉండదు. బౌల్డైన బ్యాటరు తాను ఔటైనట్లు స్వచ్ఛందంగా అంగీకరిస్తాడు.

బంతి బ్యాటరును అసలు తాకకుండా వికెట్లను పడవేస్తే, దానిని క్లీన్ బౌల్డ్ అంటారు. బంతి బ్యాటుకు తగిలి, పక్కకు మళ్లి, బ్యాటర్‌ని బౌల్డ్ చేస్తే, అనధికారికంగా దాన్ని ప్లే ఆన్, నాక్ ఆన్, కట్ ఆన్ లేదా డ్రాగ్డ్ అని అంటారు. బంతి బ్యాటు, ప్యాడుకూ మధ్య గుండా దూసుకుపోయి వికెట్ల పడేస్తే బౌల్డ్ త్రూ ది గేట్ అనీ, బంతి బ్యాటరు కాళ్ళ వెనక నుండీ వెళ్ళి వికెట్లను పడేస్తే బౌల్డ్ ఎరౌండ్ ది లెగ్స్ అనీ అంటారు.

నో-బాల్, వైడ్ బాల్ లలో బంతి వికెట్లను పడేసినా బ్యాటరు బౌల్డ్ ఔటవడు. డెడ్ బాల్ లో కూడా అంతే.

బ్యాటరు బౌల్డ్ ఔటవడంతో పాటు వేరే విధంగా కూడా ఔటైతే, బౌల్డ్‌నే పరిగణిస్తారు.[4] ఉదాహరణకు, బంతి బ్యాటరు బ్యాటును తాకి, స్టంపుల మీదికి వెళ్ళి, బెయిళ్ళను పడేసాక బంతిని పీల్డరు పట్టుకుంటే ఆ బ్యాటరును క్యాచ్ అయూటైనట్లు కాకుండా, బౌల్డ్ అవుట్ అయినట్లు ప్రకటిస్తారు.

1877 - 2012 మధ్య జరిగిన మొత్తం టెస్ట్ మ్యాచ్‌లలో 21.4% అవుట్లు బౌల్డ్ ద్వారా అయినవి. క్యాచౌట్ల తర్వాత బ్యాటర్లు అవుటైన ఘటనల్లో ఇది రెండవ స్థానంలో ఉంది.[5]

బ్యాటరు బౌల్డ్ అయితే ఆ వికెట్ బౌలరుకు దక్కుతుంది.

టెస్టుల్లో అత్యధిక బ్యాటర్లను (167) బౌల్డ్ పద్ధతి ద్వారా అవుట్ చేసిన రికార్డు ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉంది.[6]

స్కోరు కార్డు

మార్చు

స్కోరుకార్డులో బ్యాటరు 'c స్మిత్ b జోన్స్' అని ఉంటే, దానర్థం, 'క్యాచ్ స్మిత్, బౌల్డ్ జోన్స్' అని. జోన్స్ బంతి వేయగా, స్మిత్ క్యాచ్ పట్టగా బ్యాటరు ఔటయ్యాడని అర్థం.

'lbw b జోన్స్' అని రాస్తే దాన్ని 'lbw బౌల్డ్ జోన్స్' అని చదువుతారు. జోన్స్ బంతి వేయగా, అతను LBW అవుట్ అయ్యాడని దీనికి అర్థం.

మూలాలు

మార్చు
  1. "Shane Warne's 'Ball of the Century' turns 25". ICC. Retrieved 23 April 2019. On 4 June 1993, the legendary Australia leg-spinner bowled the iconic delivery to England's Mike Gatting to leave the cricketing world in disbelief.
  2. "Phillip Hughes inquest: Bowler Sean Abbott 'confused and upset' after death". BBC Sport. Retrieved 23 April 2019. Sean Abbott felt "confused and upset" after he bowled the ball
  3. "Law 32 – Bowled". MCC. Retrieved 29 September 2017.
  4. "Law 32.2 – Bowled to take precedence". MCC. Retrieved 22 April 2019.
  5. "Analysing Test dismissals across the ages". espncricinfo.com.
  6. "Most wickets taken bowled". espncricinfo.com (in ఇంగ్లీష్). Retrieved 23 April 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=బౌల్డ్&oldid=4317204" నుండి వెలికితీశారు