బ్యాక్టీరియల్ ఎండు తెగుళ్లు
బాక్టరియా ఎండు తెగులు అనేది వరి పండించే చాలా దేశాలలో, ముఖ్యమైన వ్యాధులలో ఒకటి. బాక్టీరియల్ ముడత అధిక అంటువ్యాధి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సమశీతోష్ణ, ఉష్ణమండల ప్రాంతాలలో ముఖ్యంగా ఆసియాలో అధిక దిగుబడినిచ్చే సాగులకు వినాశకరమైనది. ఆఫ్రికా, అమెరికాలో 70 వ దశకంలో ఇది సంభవించడంతో దాని ప్రసారం, వ్యాప్తి ఆందోళనలకు దారితీసింది.[1]
లక్షణాలు
మార్చుఈ తెగులు వరి పైరును ముఖ్యంగా మూడు దశల్లో ఆశిస్తుంది. 1.నారు మడి దశలో ఈ తెగులు సోకితే ఆకు చివరల నుండి క్రింది వరకు రెండు ప్రక్కల తడిసినట్లు ఉండి పసుపురంగుకు మారి ఆకులు ఎండి మొక్కలు చనిపోవును . దీనిని " క్రెసిక్ " దశ అని అంటారు . ఈ ఎండిన మచ్చలు తరంగాల మాదిరిగా ఉంటాయి.నాట్లు వేసిన ముప్పై రోజుల తరువాత కూడా ఈ క్రెసిక్ లక్షణాలు కనిపించవచ్చును .
2.వరి మొక్కలు పిలకలు పెట్టు దశలో ఆకుల చివరల నుండి క్రింది వరకు ఆకులు పసుపుపచ్చగా మారి తెగులు సోకిన భాగాలు ఎండిపోవును . ఉదయం 7 గంటల ప్రాంతాలలో తెగులు సోకిన ఆకు నుండి పచ్చని జిగురు వంటి పదార్థము పైకి వచ్చును . ఈ పచ్చటి పదార్థము సూర్యరశ్మికి గట్టి పడి చిన్న చిన్న ఉండలుగా మారి గాలి వీచినప్పుడు ఆకు నుండి దాని చేరువలో ఉన్న వీటిలో పడతాయి.నీటి బాక్టీరియా ఇతర మొక్కలకు, పొలాలకు చేరుతుంది .
3.వరివెన్ను పైకి తీయు దశలో ఈ తెగులు సోకిన ఆకులలో హరిత పదార్ధం తగ్గుట వలన కొన్ని వెన్నులు సగం మాత్రం బయటికి రావటం జరుగుతుంది గింజలు తాలుగా మారతాయి.
వ్యాప్తి
మార్చుఈ వ్యాధి "జాంతోమోనస్ కాంపిస్ట్రిస్ ఒరైజే" అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. అలాగే ఉష్ణోగ్రత 30 సెం.గ్రే. ఉండి గాలిలో అధిక తేమ వర్షపు జల్లులు పడినప్పుడు ఈ తెగులు ఎక్కువగా వ్యాపిస్తుంది . ఈ బాక్టీరియా కలుపు మొక్కల మీద, సాగునీటితో , గాలితో కూడిన వర్షం ద్వారా ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు వ్యాప్తి చెందుతుంది .
నష్టాలు
మార్చుబ్యాక్టీరియా ఎండు తెగులు వినాశకరమైన వ్యాధికి కారణమవుతుంది. సమశీతోష్ణ, ఉష్ణమండల ప్రాంతాలలో ప్రపంచవ్యాప్తంగా కనుగొనబడిన ఈ వ్యాధి ప్రారంభంలో అభివృద్ధి చెందితే అది 80 శాతం పంటను నాశనం చేస్తుంది. ఇది ఆలస్యంగా అభివృద్ధి చెందినా, అది ధాన్యం నాణ్యత దిగుబడిని తీవ్రంగా తగ్గిస్తుంది.
బాక్టీరియ ఎండు తెగులు అనేది ప్రబలంగా విధ్వంసక వ్యాధి, ఇది ఆసియా అంతటా మిలియన్ల హెక్టార్లలో / ఎకరాలను ప్రభావితం చేస్తుంది. జపాన్‌లో మాత్రమే, వార్షిక నష్టాలు 22,000 - 110,000 టన్నుల మధ్య ఉంటాయని అంచనా వేయబడింది.[2]
యాజమాన్య పద్ధతులు
మార్చు1.వ్యాధి నిరోధక రకాలను వాడాలి.
2.వ్యవసాయ భూమి లో సరైన మోతాదు లో ఎరువులను అందించాలి.
3.పంట మార్పిడి పద్ధతిని అవలంబించాలి.
4. విత్తన శుద్ధి చేసిన విత్తనాలను విత్తాలి.
నివారణ పద్దతులు
మార్చుసేంద్రీయ నివారణ
మార్చు1. 4 లీటర్ల శొంఠి పాల కషాయానికి 200లీ. నీరు కలిపి ఎకరా పొలం లో పిచికారి చేయాలి.
2.10 లీటర్ల పిచ్చి తులసి కషాయానికి 200 లీ. నీరు కలిపి ఎకరా పొలం లో పిచికారి చేయాలి.
3.15 లీటర్ల లాక్టిక్ యాసిడ్ ద్రావణాన్ని 100 లీ. నీటికి కలిపి ఎకరా పొలం లో పిచికారి చేయాలి.
రసాయన నివారణ
మార్చు1."Streptomycin 200 ppm" అనే రసాయన మందును 10 - 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.[3]
మూలాలు
మార్చు- ↑ "తెగుళ్ల నివారణ". వ్యవసాయ శాఖ తెలంగాణ. Archived from the original on 2021-05-16. Retrieved 2021-05-16.
- ↑ "ఎండు తెగుళ్లు". తెగుళ్లు.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ వివిధ పంటలకు వచ్చే చీడ పీడలు వాటి యాజమాన్య పద్ధతులు. ఏకలవ్య ఫౌండేషన్ - సేంద్రియ వ్యవసాయం.