బ్రహ్మంగారి తత్వాలు

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంథాలలో రచించి భద్రపరచారు. వీటినే కాలజ్ఞాన తత్వాలు అంటారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే. ఇలా చెప్పినవారు ప్రపంచమంతా లేకపోలేదు పఠిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో అనేక పేర్లు వెలుగులో ఉన్నా ప్రపంచమంతా పరిచయమున్న పేరు మాత్రం నోస్ట్రడామస్. ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల విశ్వాసం. అతను భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిలానే మర్మంగా ఉంటాయి. అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయ పరచుకుంటారు.

తాళపత్రాలపై రాయబడిన బ్రహ్మంగారి కాలజ్ఞాన తత్వాలు

బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట జన్మించిన కారణంగా ఆయన సరస్వతీ నదీ తీరప్రాంతంలో జన్మించారనిన చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్రదేశంలో పలు ప్రదేశాలు చోటు చేసుకున్నాయి. అనేక దేవతలు కూడా చోటు చేసుకున్నారు. గాంధి మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచింపబడింది. ఆంగ్లేయ, మహమ్మదీయ పాలన విజయనగర పతనం లాంటి చారిత్రక, రాజకీయ పరిణామాలు సూచింప బడ్డాయి. ప్రకృతి ప్రకోపాలు వింతలూ చోద్యాలు బాబాల రాక అనేక విధాలుగా ప్రజలు వంచనకు గురికావడం లాంటి సామాజిక విషయాలు వీటిలో చోటు చేసుకున్నాయి. ఆయన కలియుగాంతాన తిరిగి వస్తానని పదేపదే పునరుద్ఘాటించాడు. ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు సూచింప బడ్డాయి. ఒక సందర్భంలో ఆయన పూర్వజన్మల వాటి కాలం ఆయన వివరించిన తీరు నమ్మడం సామాన్యులకు కష్టమే.

కాలజ్ఞానం శైలి

మార్చు

వీర బ్రహ్మేంద్ర స్వామి కాల జ్ఞానాన్ని వివిధ శైలులను ఉపయోగించి కూర్చారు, అందులో శ్లోకాలు, పద్యాలు, వచనం మొదలైనవి.

బ్రహ్మం గారి తత్వాలు

మార్చు
1.చెప్పలేదంటనక పొయ్యేరు నరులార గురునుచేరి మ్రొక్కితె బ్రతక నేర్చేరు............... \\చె\\
చెప్పలేదంటనకపొయ్యేరు తప్పదిదిగో గురుని వాఖ్యము, తప్పు దోవను పోరు వారల చప్పరించె శక్తులు......\\చె\\
మొప్పె తనమున మోసపొయ్యేరు, అదియుగాక కొందరు గొప్పతనమున గోసు మీరేరు............\\చె\\
ఇప్పుడప్పుడనగ రాదు ఎప్పుడో ఏవేళనోమరి, గుప్పుగుప్పున దాటిరి యేడు గుఱ్ఱపడుగులు ఏరు పడును....\\చె\\

...........................................................

2'. ఏమి జన్మము ఏమి జీవనము, ఈ మాయ కాయము ఎణ్ణాళ్ళు బ్రతుకీది, మూన్నాళ్ళు ముచ్చట||
మూన్నాళ్ళముచ్చటగురుసేవ జేయని దేమి జన్మము ఏమి జీవనము, ఏమి జన్మంబేమిజీవనమేమిశాశ్వత మేమి సౌఖ్యము, ఏమి నాప్రారబ్దము స్వామి నన్నిటు జేసి మరచెను..............||ఏమి జన్మ||

.............................................................

3.జీవులెనుబది నాల్గు లక్షలు చావు పుట్టుక లిక్కడ...ఎవరు చేసిన కర్మముననుభవించేదక్కడా....||జీవు లెనుబది..||
తల్లిదండ్రులు, అన్నదమ్ములు, సతులు సుతులును ఇక్కడా, వెళ్ళిపొయ్యేటప్పుడెవ్వరు రారు మనతోడక్కడా....||జీవులెను...||
పంచభూతముల వలెనే ప్రపంచమైనది ఇక్కడా....., అంచితంబుగ నామరూపము లేనిస్థలముందక్కడా ||జీవులెనుబది...||

......................................................

4. కోటిలాటికోటా, జగతిలోయేకోటలేదు, వెయ్యిబురుజుల కోటైయున్నది, వెళ్ళిపొయ్యేదిబాటై యున్నది ||కోటలాటి...||
కొండలనడుమ కొంగయున్నది, కొంగముక్కులోలోకమున్నది, కోటిదీపములు వెలుగుచున్నది, కోరినవారికి ఫలమౌచున్నది||కో.]]
ఆరుకొమ్ముల ఏనుగున్నది, ఐదుకోతులను మేపుతున్నది, అవల ఈవల జూచుచున్నది అతిశయమైన ఆటాడుచున్నది..||కోటి..||

........................................................

5.ఈశ్వరి నిన్నె నమ్మితి భూలోకమాత ఈశ్వరీ నిన్నె నమ్మితి......................||ఈశ్వరీ.....||
ఈశ్వరమ్మవు నీవుగాక మోక్షమివ్వ నెవరి తరమూ సాక్షిపెట్టినిన్నునేనొక దీక్షచే సాదింతునమ్మా...||ఈశ్వరీ...||
చూప్లో రూపమాయె, రూపుచూపులేకమాయె పాపలానడుమను వెలిగే పరంజ్యోతి ఈశ్వరమ్మా...||ఈశ్వరీ..||

.............................................

యివి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు