బ్రహ్మాణి
బ్రహ్మణి మహాసరస్వతి అంశను కలిగి ఉంటుంది. బ్రహ్మ శక్తినిసంతరించుకుని రజోగుణము కలిగిన ఆదిశక్తి అవతారముగా చెబుతారు. గుజరాత్ లోని సెంజలియా పరివార్ (లేవ పటేల్) వారు బ్రహ్మణి మాతను కులదేవతగా కొలుస్తారు. రాజ్ కోట్ జిల్లా లోని మందిక్ పూర్, జెట్ పూర్ లలో పెద్ద బ్రహ్మణి దేవాలయము ఉంది. ప్రజాపతి మతస్తులు బ్రహ్మణి మాతను కులదేవతగా పూజిస్తారు. అహ్మదాబాద్ లో ప్రసిద్ధమైన బ్రహ్మణి దేవాలయము ఖోది నగర్, యన్.హెచ్.8, అహ్మదాబాద్, గుజరాత్, భారతదేశములో ఉంది. గుజరాత్ కి చెందిన సిద్ధిపూర్ నగరం లోని కల్యాణ గ్రామానికి చెందిన భరద్వాజ్ గోత్రీకులు బ్రాహ్మణీ మాతను కులదేవతగా పూజిస్తారు. అనేకమంది క్షత్రీయులు కూడా బ్రాహ్మణీ మాతను కులదేవతగా పూజిస్తారు. సిసోదియా, దోదియా రాజపుత్రులు కూడా తమ ఆరాధ్య ఇష్ఠదైవంగా ఆరాధిస్తారు. రంగాని ల్యూవా పటేల్ కూదా బ్రాహ్మణీ మాతను కులదేవతగా పూజిస్తారు.