బ్రిగిడా సాగ భారతీయ టెలివిజన్, చలనచిత్ర నటి, ఆమె ప్రధానంగా తమిళ చలనచిత్రాలలో నటిస్తుంది. 2023లో వచ్చిన సిందూరం సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసింది.[1]

బ్రిగిడా సాగ
జననం
సగయ బ్రిగిడా

చెన్నై, తమిళనాడు
జాతీయతఇండియన్
ఇతర పేర్లుసగయ బ్రిగిడా, పవి టీచర్
విద్యవిజువల్ కమ్యూనికేషన్‌లో బీఎస్సీ డిగ్రీ
విద్యాసంస్థలయోలా కళాశాల, చెన్నై
వృత్తిసినిమా నటి, టీవీ నటి
క్రియాశీల సంవత్సరాలు2019 - ప్రస్తుతం

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

తమిళనాడులోని చెన్నైలో బ్రిగిడా సాగ జన్మించింది. పాఠశాల విద్య పూర్తిచేసిన ఆమె చెన్నైలోని లయోలా కళాశాలలో విజువల్ కమ్యూనికేషన్‌లో బీఎస్సీ డిగ్రీ పట్టాపుచ్చుకుంది.

కెరీర్

మార్చు

2019లో ఆహా కళ్యాణం అనే వెబ్ సిరీస్‌తో బ్రిగిడా సాగ నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఇందులో తన అద్భుతమైన నటనకు ప్రేక్షకుల నుండి భారీ ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత అవలోడు అవన్, కన్ పెసుమ్ వార్తైగల్, తోల్ కడు.. చిత్రాలలో ఆమె నటించింది. అయోగ్య (2019) తమిళ చలనచిత్రంలో ఆమె మొదటిసారిగా నటించింది. ఆ తర్వాత వర్మ (2020), మాస్టర్ (2021), వేలన్ (2021), ఇరవిన్ నిజల్[2] (2022) వంటి సినిమాల్లో నటించింది.

శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సింధూరం సినిమాతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

ఫిల్మోగ్రఫీ

మార్చు
Year Movies List Note
2019 అయోగ్య తమిళ అరంగేట్రం
2019 వర్మ
2021 వేలన్
2021 మాస్టర్
2022 ఇరవిన్ నిజాల్
2023 సింధూరం తెలుగు అరంగేట్రం

మూలాలు

మార్చు
  1. "Siva Balaji, Dharma, Brigida Saga Starrer Sindhooram Teaser Out - Sakshi". web.archive.org. 2023-02-24. Archived from the original on 2023-02-24. Retrieved 2023-02-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "నగ్నంగా ఎందుకు నటించానంటే ! : Brigida Saga" (in ఇంగ్లీష్). 17 July 2022. Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.