బ్లడీ బెగ్గర్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. ఫిలమెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నెల్సన్ దిలీప్‌కుమార్ నిర్మించిన ఈ సినిమాకు శివబాలన్ ముత్తుకుమార్ దర్శకత్వం వహించాడు.[2] కవిన్, రాధా రవి, రెడిన్ కింగ్స్లీ, పృధ్వీ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను తమిళంలో అక్టోబర్ 31న నవంబర్ 4న విడుదల చేయగా,[3] తెలుగులో ట్రైలర్‌ను నవంబర్ 4న విడుదల చేసి, ఏసియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పీ ద్వారా ఈ సినిమాని తెలుగులో నవంబర్ 7న సినిమాను విడుదల చేశారు.[4]

బ్లడీ బెగ్గర్
దర్శకత్వంశివబాలన్ ముత్తుకుమార్
రచనశివబాలన్ ముత్తుకుమార్
నిర్మాతనెల్సన్ దిలీప్‌కుమార్
తారాగణం
ఛాయాగ్రహణంసుజిత్ సారంగ్
కూర్పుఆర్. నిర్మల్
సంగీతంజెన్ మార్టిన్
నిర్మాణ
సంస్థ
ఫిలమెంట్ పిక్చర్స్
పంపిణీదార్లుఫైవ్ స్టార్ కె. సెంథిల్
విడుదల తేదీ
8 నవంబరు 2024 (2024-11-08)
సినిమా నిడివి
139 నిమిషాలు [1]
దేశంభారతదేశం
భాషతెలుగు

చెన్నై నగరంలో ఒక బిచ్చగాడు (కవిన్ రాజ్) ముష్టెత్తుకుని జీవిస్తూ ఉంటాడు. తనకు దొరికిన జాక్ (రోహిత్ డెన్నిస్)ని పెంచుకుంటూ ఉంటాడు. ఒకరోజు అతనికి ఎవరూ భిక్షం వేయరు. ఆ సమయంలో చనిపోయిన సినీ నటుడు చంద్రబోస్ (రాధా రవి) ఇంట్లో 'అన్నదానం' (ఉచిత భోజనం) చేస్తారు, అన్నదానం కోసం మనిషి తగ్గాడని ఈ బిచ్చగాడిని తీసుకెళ్తారు. అక్కడ కార్యక్రమం పూర్తయ్యాక బిచ్చగాళ్లందరూ వెళ్లిపోతారు. కానీ కళ్లకెదురుగా ఉన్న పెద్ద భవనం నచ్చడంతో ఆ ఇంట్లోకి దొంగతనంగా దూరతాడు ఈ బిచ్చగాడు. ఆ భవనంలో నివసించే కొందరు ఆస్తికోసం బిచ్చగాడిని వారసుడును చేస్తారు. రూ. 300 కోట్ల ఆస్తికి వారసుడిగా బిచ్చగాడు ఏం చేశాడు ? చివరికి ఏమైంది ? అనేదే మిగతా సినిమా కథ.[5]

నటీనటులు

మార్చు
  • కవిన్[6]
  • రాధా రవి (ద్విపాత్రాభినయం​)
  • రెడిన్ కింగ్స్లీ
  • పదం వేణు కుమార్
  • పృధ్వీ రాజ్
  • సలీమా
  • ప్రియదర్శిని రాజ్‌కుమార్
  • సునీల్ సుఖద
  • టిఎమ్ కార్తీక్
  • అర్షద్
  • అక్షయ హరిహరన్
  • అనార్కలి నాజర్
  • దివ్య విక్రమ్
  • తనూజ మధురపంతుల
  • మెరిన్ ఫిలిప్
  • రోహిత్ డెనిస్
  • విద్యుత్ రవి
  • మహమ్మద్ బిలాల్
  • యు.శ్రీ సర్వవాన్
  • మాస్టర్‌ అజయ్‌కృష్ణ

మూలాలు

మార్చు
  1. "Bloody Beggar". British Board of Film Classification.
  2. The Hindu (29 October 2024). "Sivabalan Muthukumar interview: On Kavin's 'Bloody Beggar' and the quest to make a 'correct' film" (in Indian English). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  3. Eenadu (4 November 2024). "'బ్లడీ బెగ్గర్‌'.. తెలుగు ట్రైలర్‌ వచ్చేసింది". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  4. Sakshi (4 November 2024). "తెలుగులో విడుదలకానున్న 'బ్లడీ బెగ్గర్‌'". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  5. Sakshi (7 November 2024). "'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  6. News18 (31 October 2024). "Bloody Beggar: Kavin's Role In Comedy Thriller Explores Wealth And Poverty Divide" (in ఇంగ్లీష్). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

మార్చు