బ్లూ స్టార్ (కంపెనీ)

బ్లూ స్టార్ లిమిటెడ్ (Blue Star Ltd) ఎయిర్ కండిషనింగ్, కమర్షియల్ రిఫ్రిజిరేషన్,మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఫైర్ ఫైటింగ్(MEP). భారతదేశ స్వదేశీ ఎయిర్ కండిషనింగ్ వ్యాపారం లో రెండవ అతిపెద్ద కంపెనీ.[1] కంపెనీ ప్రధాన కార్యాలయం మహారాష్ట్ర రాజధాని ముంబై లో ఉన్నది.

బ్లూ స్టార్ లిమిటెడ్
రకంపబ్లిక్
ISININE472A01039
పరిశ్రమ
స్థాపన1943; 81 సంవత్సరాల క్రితం (1943)
స్థాపకుడుమోహన్ టి అద్వానీi
ప్రధాన కార్యాలయం,
సేవ చేసే ప్రాంతము
ప్రపంచ వ్యాప్తంగా
కీలక వ్యక్తులు
ఉత్పత్తులు
రెవెన్యూIncrease 5,404 crore (US$680 million) (2020)[3]
Increase 235 crore (US$29 million) (2020)[3]
Increase 140 crore (US$18 million) (2020)[3]
Total assetsIncrease 3,439 crore (US$430 million) (2020)[3]
Total equityIncrease 763 crore (US$96 million) (2020)[3]
ఉద్యోగుల సంఖ్య
2,800+ (2020)[3]
వెబ్‌సైట్www.bluestarindia.com Edit this on Wikidata

చరిత్ర

మార్చు

బ్లూ స్టార్ లిమిటెడ్ కంపెనీ వ్యవస్థాపకుడు మోహన్ టి అద్వానీ 1943 సంవత్సరంలో స్థాపించాడు. ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్ల పునఃనిర్మాణంలో నిమగ్నమైన ఒక సాధారణ 3-సభ్యుల బృందంగా కంపెనీ ప్రారంభమైంది. మూడు సంవత్సరాలలో కంపెనీ అమెరికా దేశానికి చెందిన మెల్చోయిర్ ఆర్మ్ స్ట్రాంగ్ డెస్సౌ ఎయిర్ కండిషనింగ్ పరికరాల కోసం ఏజెన్సీని పొందింది. 1947సంవత్సరంలో ఎయిర్ కండిషనింగ్ లో అమెరికా ప్రసిద్ధ కంపెనీ వర్తింగ్టన్ బ్లూ స్టార్ లిమిటెడ్ కంపెనీ భారతదేశాని భాగస్వామిగా ఎంపిక చేశారు. 1949సంవత్సరంలో కంపెనీ విస్తరణపై దృష్టి పెట్టి, వాటాదారులను తీసుకొని, బ్లూ స్టార్ ఇంజనీరింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ గా మారింది. మెటీరియల్ టెస్టింగ్ మెషిన్ లు, బిజినెస్ మెషిన్ ల కొరకు కంపెనీ డైవర్సిఫైడ్, ఏజెన్సీలను తీసుకుంది.[4]

అభివృద్ధి

మార్చు

1970 సంవత్సరంలో కంపెనీ హ్యూలెట్-ప్యాకార్డ్ ఉత్పత్తుల భారతదేశములో పంపిణీదారుగా భాధ్యతను చేపట్టింది.1977 సంవత్సరంలో బ్లూ స్టార్ దుబాయ్ దేశంలో అల్ షిరావితో కలిసి జాయింట్ వెంచర్ ను ఏర్పాటు చేసింది.1978 సంవత్సరంలో ఒక ఇండస్ట్రియల్ డివిజన్ ఏర్పాటు చేయబడింది, ఎయిర్ కండీషనింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, టర్న్ కీ ఇండస్ట్రియల్ ప్రాజెక్టులను చేపట్టడానికి. భరూచ్ ఫ్యాక్టరీ 1980 సంవత్సరంలో స్థాపించబడింది. ముంబైలో స్వీప్జ్ సాఫ్ట్ వేర్ ఎగుమతి యూనిట్ ను ఏర్పాటు చేశారు.1984 సంవత్సరంలో సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ పరికరాల కోసం యు.ఎస్.ఎ యార్క్ ఇంటర్నేషనల్ తో ఒప్పదం చేసుకున్నారు, తర్వాత మూడు సంవత్సరాలలో మోటరోలా, యోకోగావాతో జాయింట్ వెంచర్లు గా, 1988 సంవత్సరంలో కంపెనీ ఉత్పత్తుల తయారీలో మిత్సుబిషి సంస్థతో ఒప్పదం కుదుర్చుకున్నారు[4].

ఉత్పత్తులు- సేవలు

మార్చు

బ్లూ స్టార్ భారతదేశం ఎయిర్ కండిషనింగ్, వాణిజ్య శీతలీకరణ సంస్థ, వార్షిక ఆదాయం ₹ 5200 కోట్లు (US$ 750 మిలియన్లకు పైగా), 32 కార్యాలయాలు, 5 ఆధునిక తయారీ సౌకర్యాలు, 2800 మంది ఉద్యోగులతో, 2900 ఛానల్ భాగస్వాముల నెట్వర్క్. రూమ్ ఎసిలు, ప్యాకేజ్డ్ ఎయిర్ కండీషనర్లు, కోల్డ్ రూమ్, రిఫ్రిజిరేషన్ ప్రొడక్ట్, సిస్టమ్ ల కొరకు కంపెనీకి 5000 స్టోర్ లు, 765 సర్వీస్ అసోసియేట్ లు 800కు పైగా పట్టణాల్లోని వినియోగదారులకు సేవలను కంపెనీ అందచేస్తుంది. వినియోగదారులకు తమ ఉత్పత్తుల అమ్మకాల తర్వాత ఇతర సేవలకు (ఆఫ్టర్-సేల్స్ సర్వీస్) ఇవ్వడం, ప్రొవైడర్ బ్లూ స్టార్ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ మోడల్ తో, ఎండ్-టు-ఎండ్ సొల్యూషన్ ని అందించడానికి దోహదపడుతుంది, మార్కెట్ సేవలలో ఇతర కంపెనీ లతో పోలిస్తే, బ్లూ స్టార్ వినియోగదారులకు సేవలను ఇవ్వడంలో గణనీయమైన తేడాలతో ఉన్నది. భారతదేశంలోని ప్రతి మూడవ వాణిజ్య భవనాలాలో (కార్పొరేట్, వాణిజ్య, రెసిడెన్సియల్ వినియోగ దారులు) బ్లూ స్టార్ ఎయిర్ కండిషన్, వారి ఇతర ఉత్పత్తులు ఇన్ స్టాల్ చేశారు

భారతదేశపు మొట్టమొదటి RO+UV హాట్ & కోల్డ్ వాటర్ ప్యూరిఫయర్ తో సహా స్టైలిష్, విభిన్నమైన శ్రేణితో రెసిడెన్షియల్ వాటర్ ప్యూరిఫైయర్ ల వ్యాపారంలోకి బ్లూ స్టార్ ఉన్నది. ఇవిగాక ఎయిర్ ప్యూరిఫైయర్లు, ఎయిర్ కూలర్ల వంటి ఉత్త్పత్తులను అందిస్తుంది. ప్రత్యేక పారిశ్రామిక ప్రాజెక్టుల అమలుతో పాటుగా, టర్న్ కీ పరిష్కారాలను అందించడం కొరకు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఫైర్ ఫైటింగ్,ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ లు వంటి అనుబంధ కాంట్రాక్ట్ కార్యకలాపాల్లో కంపెనీ నైపుణ్యాన్ని అందిస్తుంది.[5]

మూలాలు

మార్చు
  1. Mukherjee, Writankar. "Blue Star eyes commercial refrigeration products, water purifiers as next growth driver". The Economic Times. Retrieved 2022-08-11.
  2. 2.0 2.1 "Blue Star Registered Address Contact Details, Blue Star Management". www.moneycontrol.com. Retrieved 4 May 2019.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "Blue Star Financial Statements". moneycontrol.com.
  4. 4.0 4.1 "Blue Star Ltd". Business Standard India. Retrieved 2022-08-11.
  5. www.ambitionbox.com. "Blue Star Overview and Company Profile". AmbitionBox (in ఇంగ్లీష్). Retrieved 2022-08-11.