ప్రొఫెసర్ భంగ్యా భూక్యా . ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ సోషల్ ఎక్స్‌క్లూషన్ స్టడీస్ విభాగపు అధిపతి. లండన్‌లో పిహెచ్.డి చేశారు. నిజాం పాలనలో లంబాడీల జీవితాలపైన ఆయన సమర్పించిన సిద్ధాంత గ్రంథం సబ్జుగేటెడ్ నోమాడ్స్ ఎన్నో యూనివర్సిటీల సిలబస్‌ పుస్తకం అయ్యింది. ఆ పుస్తకం తెలుగుతో సహా పలు భాషల్లోకి అనువాదం కూడా అయ్యింది. ఖమ్మం జిల్లా, చౌటపల్లి (కూసుమంచి) గ్రామశివారు బండమీది తండ సొంత ఊరు. ముగ్గురు అక్కలు, ఒక అన్న. ఖమ్మంలోని సిద్దారెడ్డి కాలేజ్‌లో హెచ్.ఇ.సి. గ్రూపుతో ఇంటర్‌, కర్నూలులోని సిల్వర్‌జూబ్లీ రెసిడెన్షియల్ కాలేజ్‌లో బి.ఏ., ఎం.ఏ., (చరిత్ర) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డిగ్రీ దాకా తెలుగు మాధ్యమమే. ఎం.ఫిల్ థీసిస్ సమర్పించక ముందే ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. పి.హెచ్.‌డి., కోసం లండన్ వెళ్లారు. అక్కడే ఉద్యోగం వచ్చే అవకాశాలున్నా నాదేశానికి తిరిగి వెళ్లి శక్తి మేరకు గిరిజనులకు ఏంసేవ చేసినా ఇండియాలోనే చేయాలని శపధం తీసుకున్నారు.

భంగ్యా భూక్యా

భావాలు, అనుభవాలు

మార్చు
  • పాఠాలు చెప్పే పంతుళ్లు స్కూలుకు ఆవల విద్యార్థుల జీవితమేమిటన్నది కొంతైనా ఆలోచించాలి.
  • కుంగదీసే గాయాల్ని కూడా నిచ్చెనగా చేసుకుని పైకెక్కిపోవాలి.అవమానాల్ని భరించే శక్తి ఉంటే తప్ప ఒక పేదవాడు ముందుకు సాగడం సాధ్యం కాదు.
  • నేనెవరు? వీళ్లెవరు? నాకోసం ఇంత చేయడం ఏమిటి? కళ్లల్లో కారం చల్లే టీచర్లు ఉన్న ఈ సమాజంలో మంచి వాళ్లు లేకపోతే సమాజం మీద నమ్మకమేముంటుంది?
  • సమాజంలో ఉన్నవి వర్గ సమస్యలు కాదు, కుల సమస్యలే. ఏమీ చదువుకోని మా నాన్న పట్ల వ్యవహరించిన తీరుకు, చదువుకుని ఒక స్థాయికి వచ్చిన నా పట్ల వ్యవహరించిన తీరుకు పెద్ద తేడా లేదు.సమాజంలో ఉన్నది కుల సమస్యే . క్లాసు లేదు. కులమే ఉంది .
  • వచ్చిన దారిని మర్చిపోతామా?ఎంత ఎత్తుకు ఎదిగినా దాటి వచ్చిన లోయల్ని మరిచిపోకూడదు. ఈనాటికీ అడుగడుగునా ఎన్నో అవమానాల్ని ఎదుర్కొంటూ దుర్భరమైన జీవితం గడుపుతున్న వారికి ఆసరా అందించడం కన్నా గొప్ప పని ఏముంటుంది? నా కృషి వెనుక ఒక ఉన్నత స్థానాన్ని అందుకోవాలన్న ఆశ కన్నా, లంబాడాలకు ఎదురవుతున్న అవమానాలకు అడ్డుకట్ట వేయాలన్న కసి ఉంది. పాజిటివ్ కసి సమాజానికి మంచే చేస్తుంది.

మూలాలు

మార్చు