భక్త కనకదాసు
భక్త కనకదాసు 1965 డిసెంబరు 17న విడుదలైన తెలుగు సినిమా. చాముండి పిక్చర్స్ పతాకంపై డి.సదానందం నిర్మించిన ఈ సినిమాకు వై.ఆర్.స్వామి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు మారెళ్ళ రంగారావు సంగీతాన్నందించాడు. [1] ఇది కన్నడ చిత్రం భక్త కనకదాస కు డబ్బింగ్ సినిమా.[2]
భక్త కనకదాసు (1965 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వై.ఆర్.స్వామి |
---|---|
నిర్మాణం | డి.సదానందం |
కథ | హుస్సూర్ కృష్ణమూర్తి |
చిత్రానువాదం | హుస్సూర్ కృష్ణమూర్తి |
సంగీతం | మారెళ్ళ రంగారావు |
ఛాయాగ్రహణం | ఆర్.మధు |
కూర్పు | గోవిందస్వామి ఎమెస్.పార్థసారధి |
విడుదల తేదీ | 1965 డిసెంబరు 17 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుఈ చలనచిత్రం కనకదాసు (1509-1609) అను విష్ణు భక్తుని జీవితం ఆధారంగా నిర్మించబడినది. ఇతను కర్ణాటకలోని గొప్ప భక్తుడు. కనకదాసు గొప్ప భక్తుడేకాక, మంచి కవి, తత్వవేత్త కూడా.
తారాగణం
మార్చు- ఉదయ్ కుమార్
- రాజ్ కుమార్
- కృష్ణకుమారి
మూలాలు
మార్చు- ↑ "Bhaktha Kanakadasu (1965)". Indiancine.ma. Retrieved 2021-06-07.
- ↑ "Bhakta Kanakadasu (Dubbing)". Cinemaazi (in ఇంగ్లీష్). Retrieved 2021-06-07.