మారెళ్ళ రంగారావు

మారెళ్ళ రంగారావు తెలుగు సినిమా సంగీత దర్శకుడు. ఇతడు ఎక్కువగా డబ్బింగ్ సినిమాలకు సంగీతాన్ని అందించాడు. చిత్రపు నారాయణమూర్తి, డి.యోగానంద్, తాతినేని ప్రకాశరావు, ఎ.భీంసింగ్, వి. రామచంద్రరావు, ఎ.సి.త్రిలోకచందర్, బి.ఎస్.రంగా, కృష్ణన్ - పంజు, జి.విశ్వనాథం, టి.ఆర్.రామన్న, సి.వి.శ్రీధర్ మొదలైన దర్శకుల సినిమాలకు ఇతడు సంగీతాన్ని సమకూర్చాడు. ఇతని స్వరకల్పనలో ఘంటసాల, ఎం.ఎస్.రామారావు, పి.బి.శ్రీనివాస్, పిఠాపురం, మాధవపెద్ది, పి.లీల, జిక్కి, కె.జమునారాణి, పి.సుశీల, కె.రాణి, రావు బాలసరస్వతీ దేవి, ఎ.పి.కోమల, ఎల్.ఆర్.ఈశ్వరి మొదలైన గాయినీ గాయకులు పాడారు. ఇతడు 1955-1990ల మధ్యకాలంలో చలనచిత్ర రంగంలో పనిచేశాడు. సుమారు 40 చిత్రాలకు సంగీత సారథ్యం వహించాడు. [1]

మారెళ్ళ రంగారావు
వృత్తిసంగీత దర్శకుడు

చిత్రాల జాబితా మార్చు

ఇతడు సంగీత దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు[1]:

మూలాలు మార్చు

  1. 1.0 1.1 వెబ్ మాస్టర్. "Marella_Rangarao". indiancine.ma. Retrieved 26 January 2022.