భక్త ధ్రువ మార్కండేయ

భక్త ధృవ మార్కండేయ 1982లో విడుదలైన తెలుగు సినిమా. ఇది తమిళంలో కూడా నిర్మించబడినది.సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించబడిన ఈ సినిమాకు పి.భానుమతి దర్శకత్వం వహించింది. [1]

భక్త ధ్రువ మార్కండేయ
(1982 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.భానుమతి
తారాగణం వంశీకృష్ణ ,
సురేష్,
శోభన
సంగీతం ఎస్.రాజేశ్వర రావు
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • మాస్టర్ హరి
  • రవిశంకర్
  • శోభన
  • రోహిణి
  • ధరిణి
  • మాస్టర్ సురేష్
  • మాస్టర్ బాబు
  • బేబీ వంశీకృష్ణ
  • సుధ
  • రాణి
  • కవిత
  • సురేష్
  • రాజశ్యామల
  • బాబు
  • చంద్రశేఖర్
  • మూర్తి
  • రాజాచంద్ర
  • ఆనంద్

సాంకేతిక వర్గం మార్చు

  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు: భానుమతీ రామకృష్ణ
  • సంగీతం: ఎస్.రాజేశ్వరరావు, భానుమతీ రామకృష్ణ
  • ఛాయాగ్రహణం: కె.యస్.ప్రకాష్
  • నిర్మాత, దర్శకురాలు: భానుమతీ రామకృష్ణ

కథ మార్చు

తన అల్పాయుష్కుడినన్న సంగతి తెలుసుకున్న మార్కండేయుడు నారదుని నోటి మీదుగా ధ్రువుని కథ విని, అదే ప్రకారం తాను కఠోరమైన తపోదీక్ష నవలంబించి పరమేశ్వరుని కృపకు పాత్రుడై పూర్ణాయుర్థాయాన్ని పొందితాడు. ఇక మార్కండేయునికి నారదుడు చెప్పిన కథలో...

ఉత్తానపాతుడనే మహారాజుకి ఇద్దరు భార్యలుంటారు. పెద్ద భార్య కుమారుడు ధ్రువుడు, రెండవ భార్య కుమారుడు ఉత్తముడు. ఉత్తముడికి రాజ్యాన్ని కట్టబెట్టే ప్రయత్నంలో రాజు గారి రెండవభార్య సురుచి ధ్రువుడిమీద హత్యా ప్రయత్నాలు జరుపుతుంది. ఒక రోజున తండ్రి ఒడిలో కూర్చోబోయిన ధ్రువుడు తనకు అక్కడ కూర్చునే అర్హత లేదని పినతల్లి చెప్పడంతో నారాయణుని ఒడిలో కూర్చునేందుకు బయలుదేరతాడు. నిశ్చలమైన తపోదీక్షతో ధ్రువుడు తన ధ్యేయాన్ని సాధించి ధ్రువ నక్షత్రమై నక్షత్ర మండలంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటాడు. ఉన్నతమైన పదవిని అందుకుంటాడు. పట్టుదల వలన సాధ్యం కానిది లేదనే విషయాన్ని చెప్పే కథాంశమిది.

సమీక్ష మార్చు

అందరూ బాలలే నటించగా రూపొందిన చిత్రం ఇది. ఉదాత్తమైన సంభాషణా సరళికి, ప్రతిభావంతమైన దర్శకత్వం చిత్రానికి నిండుతనాన్నిచ్చాయి.

ధ్రువునిగా వంశీకృష్ణ చక్కని అభినయాన్ని కనబరచింది. సంభాషణలను ముద్దులు మూటగట్టేలా చెప్పింది. ధ్రువుని తల్లిగా శోభన, పినతల్లిగా నటించిన రోహిణి బాగా నటించారు. మార్కండేయునిగా మాస్టర్ హరి నటించాడు. భానుమతి, యస్.రాజేశ్వరరావు కలసి సమకూర్చిన సంగీతంలో పాటలన్నీ శ్రవణ పేయంగా రూపొందాయి.

మూలాలు మార్చు

  1. "Bhakta Dhruva Markandeya (1982)". Indiancine.ma. Retrieved 2021-04-25.

బాహ్య లంకెలు మార్చు