శోభన
నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలైన శోభన, విక్రమ్ (నాగార్జున తొలి చిత్రం, హీరో ఆధారంగా తీయబడింది 1985) ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి, వెంకటేష్‌తో, మోహన్ బాబుతో (అల్లుడుగారు, రౌడీగారు, ఇటీవల గేమ్) మొదలైనవారితో నటించింది. తెలుగుతోపాటు మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. చంద్రముఖి (రజనీకాంత్) చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం మణిచిత్రతాళులో అద్భుతంగా నటించి అవార్డు పొందింది.
శోభన | |
---|---|
జననం | శోభనా చంద్రకుమార్ పిళ్లై 1970 మార్చి 21 |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1980–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | అవివాహిత |
పిల్లలు | 1 |
బంధువులు | ట్రావెన్కోర్ సిస్టర్స్ - లలిత, పద్మిని, రాగిణి (మేనత్తలు) కృష్ణ |
పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం (2006) కళైమామణి (2011) |
1980లలో భారతదేశంలో ప్రతిభావంతులైన కళాకారిణులలో ఈమెను ఒకరిగా చెప్పుకోవచ్చు. అందంలోను నటనలోనే కాక నాట్యంలో కూడా ఆద్భుతంగా రాణిస్తున్న వ్యక్తి ఈమె. ఆమె చెన్నై లోని చిదంబరం నాట్య అకాడెమీలో శిక్షణ పొందినది. ఆమె గురువు పేరు చిత్రా విశ్వేశ్వరన్ . భరత నాట్యంలో ఎంతో ముఖ్యమైన అభినయాన్ని ప్రదర్శించడంలో ఆమె దిట్ట. నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఈమె దగ్గర నటనలోను, నాట్యంలోను శిక్షణ తీసుకుంటున్నారు.
1994లో ఆమె కళార్పణ అనే సంస్థకు అంకురార్పణ చేసింది. ఈ సంస్థ యొక్క ముఖ్యోద్దేశం భరతనాట్యంలో శిక్షణ, భారతదేశమంతటా నృత్యవార్షికోత్సవాలు నిర్వహించడం.
నటి శోభన 2024 లోక్‌సభ ఎన్నికలలో తిరువనంతపురం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజీవ్ చంద్ర శేఖర్ కు ఆమె మద్దతు తెలిపింది.[1][2]
పురస్కారాలు
మార్చు1994లో విడుదలైన మణిచిత్రతళు అనే మలయాళ సినిమాకు గాను ఆమెకు భారత ప్రభుత్వం నుంచి తొలిసారిగా జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది. తరువాత 2001 వ సంవత్సరంలో ప్రముఖ దక్షిణాది నటి రేవతి దర్శకత్వం వహించిన మిత్ర్ మై ఫ్రెండ్ అనే ఆంగ్ల చిత్రానికి గాను రెండవసారి జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది.
శోభన నటించిన తెలుగు చిత్రాలు
మార్చు- విక్రమ్ (1986)
- విజృంభణ (1986)
- అజేయుడు (1987)
- త్రిమూర్తులు (1987)
- మువ్వగోపాలుడు (1987)
- అభినందన (1988)
- రుద్రవీణ (1988)
- అల్లుడుగారు (1990)
- కోకిల (1990)
- టైగర్ శివ (1990)
- నారీ నారీ నడుమ మురారి (1990)
- అల్లుడు దిద్దిన కాపురం (1991)
- ఏప్రిల్ 1 విడుదల (1991)
- కీచురాళ్లు (1991)
- రౌడీ అల్లుడు (1991)
- రౌడీగారి పెళ్ళాం (1991)
- అప్పుల అప్పారావు (1992)
- అహంకారి (1992)
- హలో డార్లింగ్ (1992)
- అసాధ్యులు (1992)
- రక్షణ (1993)
- నిప్పురవ్వ (1993) (ప్రత్యేక నృత్యం)
- సూర్యపుత్రులు (1997)
- గేమ్ (2006)
- పరిణయం (2021) - మలయాళం సినిమా ‘వరనే అవశ్యముంద్’ డబ్బింగ్
- ↑ The Hindu (15 April 2024). "Actor Shobhana throws weight behind Rajeev Chandrasekhar" (in Indian English). Archived from the original on 16 April 2024. Retrieved 16 April 2024.
- ↑ V6 Velugu (15 April 2024). "బీజేపీలో చేరిన సీనియర్ నటి శోభన..." Archived from the original on 16 April 2024. Retrieved 16 April 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)