భగవతి దేవాలయం
భగవతి దేవాలయం (చండీ భగవతి దేవాలయం) నేపాల్ దేశం సప్తరిలోని రాజ్‌బీరాజ్ నడిబొడ్డున ఉన్న హిందూ దేవాలయం. ఈ దేవాలయంలోని భగవతి దేవి నేపాలీ, భారతీయ యాత్రికులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. బడా దశాహ్న సమయంలో ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. దసరా సమయంలో ఇక్కడ కొన్ని వేల మేకలను బలి ఇస్తారు.[2] ఇక్కడి ప్రాగణంలో హనుమాన్ దేవాలయం, శివాలయం, బిశ్వకర్మ దేవాలయం వంటి అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి.[3] ఈ దేవాలయం వెనకవైపు భగవతి పోఖారి అనే ఒక చిన్న చెరువు కూడా ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఛట్ పూజ నిర్వహించబడుతోంది.
భగవతి దేవాలయం | |
---|---|
ఛండీ భగవతి దేవాలయం | |
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 26°32′27″N 86°44′51″E / 26.5407°N 86.7475°E |
దేశం | నేపాల్ |
రాష్ట్రం | సాగరమాత |
జిల్లా | సప్తరి జిల్లా |
ప్రదేశం | రాజ్బిరాజ్ |
ఎత్తు | 76 మీ. (249 అ.) |
సంస్కృతి | |
దైవం | భగవతి దేవి |
ముఖ్యమైన పర్వాలు | దసరా |
వాస్తుశైలి | |
దేవాలయాల సంఖ్య | 1 |
కట్టడాల సంఖ్య | 7 |
చరిత్ర, నిర్వహణ | |
నిర్మించిన తేదీ | 1925[1] |
చరిత్ర
మార్చుగొప్ప చారిత్రక, సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యతను కలిగివున్న ఈ దేవాలయం 1925లో నిర్మించబడింది.
ఉత్సవాలు
మార్చుప్రతి సంవత్సరం నేపాల్, భారతదేశం, ఇతర దేశాల నుండి వేలాది మంది యాత్రికులు వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించి భగవతీ దేవిని ఆరాధిస్తుంటారు. దసరా, తీహార్ పండుగల సమయంలో ఎక్కువమంది భక్తులు వస్తుంటారు.
మూలాలు
మార్చు- ↑ Dāsa, Harikāntalāla (2003). Saptarī Jillākā pramukha sāṃskr̥tika sthalaharu : eka adhyayana : laghuanusandhānakārya (1. saṃskaraṇa. ed.). Kāṭhamāḍauṃ: Nepāla Rājakīya Prajñā-Pratishṭhāna. p. 120. ISBN 9789993350569.
- ↑ "Bhagwati Temple". Boss Nepal. Archived from the original on 2021-11-29. Retrieved 2021-11-29.
- ↑ "नगरका अधिकांश मन्दिर जीर्ण". Rajdhaani. Archived from the original on 4 March 2016. Retrieved 26 August 2015.