భద్రక్
ఒడిషా రాష్ట్ర 30 జిల్లాలలో భద్రక్ జిల్లా ఒకటి.
Bhadrak | |
---|---|
district | |
![]() Location in Odisha, India | |
Country | ![]() |
State | Odisha |
Headquarters | Bhadrak |
ప్రభుత్వం | |
• Collector | Sri Krushna Chandra Patra |
• Member of Parliament | Arjun Charan Sethi, BJD |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,505 కి.మీ2 (967 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 15,06,522 |
• ర్యాంక్ | 12 |
• సాంద్రత | 601/కి.మీ2 (1,560/చ. మై.) |
Languages | |
• Official | Oriya, Hindi, English |
ప్రామాణిక కాలమానం | UTC+5:30 (IST) |
Telephone code | 06784 |
వాహనాల నమోదు కోడ్ | OD-22 |
Nearest city | Baleshwar |
Sex ratio | 981 ♂/♀ |
male | 760,591 |
female | 745,931 |
Literacy | 83.25% |
Precipitation | 1,427.9 millimetres (56.22 in) |
Avg. summer temperature | 48 °C (118 °F) |
Avg. winter temperature | 17 °C (63 °F) |
జాలస్థలి | bhadrak |
పేరు వెనుక చరిత్రసవరించు
జిల్లాకేంద్రంగా భద్రక్ పట్టణం ఉంది కనుక దీనికి ఈ పేరు వచ్చింది.
చరిత్రసవరించు
పురాతన చరిత్రసవరించు
స్వాతంత్ర్య సమరంలో భద్రక్ జిల్లాలోని బాసుదేవ్‌పూర్ వద్ద 30మంది బ్రిటిష్ పోలీసుల చేత కాల్చి చంపబడ్డారు. పురాణ కాలంలో ఒడిషాలో సంపదలతో వర్ధిల్లింది. చరిత్రను అనుసరించి రాజా ముకుంద్ దేవ్ భద్రక్ ప్రాంతానికి చివరి పాలకుడయ్యాడు. 1575లో ఈ ప్రాంతంలో ముస్లిములు నివసించడం మొదలైంది. తరువాత ఉస్మాన్ నాయకత్వంలో ఆఫ్గగన్లు రాజామాన్ సింగ్‌ను ఓటమికి గురిచేసారు.
మొగలు కాలంసవరించు
మొగల్ పాలనలో భద్రక్ జిల్లా బెంగాల్ నవాబుల సుభాహ్‌గా ఉండేది. మొగల్ సామ్రాజ్య పతనం తరువాత భద్రక్ ప్రాంతం పలు రాజాస్థానాలలో అంతర్భాగంగా ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వం మొత్తం ఒడిషా భూభాగాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత ఈ ప్రాంతం బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా మారింది.
స్వాతంత్రం తరువాతసవరించు
స్వాతంత్ర్యం తరువాత భద్రక్ ప్రాంతం విద్య, పరిశ్రమలు, వ్యవసాయం, వాణిజ్యం మరియు ఆర్థికం వంటి వైవిధ్యరంగాల మీద దృష్టిని కేంద్రీకరించింది.
ఆలయాలుసవరించు
జిల్లాలో పలు చారిత్రాత్మక ప్రదేశాలు మరియు స్మారక భవనాలు ఉన్నాయి. పలియాలో బిరంచినారాయణ ఆలయం ఉంది. " భద్రక్ జిల్లాలో రాధామనోహర ఆలయం " ప్రముఖ యాత్రీక ప్రదేశంగా ఉంది. చందబలికి 10కి.మీ దూరంలో ఉన్న అరడిలో అఖందలమణి ఆలయం ఉంది. 1993 ఏప్రిల్ 1 న బాలాసోర్ జిల్లా నుండి కొంత భూభాగం వేరు చేసి ఈ జిల్లా రఒందించబడింది.
భౌగోళికంసవరించు
జిల్లా వైశాల్యం 2505 చ.కి.మీ. భద్రక్ పట్టణం ఒడిషా రాజధాని భువనేశ్వర్ కు 125 కి.మీ దూరంలో ఉంటుంది. ఈ జిల్లా గుండా సలంది నది ప్రవహిస్తుంది.
ఆర్ధికంసవరించు
భద్రక్ జిల్లాలో ప్రముఖ " ఎఫ్.ఎ.సి.ఒ.ఆర్ " ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీలో దేశంలోనే నాణ్యమైన ఫెర్రో క్రోం ఉతపత్తి చేయబడుతుంది. నౌకానిర్మాణ పరిశ్రమ వంటి ఇండస్ట్రీలు ప్రతిపాదించబడ్డాయి.
పర్యాటక ఆకర్షణసవరించు
అఖండల్మణి ఆలయంసవరించు
అఖండల్మణి ఆలయం బైతరణి నదీతీరంలో ఉంది. ఆలయంలో ప్రధాన దైవం శివుడు. 350 సంవత్సరాల క్రితం రాజా నీలాద్రి శర్మ సింఘా మొహపాత్రా శివుని ఆరధిస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజా కలలో భూమిలో ఉన్న నల్లని శివలింగం కనిపించింది. రాజు ఆశివలింగాన్ని పైకి తీసి ఆలయం నిర్మించజేసాడు. తరువాత ఇది ప్రముఖ పర్యాటక కేంద్రగా యాత్రాస్థలంగా మారింది. ఆలయంలోని శిల్పచాతుర్యం పర్యాటకులను ముగ్ధులను చేస్తుంది. అఖండల్మణి ఆలయప్రాంతంలో శివరాత్రి నాడు పలు ఉత్సవాలు మరియు సంతలు నిర్వహించబడుతుంటాయి. ఈ సందర్భంలో దూరప్రాంతాల నుండి కూడా యాత్రీకులు ఇక్కడకు వస్తుంటారు. శ్రావణ మాసంలో కూడా శివాలయానికి పలువురు యాత్రీకులు స్వామిని ఆరాధిస్తుంటారు. అఖండల్మణి ఆలయం ఒడిషా రాష్ట్ర పర్యాటక రంగానికి ఆదాయం సమకూర్చడానికి ముఖ్యవనరులలో ఒకటిగా ఉంది.
ధర్మ రేవుసవరించు
ధర్మా నౌకాశ్రయం: బైతరిణి నదీతీరంలో ఉన్న పురాతనమైన రేవు ధర్మా. ఇది కనిక ప్యాలెస్‌కు 5 కి.మీ దూరంలో ఉంది. డైరెక్షన్ టవర్ మరియు ఇతర పురాతన స్మారక చిహ్నాలు ఉన్నాయి.
ప్రయాణసౌకర్యాలుసవరించు
జిల్లాలో ధర్మా పోర్ట్ ప్రతిపాదించబడింది. అంతేకాక సరికొత్తగా భద్రక్- ధర్మా రహదారి నిర్మించబడింది.
2001 లో గణాంకాలుసవరించు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,506,522,[1] |
ఇది దాదాపు. | గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | హవాయి నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 332వ స్థానంలో ఉంది..[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 601 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 12.95%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | |
జాతియ సరాసరి (928) కంటే. | 981:1000 [1] |
అక్షరాస్యత శాతం. | 83.25%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. |
జిల్లాలోని ప్రజలు అత్యధికంగా ఒడిషా భాష వాడుకభాషగా ఉంది. కొంతమంది ఉర్దు భాషను మాట్లాడుతుంటారు.
ఆలయాలుసవరించు
భద్రక్ జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన భద్రకాళీ ఆలయం ఉంది. అంతేకాక జిల్లాలో అరది, చందబలి, ధమనగర్, ధమర మరియు గుమ్ల నౌసాసన్ ఆలయాలు ఉన్నాయి. గెల్పూర్ పనచాయితీలో నలంగా గ్రామంలోని నలేశ్వరాలయం జిల్లాలోని ప్రధానాలయాలలో ఒకటి. నలేశ్వర్ ఆలయం ఒడిషా లోని పురాతన ఆలయాలలో ఒకటి. ప్రజాకవి జగన్నాథ్ పాణి (బైష్ణవ పాణి ) జన్మస్థలం నలంగా గ్రామం. జిల్లాలోని బసవదేవ్పూర్ నియోజకవర్గంలోని బ్రహ్మంగన్ గ్రామంలో ప్రముఖ ప్రసన్న కామేశ్వర మహాదేవాలయం ఉంది. ఇక్కడ హోళి సందర్భంలో మెలన జాత్రా నిర్వహించబడుతుంది. ఈ గ్రామంలో దుర్గా పూజ మరియు జగర్ కూడా ప్రాముఖ్య సంతరించుకున్నాయి. బంట, బసంటియా, బాసుదేబ్పూర్లలో మేళాలు నిర్వహించబడుతుంటాయి. పంచుక పూర్ణిమ దినం బసంతియా గ్రామంలో నిర్వహించే తెప్ప ఉత్సవంకూడా ప్రబలమైన ఉత్సవాలాలోఒకటి. ఈ ఆరాధన తరువాత ఒరియా సధబాలు (వ్యాపారులు) సమీపంలోఉన్న జావా, ఇండోనేషియా మరియు బొర్నియో దీవులకు కొన్ని మాసాల కాలం వ్యాపారానికి బయలుదేరుతుంటారు. ఈ మేళాలో కళాకారులు ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు.[4][5]
ప్రముఖులుసవరించు
- ఘౌరహరి దాస్ (1960 -), నవలా రచయిత, వ్యాసకర్త మరియు శంధగద గ్రామం నుండి మీడియా చిహ్నం.
- డాక్టర్.హరెక్రుష్న మహాతబ్, అగరపద, భద్రక్
- డాక్టర్ .హ్రుషికెష్ పాండా ఐఎఎస్ టాపర్ బెతద, భద్రక్
- డాక్టర్ .బిభు సంతోష్ బెహెర, యంగ్ సైంటిస్ట్, ఎఫ్.ఏ.ఎస్.డ్బల్యూ అవార్డు 2014 (జీవనాధార భద్రత), గనిజంగ్, భద్రక్ (2013-14) ప్రస్తుతం పీహెచ్డీ రీసెర్చ్ స్కాలర్, ఒ.యు.ఏ.టీ.భువనేశ్వర్
రాజకీయాలుసవరించు
అసెంబ్లీ నియోజక వర్గాలుసవరించు
The following is the 5 Vidhan sabha constituencies[6][7] of Bhadrak district and the elected members[8] of that area
No. | Constituency | Reservation | Extent of the Assembly Constituency (Blocks) | Member of 14th Assembly | Party |
---|---|---|---|---|---|
43 | భందరిపోఖరి | లేదు | భందరిపోఖరి, బొంథ్. | ప్రఫుల్ల సమల్ | బి.జె.డి |
44 | భద్రక్ | లేదు | భద్రక్ (ఎం), భద్రక్ | జుగల్ కిషోర్ పట్నాయక్ | బి.జె.డి |
45 | బాసుదేవర్ | లేదు | బసుదేవ్‌పూర్, తిహిది (భాగం) | బిజయ్ష్రీ రౌటరీ | బి.జె.డి |
46 | ధాంనగర్ | షెడ్యూల్డ్ | ధాంనగర్, తిహిది (భాగం) | రాజేంద్ర కుమార్ దాస్ | బి.జె.డి |
47 | చందబలి | లేదు | చందబలి, తిహిది (భాగం) | బిజయ నాయక్ | బి.జె.డి |
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires
|website=
(help) - ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
Gabon 1,576,665
line feed character in|quote=
at position 6 (help); Cite web requires|website=
(help) - ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30.
Hawaii 1,360,301
line feed character in|quote=
at position 7 (help); Cite web requires|website=
(help) - ↑ Bhadrak district, Orissa Diary
- ↑ Bhadrak District, District Info
- ↑ Assembly Constituencies and their EXtent
- ↑ Seats of Odisha
- ↑ "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Retrieved 19 February 2013.
MEMBER NAME
వెలుపలి లింకులుసవరించు
వెలుపలి లింకులుసవరించు
Wikimedia Commons has media related to భద్రక్. |