భద్రకాళి
భద్రకాళి (సంస్కృతం: भद्रकाली, తమిళం: பத்ரகாளி, English: bhadrakali, మళయాళం: ഭദ്രകാളി, కన్నడ: ಭದ್ರಕಾಳಿ, Kodava: ಭದ್ರಕಾಳಿ) (literally "Good Kali,") [2] దక్షిణ భారతదేశంలో పూజింపబడే హిందూ దేవత. ఈ దేవత తీవ్రమైన రూపం కలిగి ఉంటుందని, దుర్గా దేవి అంశ అనీ దేవీ మహత్యంలో చెప్పబడింది. భద్రకాళి, కేరళలో శ్రీ భద్రకాళి, కరియం కాళి, మూర్తి దేవి అని ప్రసిద్ధి. కేరళలో ఈ దేవత పరమ పవిత్రమైందని, మంచిని కాపాడుతుందని నమ్ముతారు.
భద్ర కాళి | |
---|---|
దేవనాగరి | भद्र कालि |
సంస్కృత అనువాదం | भद्र कालि |
తమిళ లిపి | பத்ர காளி |
Malayalam | ഭദ്രകാളി |
అనుబంధం | పార్వతి |
మంత్రం | ఓమ్ హ్రీమ్ భద్రకాళాయై నమః[1] |
ఆయుధములు | ఖడ్గం |
భర్త / భార్య | శివుడు |
మతం | హిందూ మతం |
భద్రకాళి ఒక గ్రామదేవత అనీ, కాలక్రమేణా హిందూ దేవతలలో కలిసిపోయిందని భావిస్తారు. ఈ దేవత గురించి శివుడి పురాణాల్లో ముఖ్యంగా ప్రస్తావించబడింది. కాళీ సాధారణంగా మూడు కళ్ళు, నాలుగు, పన్నెండు లేదా పద్దెనిమిది చేతులతో దర్శనమిస్తుంది. శిరస్సు నుంచి అగ్ని జ్వాలలు, కోరల్లాంటి దంతాలు, మరిన్ని ఆయుధాలు కలిగి ఉంటుంది. ఈమెను ప్రధానంగా తాంత్రిక విద్యలు అవలంబించే వారు పరా శక్తిగా ఆరాధిస్తుంటారు. ఈ తాంత్రిక విద్య దశ-మాహావిద్యలలో ఒకటి.
పురాణం
మార్చుభద్రకాళి, ఆది పరాశక్తికి ఇంకొక రూపమని ప్రగాఢ విశ్వాసం. పరమశివుడు, శచీ దేవి ఆత్మాహుతి గురించి విని, దక్ష యజ్ఞాన్ని భగ్నం చేయడానికి తలపిస్తూ, తన జాతాఝటాన్ని నేలకేసి కొడతాడు. దాని నుంచి ఉద్భవించినవారే వీరభద్రుడు, భద్రకాళి. ఈ భద్రకాళే పార్వతి అని, శచి అని కూడా నమ్ముతారు.
ప్రముఖ దేవాలయాలు
మార్చు- చెట్టికులాంగర దేవి, అళపుళ
- అట్టుకల్ భగవతి, తిరువనంతపురం
- కొడుంగళూర్ భగవతి, త్రిసూర్
- భద్రకాళి గుడి, వరంగల్
మూలాలు
మార్చుఇతర లింకులు
మార్చు- Dictionary of Hindu Lore and Legend (ISBN 0-500-51088-1) by Anna Dallapiccola
- Maha Kshethrangalude Munnil, D. C. Books, Kerala