భద్రమ్ 2014లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో 2014 ఫిబ్రవరి 28న ‘తెగిడి’ పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో ‘భద్రమ్’ పేరుతో శ్రేయాస్ మీడియా, పుష్యమి ఫిలిమ్ మేకర్స్ బ్యానర్స్ పై శ్రేయాస్ శ్రీనివాస్, బి.శ్రీనివాస రెడ్డి నిర్మించారు.[2] అశోక్ సెల్వన్, జనని అయ్యర్, జయప్రకాశ్, కాళీ వెంకట ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు పి. రమేష్ దర్శకత్వం వహించగా 2014 మార్చి 21న విడుదలైంది.[3]

భద్రమ్
దర్శకత్వంపి. రమేష్
రచనపి. రమేష్
నిర్మాతశ్రేయాస్ శ్రీనివాస్, బి.శ్రీనివాస రెడ్డి
తారాగణంఅశోక్ సెల్వన్, జనని అయ్యర్, జయప్రకాశ్
ఛాయాగ్రహణందినేష్ కృష్ణన్
కూర్పులియో జాన్‌ పాల్‌
సంగీతంనివాస్ ప్రసన్న
విడుదల తేదీ
2014 మార్చి 21 (2014-03-21)
సినిమా నిడివి
116 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు
బడ్జెట్2.7 కోట్లు[1]
బాక్సాఫీసు10 కోట్లు (అంచనా)

కథ మార్చు

వేణు (అశోక్ సెల్వన్) క్రిమినాలజి కోర్సు పూర్తి చేసి, హైదరాబాద్‌లో రాడికల్ డిటెక్టివ్ ఏజెన్సీలో డిటెక్టివ్ చేరి మంచి పేరు సంపాదిస్తాడు. ఈ క్రమంలో వేణు చేతికి మధు శ్రీ (జనని అయ్యర్) కేసు వస్తుంది. వేణు ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నంలో పరిచయం ఏర్పడి పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. వేణుకి తను గతంలో డీల్ చేసిన నాలుగు కేసులలోని వ్యక్తులు చనిపోతున్నారని, వారి చావుతో ప్రస్తుతం తను డీల్ చేస్తున్న మధు కేసుకి కూడా సంభంధం ఉన్నట్టు గ్రహిస్తాడు. ఆ ఐదు కేసులకి ఉన్న సంభంధం ఏంటి? వాటితో మధుకి ఉన్న సంభంధం ఏంటి ? అసలు వారెందుకు చనిపోయారు? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్లు:శ్రేయాస్ మీడియా, పుష్యమి ఫిలిమ్ మేకర్స్
 • నిర్మాతలు: శ్రేయాస్ శ్రీనివాస్, బి.శ్రీనివాస రెడ్డి
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి. రమేష్
 • సహ నిర్మాత: డి.ఉమాదేవి
 • సంగీతం: నివాస్ ప్రసన్న [5]
 • సినిమాటోగ్రఫీ: దినేష్ కృష్ణన్
 • ఎడిటర్: లియో జాన్‌ పాల్‌

మూలాలు మార్చు

 1. "Interview with filmmaker CV Kumar about Bhadram – Telugu cinema director". Idlebrain.com. 2014-03-20. Retrieved 2014-05-30.
 2. Sakshi (2 March 2014). "ఉత్కంఠ రేపే భద్రమ్". Archived from the original on 3 నవంబరు 2021. Retrieved 3 November 2021.
 3. Sakshi (18 March 2014). "హత్యలు చేస్తోందెవరు?". Archived from the original on 3 నవంబరు 2021. Retrieved 3 November 2021.
 4. Telugu Great Andhra (21 March 2014). "సినిమా రివ్యూ: భద్రమ్‌" (in ఇంగ్లీష్). Archived from the original on 3 November 2021. Retrieved 3 November 2021.
 5. Sakshi (22 February 2014). "ఉత్కంఠను రేకెత్తించే భద్రమ్". Archived from the original on 3 November 2021. Retrieved 3 November 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=భద్రమ్&oldid=3798787" నుండి వెలికితీశారు