భరత్ భాల్కే (28 నవంబర్ 1960 - 28 నవంబర్ 2020) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు పండర్‌పూర్ నియోజకవర్గం నుండి మహారాష్ట్ర శాసనసభకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

భరత్ భాల్కే

పదవీ కాలం
13 అక్టోబర్ 2009 – 28 నవంబర్ 2020
ముందు విజయ్‌సింగ్ మోహితే పాటిల్
తరువాత సమాధాన్ ఔతడే
నియోజకవర్గం పండర్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం 28 నవంబర్ 1960
సర్కోలి గ్రామం, పంధర్‌పూర్‌
మరణం 2020 నవంబరు 28(2020-11-28) (వయసు 60)
పంధర్‌పూర్
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
సంతానం భగీరథ భరత్ భాల్కే,[1] భాగ్యశ్రీ కదమ్, రాజశ్రీ పాటిల్, ధనశ్రీ దేశ్‌ముఖ్
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

భరత్ భాల్కే 1992లో తాలూకా స్థాయి రాజకీయాల్లో క్రియాశీలకంగా వచ్చి విఠల్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 2002 నుంచి మరణించే వరకు ఫ్యాక్టరీ చైర్మన్‌గా ఉన్నాడు. ఆయన 2009లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పండర్‌పూర్ నియోజకవర్గం నుండి స్వాభిమాని పక్ష అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి మాజీ ఉప ముఖ్యమంత్రి విజయ్‌సింగ్ మోహితే పాటిల్‌ను 37,363 ఓట్ల తేడాతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

భరత్ భాల్కే 2014లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వాభిమాని పక్ష అభ్యర్థి సుభాష్ పరిచారక్ శైలేంద్ర(ప్రశాంత్) ప్రభాకర్ పై 8,913 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

భరత్ భాల్కే 2019లో జరిగిన ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సుధాకర్ రామచంద్ర పరిచారక్ పై 13,361ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5]

భరత్ భాల్కే కోవిడ్ అనంతర సమస్యలకు చికిత్స పొందుతూ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 2020 నవంబరు 28న మరణించాడు. ఆయనకు భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు, మనుమలు ఉన్నారు.[6][7][8]

మూలాలు

మార్చు
  1. Hindustantimes (8 July 2024). "Former NCP leader Bhagirath Bhalke wants to return to party, meets Sharad Pawar". Retrieved 25 October 2024.
  2. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  3. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  4. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. TV9 Marathi (20 March 2021). "भालकेंच्या जागी पोटनिवडणुकीत मुलगा की पत्नी? अजितदादा-जयंत पाटील पंढरपुरात फैसला करणार". Retrieved 25 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. The Hindu (28 November 2020). "Three-time NCP legislator Bharat Bhalke passes away due to post-COVID-19 complications" (in Indian English). Retrieved 25 October 2024.
  7. The Indian Express (28 November 2020). "Maharashtra: Three-time MLA Bharat Bhalke dies of post-Covid complications" (in ఇంగ్లీష్). Retrieved 25 October 2024.
  8. The Times of India (28 November 2020). "Maharashtra: NCP MLA Bharat Bhalke dies of post-Covid complications". Retrieved 25 October 2024.