భాగవతులు
భరత నాట్య సంప్రదాయ ప్రవర్తకులలో కూచిపూడి కన్న ప్రథములు పోతక మూరి భాగవతులు. వీరు అహోబల స్వామి సన్నిధిని నాట్యాచార్యులై నిత్య నాట్య సేవ చేసారు. శ్రీవెలయపాల వారధి పవ్వళించి జోజో, అన్న జోల పాట ఈ భాగవతులు రచించిందే. వీరిని తాళ్ళాపాక అన్నామాచార్యులే పేర్కొన్నారన్న, గీత నాట్యాలలో వీరికి గల ప్రతిభ వ్వక్తం కాగలదనీ వీరు 1280 ప్రాంత్రపు వారనీ తెలుస్తూంది. దీనిని బట్టి భాగవత కళ రాయలసీమలో తర తరాలుగా ప్రచారంలో వున్నట్లు తెలుస్తూ ఉంది.
భాగవత కళ, నావాబుల ఆదరణ
మార్చుభాగవత కళను రాయలసీమలో విరివిగా ప్రచారం చేయవలెనన్న తలంపుతో క్రీ:శ:. 1700 - 1759 ప్రాంతాలలో బనగాని పల్లె నవాబు గారు కూచి పూడి నుండి కొందరు కళా వేత్తల కుటుంబాలను ఆహ్వానించి కోట కొండ, కపట్రాల గ్రామాలలో వారికి భూములు ఇచ్చి, వారి చేత కర్నూలు జిల్లాలో భాగవత కళ ప్రచారాన్ని ప్రోత్సహించారు. అప్పటిలో కూచి పూడి నుండి తరలి వెళ్ళిన కుటుంబాలలో ప్రథముడు చల్లా భాగవతం దాసం భొట్లు, సిద్ధేంద్రయోగి నేర్పించిన పారిజాతాపహరణాన్ని పారంపర్యంగా ప్రదర్శించిన వారిలో చల్లావారు ముఖ్యులు. తొమ్మిదవ తరానికి భరత శాస్త్రం లక్ష్మీనారాయణ శాస్త్రి సుప్రసిద్ధ నాట్య కళా విశారదుడు. భామా కలాపాన్నీ, గొల్ల కలాపాన్నీ, క్షేత్రయ్య పదాలనూ, తరంగాలనూ అభినయించడంలో దిట్ట. సంగీత నృత్య విద్యల్లోనే కాక, సంస్కృతాంధ్ర భాషల్లో చక్కని పాండితీ ప్రతిభ గడించిన వారు.
ఆదరించిన కర్నూలు నవాబు:
మార్చుకూచి పూడి వీధి భాగవతులకు గోలు కొండ నవాబు తానీషా ఎలా అగ్రహారాన్ని దానం చేశాడో అదే విధంగా కోట కొండ భాగవతులకు కర్నూలు నవాబు 200 ఎకరాల భూమి శ్రోత్రియంగా ఇచ్చారట. ఆ హక్కు ఈ నాటికి వారి అనుభవంలో ఉంది. వీరి ఇలవేల్పు కౌలుట్ల చెన్న కేశవుడు. వీరి కుంటుంబంలోని ప్రతి మగపిల్ల వానికి ఐదవ ఏట ఆ దేవాలయంలో ముక్కు కుట్టిస్తారట. ఆ దేవుని ఎదుట గజ్జె కట్తించి, ప్రథమ పాటాలు ప్రారంబిస్తారట. విద్య పూర్తి కాగానే చెన్న కేశవుని సన్నిధానంలో ప్రథమ ప్రదర్శనం ఇచ్చిన అనంతరం గాని రాజుల వద్ద ప్రదర్శించే వారు కారట. వీరికి ఎక్కువ మక్కువతో అభ్యాస మైన విద్యలు, తరంగాలు, అష్టపదులు క్షేత్రయ్య పదాలు.
కపట్రాల భాగవతుల
మార్చురెండు వందల సంవత్సరాలకు పూర్వం బనగాన పల్లి నవాబులు కర్నూలు సమీపంలో తుంగభద్రా నదికి అవతల ప్రక్కన అలంపురానికి దగ్గరగా నున్న చారిత్రిక సుందర నగరం కపట్రాల వీరికి ఇనాముగా యిచ్చారు. ఆనాడె కూచిపూడి నుండి కొంత మంది చల్లా వారు కుటుంబాలతో అక్కడకు వెళ్ళారు. కూచి పూడి సంప్రదాయాన్నే వారు నైజాం సంస్థానంలో ప్రచారం చేశారు. కాని రాను రాను వారి కళా సాంప్రదాయం నిర్జీవ మైపోయింది. వీరు కూడా ఆ గ్రామంలో వున్న కాళత్తయ్య దేవాలయంలో బిడ్డలందరికీ చిన్నతనంలోనే ముక్కులూ, చెవులూ కుట్టించి, గజ్జె కట్తించి నాట్యా భ్యాసానికి ప్రారంభోత్సవం చేసే వారట. అక్కడ వున్న కళాకారులు చల్ల మోహన కృష్ణ, చల్లా కాళత్తయ్య, చల్ల ముద్దు కృష్ణ మొదలైన వారు వీధి భాగవతాలను ప్రచారం చేశారు.
చల్లావారు
మార్చుసిద్ధేద్రయోగి పేరు నిలబెట్టిన వారు చల్లావారు. ఈ మధ్య కీర్తి శేషులైన భరత శాస్స్త్రం లక్ష్మీ నారాయణ శాస్త్రి, వారిలో తొమ్మిదవ తరానికి చెందిన వారు. శాస్త్రి గారు ఆ కళాకారుల కుటుంబానికి చెందిన సుప్రసిద్ధ నాట్య కళా విశారదులు. భామా కలాపాన్ని, గొల్ల కలాపాన్నీ క్షేత్రయ్య పదాలనూ, తరంగాలగానూ అభినయించడంలో దిట్ట. నృత్య విద్యల్లోనే గాక, సంస్కృతాంధ్ర భాషలలో చక్కని పాండితీ ప్రతిభ గడించారు. నృత్య రీతిలో వీరి బాణీకీ, కూచిపూడి వారి బాణీకీ అడుగుల క్రమంలోనూ, జాతి విన్యాసాల్లోనూ తేడా వున్నట్లు ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వారిచేత జరుప బడిన కూచిపూడి నాట్య సదస్సులో వివరించారు. వీరి కలాపంలో కొన్ని భాగాలను ఆనాడు అఖిల భారత సంగీత నాటక అకాడమీ వారు టేపు రికార్డు చేశారు. వారి సాంప్రదాయం ఎటువంటిదో మనకు తెలియకుండా పోయింది. కోట కొండలో ఈ నాటికీ వున్న లక్ష్మీనారాయణ శాస్త్రి గారి అన్న కుమారుడైన రంగయ్య గారికి భరత నాట్య శాస్త్రంలో అభినివేశం అట్లాగే వున్నదట. మరికొందరున్నా జీవనోపాధి కష్టమై ఇతర వృత్తుల లోనూ, వ్వవసాయంలోనూ ఆసక్తిని పెంచు కున్నారు..
సూచికలు
మార్చుయితర లింకులు
మార్చు- తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు,