భారతదేశంలో జర్నలిజం

(భారతదదేశంలో జర్నలిజం నుండి దారిమార్పు చెందింది)

భారతదేశంలో జేమ్స్ అగస్టీన్ హీకీ 1780 లో "బెంగాల్ గెజిట్" పేరిట మొట్ట మొదటి పత్రిక వెలువరించారు దానికే కలకత్తా జనరల్ అడ్వార్టైజర్ అని పిలిచేవారు. తోలి భారతీయ వార్తా పత్రిక ప్రారంభించిన వ్యక్తి గంగాధర భట్టాచార్జీ . ఆయన 1816 లో బెంగాల్ గెజిట్ బెంగాలీ భాషలో ప్రచురించాడు.1868 లో శశికుమార్ ఘోస్ అతని ఎనిమిది మంది అన్నదమ్ములు కలిసి జాస్పూర్ జిల్లా స్వగ్రామం అమృత బజార్ (ఇప్పుడు బంగ్లాదేశ్ లో వుంది) లో అమృత బజార్ పత్రిక ప్రారంభించారు. ౧౮౭౮ లో ది హిందూ పత్రిక మొదలైంది. రాబర్ట్ నైట్ సంపాదకత్వంలో ద బాంబె టైమ్స్ ఉండేది, అదే తరువాతి కాలంలో ది టైమ్స్ అఫ్ ఇండియాగా రూపొందింది, ది టైమ్స్ అఫ్ ఇండియా 1861 లో పుట్టి థామస్ బెన్నెట్ ఆధ్వర్యంలో రాబర్ట్ నైట్ సంప్రదాయాన్ని కొనసాగించింది 1881 లో బాలగంగాధర తిలక్ కేసరి, మహారాటా పత్రికలను మరాఠీలో ప్రచురించారు. 1919 లో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ యంగ్ ఇండియా అనే వార పత్రిక ప్రారంభించారు.1938 లో జవహర్ లాల్ నెహ్రూ సంచాలక సమాఖ్య అధ్యక్షుడిగా నేషనల్ హెరాల్డ్ పత్రిక మొదలైంది .

త్రిపుర రాష్ట్రంలో జరిగిన జర్నలిస్టు యూనియన్ స్టేట్ సమావేశం