భారతదేశం లో మొబైల్ - పరిపాలన

{{Underlinked|date=అక్టోబరు 2016))

భారతదేశం లో మొబైల్ - పరిపాలన

మొబైల్ ఫోను : ఒక బాధ్యతాయుతమైన బట్వాడా మార్గంగా ఏర్పడుతున్న క్రమం

ఈ రోజు మొబైల్ ఫోను, కేవలం వాక్యాలను, మాటల ద్వారా సమాచార సంబంధం కల్పించే ఉపకరణంగా లేదు. ఇది పట్టణ ధనికులు, పల్లె పేదల మధ్య ఉన్న అంకెల అంతరాన్ని తొలగించడంలో ఒక దృఢమైన సాంకేతిక విజ్ఞానంగా అవతరించింది. భారతదేశంలో, మొబైల్ ఫోను ప్రవేశించిన రెండు దశాబ్దాలలో, మారుమూల గ్రామీణ పల్లెలకు, అనుసంధాన లోపం, విద్యుత్ కొరత, తక్కువ స్ధాయి అక్షరాస్యత వంటి అందరికీ తెలిసిన అడ్డంకులు ఉన్నప్పటికీ, చేరుతుంది. ఇంకొక వైపు, యువకులకు, ప్రత్యక్షంగానూ, పరోక్షంగాను లక్షలాది ఉద్యోగావకాశాలను కల్పిస్తుంది.

తన అభివృద్ధి పధంలోని రెండవ దశలో, వివిధ రకాల సేవలకు ఇది ఒక బట్వాడా మాద్యమంగా అవతరించింది. ఎవరైనా తమ మొబైల్ ఫోనును ఉపయోగించి, తమ బ్యాంకు ఖాతాలోని సోమ్మును వేరొక బ్యాంకు ఖాతా లోనికి బదిలీ చేయవచ్చు. ప్రభుత్వ సంస్ధలు, ప్రైవేట్ సంస్ధలు కూడా తమ పౌర సేవలు, వ్యాపార సేవలను సామాన్య మానవునికి మొబైల్ ఫోను ద్వారా అందజేయడం మొదలు పెట్టాయి. ఈ మధ్యనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ యిండియా, వాణిజ్య బ్యాంకుల సేవలను మొబైల్ ఫోను ద్వారా అందజేయడానికి ఒప్పుకుంది. అదే విధంగా భారత ప్రభుత్వం, మంత్రిత్వ శాఖల సమన్వయంతో అభివృద్ధి చేసిన మొబైల్ ఫోను ద్వారా ఆర్థిక సేవల బట్వాడా పై పధక రచనను అంగీకరించింది. 3 జి సాంకేతిక పరిజ్ఞానం, భారతదేశంలో ప్రారంభమైన తరువాత (2010 సంవత్సరాయంలో సామాన్యంగా వినియోగించుకోవడానికి, ఇది అందుబాటులో ఉంటాయి.) వినియోగదారులు, ఆరోగ్య, విద్య, వ్యవసాయం, సమాచార సేవలను తమ మొబైల్ ఫోను ద్వారానే అందుకోగలుగుతారు. భారతదేశంలో మొబైల్ – పరిపాలన మొబైల్ బ్యాంకింగ్

శరవేగంతో పురోగమిస్తున్న భారత బ్యాంకింగ్ రంగం - ఖాతాదారులకోసం మొబైల్ బ్యాంకింగ్ అనే కొత్త సేవలను ప్రవేశపెట్టింది. ఈ సేవల సహాయంతో ఖాతాదారులు బ్యాంకుకు వెళ్ళకుండానే కేవలం ఎస్ ఎమ్ ఎస్ అధారిత ప్రశ్నలు, మెలుకువలు (ఎలర్ట్స) ద్వారా తమ ఖాతాను, అందులోని లావాదేవీల గురించి తెలుసుకోవచ్చును . ఈ సేవలను కొన్ని బ్యాంకులు ఉచితంగా అందిస్తుండగా, మిగిలిన బ్యాంకులు ఖాతాదారులనుంచి సంవత్సరానికి కొంత మెత్తం ఫీసుగా వసూలు చేస్తున్నాయి. ఈ సేవలను పొందడానికి సెల్ ఫో్న్ నుంచి బ్యాంకుకు ఎస్.ఎమ్.ఎస్ పంపించడానికి అయ్యే ఛార్జిని మాత్రం ఖాతాదారే భరించాల్సిఉంటుంది.

కొన్ని బ్యాంకులైతే సెల్ ఫోన్ల ద్వారా ఖాతాదారులకు ప్రత్యేకమైన వ్యక్తిగత బ్యాంకింగ్ సేవలను (personalized banking) కూడా అందిస్తున్నాయి. అయితే దీనికి గానూ ఆ బ్యాంకులు ఆ ఖాతాదారుల సెల్ ఫోన్ లలో ఒక ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ అమర్చవలసి ఉంది. ఇది జి పి ఆర్ ఎస్ వాడుకలో ఉన్న మొబైల్ హాండ్ సెట్స్ లో మటుకే వీలవుతుంది. ఈ ప్రక్రియ చాలా సులభమైనది, ఖాతాదారులు దీనిని సులువుగా వాడుకోవచ్చు.

మొబైల్ బ్యాంకింగ్ అందిస్తున్న కొన్ని బ్యాంకుల వివరాలు ఇలా ఉన్నాయి: ఆంధ్రా బ్యాంక్ లభ్యమయే సేవలు: 1.ఎస్ ఎమ్ ఎస్ హెచ్చరిక సౌకర్యం

 1. కొంత పరిధి, దాటిన తరువాత కార్యకలాపాలకి
 2. కొంత పరిధి దాటిన తరువాత ఎటిమ్ నుండి తీయడం
 3. చెక్ రిటర్న్ లు
 4. చెక్ బుక్ జారీ చేయడం
 5. కట్టాల్సిన టెర్మ్ డిపోజిట్,
 6. రోజు చివరలో ఏదైనా కార్యకలాపాలకి బ్యాలెన్స్

2 విచారణ

బ్యాలెన్స్ విచారణ చివరి మూడు కార్యకలాపాలు చెక్ యొక్క స్థితిగతుల విచారణ ఎస్ ఎమ్ ఎస్ పాస్ వర్డు మార్పు

నమోదు చేసేవిధానం:సవరించు

నియమనిబంధనలని అంగీకరిస్తూ సంతకం చేసిన ఫార్మ్ ని ఇవ్వడం ద్వారా మొబైల్ బ్యాంకింగు సేవలకి ఆంధ్రాబ్యాంకు కస్టమరు తనకు తానే నమోదు చేసుకోవచ్చు. ఖాతా ఉన్నవారికి దగ్గరలో ఉన్న ఆంధ్రాబ్యాంక్ శాఖ లో ధరఖస్తూ కొరకు కస్టమరు సంపర్కం చేయవచ్చు. అయనప్పటికిని, అన్ని నియమ నిబంధనలని అంగీకరించి ఏ ఆంధ్రా బ్యాంక్ ఏటిఎమ్ ద్వారా నైనా వారు నమోదు చేయవచ్చు.

ఆంధ్రా బ్యాంక్ మొబైల్ బ్యాంకింగు సేవలు గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ నొక్కండి యాక్సిస్ బ్యాంక్ అందుబాటులో ఉన్న సేవలు

ఖాతాలోని నిల్వ సమాచారం
గత మూడు లావాదేవీలు
చెక్కు పరిస్థితి
డీమ్యాట్ అకౌంట్ లోని సెక్యూరిటీ సమాచారం
మొబైల్ బ్యాంకింగ్ సేవలకోసం అభ్యర్ధన
మొబైల్ బ్యాంకింగ్ సేవలను ఆపివేయమని అభ్యర్ధన

==ఈ సేవలకు ఛార్జీలు

ప్రతి ఆర్థిక సంవత్సరానికి రు.150/- (పన్నులు అదనం) మొదటిసారి ఈ సేవలు తీసుకుంటున్నవారికి కొంత కాలం పాటు (60 రోజులు) ఉచితంగా ఈ సేవలు అందిస్తారు. తొలి 60 రోజులలోపు గనుక (అన్ సబ్స్ క్రైబ్) ఈ సేవలను వద్దనికుని మీ పేరు వెనక్కు తీసుకుంటే, ఎటువంటి చార్జీలు ఉండవు.

ఏ టీ ఎమ్ ద్వారా

 • ఖాతాదారు తన ప్రధాన ఖాతాకు సంబంధించిన డెబిట్ కార్డు ద్వారా మొబైల్ బ్యాంకింగ్ సేవలకోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.
 • కార్డును ఏటీఎమ్ లోకి చొ్ప్పించి పిన్ నంబర్ టైపు చేయండి.
 • మెనూలోని అదర్ సర్వీసెస్ (ఇతర సేవలు) ను ఎంచుకోండి.
 • మెనూలోని మొబైల్ బ్యాంకింగ్/అప్ డేట్ అంశాన్ని ఎంచుకోండి.
 • మీరు ఏ సెల్ ఫోన్ నంబర్ ద్వారా ఈ సేవలు వినియోగించుకోవాలనుకుంటున్నారో ఆ ఫోన్ నంబరును టైపు చేయండి.
 • అదే నంబరును మళ్ళీ టైపు చేయండి.
 • మీ అభ్యర్ధన తీసుకుంటున్నట్లు తెలిపే రసీదు వస్తుంది. దానిని తీసుకోండి. ఏ ఖాతానంబరుపైన మీ మొబైల్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభమవుతాయో ఆ రసీదు మీద అచ్చయ్యి ఉంటుంది.
 • మొబైల్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభమవడానికి మరో 48 గంటలు పడుతుంది.

ఇంటర్నెట్ బ్యాంకింగ్, వెబ్ సైట్ ద్వారా (i Connect) - యాక్సిస్ బ్యాంక్సవరించు

 • మీ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ కు లాగ్ ఆన్ అవ్వండి. (మీరు iConnectలో రిజిస్టర్ కాకపోతే మీకు సమీపంలోని బ్యాంకు శాఖకు వెళ్ళి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ పొందండి.
 • మొదట 'కస్టమైజ్' మీద, తర్వాత 'మొబైల్ బ్యాంకింగ్' మీద క్లిక్ చేయండి.
 • మీ సెల్ ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి. 'ఎనేబుల్ ఫర్ మొబైల్ బ్యాంకింగ్' అని రాసిఉన్న బాక్స్ మీద క్లిక్ చేయండి. మొబైల్ బ్యాంకింగ్ కోసం రిజిస్టర్ చేసుకోండి.

బ్యాంకు శాఖా కార్యాలయంద్వారా 1. మీకు సమీపంలోని బ్యాంకు శాఖలోకి వెళ్ళి మొబైల్ బ్యాంకింగ్ కోసం ఒక దరఖాస్తు రాసి ఇవ్వండి

యాక్సిస్ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ గురించిన మరిన్ని వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

యాక్సిస్ బ్యాంక్ వారి ఫోన్ బ్యాంకింగ్ సేవలగురించి మరి్న్ని వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి. బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్

బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్ తమ వినియోగదారులకు ఎస్ ఎమ్ ఎస్ ద్వారా సమాచారం', 'మొబైల్ బ్యాంకింగ్' సదుపాయాన్ని అందిస్తోంది. ఈ సదుపాయాన్ని పొందాలనుకునేవారు బ్యాంకుకు చెందిన తమ శాఖలలో రిజిస్టర్ చేసుకోవాల్సిఉంటుంది. ' ఎస్ ఎమ్ ఎస్ ద్వారా సమాచారం ' సౌకర్యము

1. ఈ సేవలకోసం రిజిస్టర్ చేసుకున్న ఖాతాదారు సెల్ ఫోన్ కు ఎస్ ఎమ్ ఎస్ దానంతట అదే (ఆటోమాటిక్ గా) వెళ్ళిపోతుంది.

2. ఎస్ ఎమ్ ఎస్ ఎలర్ట్ సేవల ద్వారా ప్రస్తుతం ఈ కింది సమాచారం అందించబడుతోంది :

 • ఆ రోజు ముగిసే సమయానికి ఖాతాలో ఉన్న నిల్వ సమాచారం
 • ఇతర ఛార్జీలు/పెరిగిన వడ్డీ/జమ అయిన సొమ్ము సమాచారం
 • ఇంటర్నెట్ బ్యాంకింగ్ కు సంబంధించిన సమాచారం
 • ఏటీఎమ్ కు సంబంధించిన సమాచారం

మొబైల్ బ్యాంకింగ్సవరించు

మొబైల్ బ్యాంకింగ్ సేవలకోసం ఖాతాదారులు బ్యాంకువారు నిర్దేశించిన ఫోన్ నంబరుకు తమ అభ్యర్ధనతో ఎస్ ఎమ్ ఎస్ పంపాల్సిఉంటుంది. తదనుగుణంగా ఖాతాదారులు ఈ కింది సమాచారాన్ని పొందుతారు.

 • ఖాతాలోని నిల్వ సమాచారం.
 • గత ఐదు లావాదేవీలు
 • చెక్ పరిస్థితి
 • చెక్ బుక్ కోసం అభ్యర్ధన
 • ఖాతా వివరాల స్టేట్ మెంట్ పోస్టుచేయాలని అభ్యర్ధన

రిజిస్ట్రేషన్ విధానముసవరించు

ఈ సేవల కొరకు రిజిస్టర్ చేసుకోవడానికి, మొబైల్ బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన ఇతర వివరాల కోసం మీరు ఎ బ్యాంక్ లో ఐతే ఖాతా తెరిచారో అక్కడ కన్నుకోండి.

బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్ వారి మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. కార్పొరేషన్ బ్యాంక్ కార్పొరేషన్ బ్యాంక్ వారి మొబైల్ ద్వారా చెల్లింపు సౌకర్యం

దేశంలో సెల్ ఫోన్ ఎస్ ఎమ్ ఎస్ ద్వారా చెల్లింపులు చేసే సౌకర్యాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి జాతీయ బ్యాంకు - కార్పొరేషన్ బ్యాంక్. కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎమ్, డెబిట్ కార్డులు కలిగి ఉన్న ఖాతాదారులు ఈ మొబైల్ చెల్లింపుల సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని పొందాలనుకునేవారు కార్పొరేషన్ బ్యాంకు యొక్క ఏ ఏటీఎమ్ వద్దనైనా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖాతాదారు దీనికోసం తన మొబైల్ ఫోన్ నంబరుతోసహా ఏఏ వివరాలు ఇవ్వాలో ఏటీఎమ్ సూచిస్తుంది. ఈ సేవకోసం విజయవంతంగా రిజిస్టర్ చేసుకున్న ఖాతాదారు సెల్ ఫోన్ కు నాలుగంకెల పిన్ నంబర్ ఎస్ ఎమ్ ఎస్ లో వస్తుంది. ఖాతాదారు భవిష్యత్తులో ఈ పిన్ నంబర్ ద్వారానే తన మొబైల్ ద్వారా లావాదేవీలన్నిటినీ జరపగలుగుతారు. కార్పొరేషన్ బ్యాంక్ వారి ఎస్ ఎమ్ ఎస్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని రెండు తరగతులుగా విభజించారు.

1. పుష్ 2. ఫుల్ పుష్ సర్వీసెస్ (సమాచారం తెలిసే సందేశాలు) : ఖాతాదారుకు సంబంధించిన ఖాతాలో ఏ విధమైన లావాదేవీ జరిగినా ఆ ఖాతాదారు సెల్ ఫోన్ కు ఎస్ ఎమ్ ఎస్ ద్వారా సమాచారాన్ని పంపించడమే ఫుష్ సర్వీసు. పుల్ సర్వీసెస్ (అభ్యర్ధనల సందేశాలు) : ఖాతాదారు తనకు కావాల్సిన సమాచారం తెలుసుకోడానికి, తనకు కావాల్సిన సేవలను కోరడానికి ఈ పుల్ సర్వీసెస్ ఉపయోగపడతాయి. దీనికోసం ఖాతాదారు బ్యాంకువారు నిర్దేశించిన నమూనాలో 56767 లేదా 9986667045 నంబర్లకు ఎస్ ఎమ్ ఎస్ పంపాల్సిఉంటుంది. తదనుగుణంగా బ్యాంకువారు ఖాతాదారు కోరిన సమాచారాన్ని లేదా సేవను అందిస్తారు. రిజిస్ట్రేషన్ విధానము

 • మీకు ఖాతా ఉన్న బ్యాంకు శాఖలో దరఖాస్తు నింపి ఇవ్వండి.
 • ఆ దరఖాస్తు పరిశీలన పూర్తయిన తర్వాత బ్యాంకు వారు మీకు ఒక పిన్ నంబరును ఎస్ ఎమ్ ఎస్ ద్వారా పంపుతారు.
 • బ్యాంకు వారు నిర్దేశించిన నమూనాలో 56767 లేదా 9986667045 నంబర్లకు ఎస్ ఎమ్ ఎస్ పంపడం ద్వారా మీరు ఈ సేవను ప్రారంభించుకోవచ్చు.
 • ఉదాహరణకు...మీకు కేటాయించిన పిన్ నంబర్ - 7890, మీ ఖాతానంబరు ఎస్ బీ/01/123456 అనుకుంటే మీరు పంపాల్సిన ఎస్ ఎమ్ ఎస్ - ACTIVATE 7890 123456 అని ఉండాలి.
 • ఈ ఎస్ ఎమ్ ఎస్ పంపిన వెంటనే మీకు ఎస్ ఎమ్ ఎస్ బ్యాంకింగ్ సౌకర్యం ఉపయోగించుకునే అవకాశం ప్రారంభమవుతుంది.

మెన్యూ ఆధారిత ఎస్ ఎమ్ ఎస్ బ్యాంకింగ్సవరించు

కార్పొరేషన్ బ్యాంక్ మెన్యూ ఆధారిత మొబైల్ బ్యాంకింగ్ సేవలను ప్రవేశపెట్టింది. ఈ మెన్యూను మీ సెల్ ఫోన్ లో ఏర్పాటు చేసుకుంటే మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం మరింత సులభమవుతుంది. ఈ మెన్యూను సెల్ ఫోన్ లో ఏర్పాటు చేసుకునే విధానం

జీ పీ ఆర్ ఎస్ ద్వారా ఈ అప్లికేషన్ ను మీ సెల్ ఫోన్లోకి నేరుగా అమర్చుకోండి.
ముందుగా ఈ అప్లికేషన్ ను మీ కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లోకి డౌన్ లోడ్ చేసుకోండి. తర్వాత బ్లూటూత్ ద్వారాగానీ, డేటా కేబుల్ ద్వారాగానీ దానిని మీ సెల్ ఫోన్ లోకి ఎక్కించుకోండి.

మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ను మీ సెల్ ఫోన్ లోకి ఎక్కించుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

కార్పొరేషన్ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం గురించి మరిన్ని వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి. డ్యూషె బ్యాంక్

డ్యూషె బ్యాంక్ డీబీ ఎలర్ట్ సేవలను ప్రవేశపెట్టింది. ఖాతాదారుల బ్యాంకు ఖాతాలలోని తాజా లావాదేవీలను వారికి ఎప్పటికప్పుడు ఎస్ ఎమ్ ఎస్, ఈ మెయిల్ ద్వారా తెలియపరుస్తుంటారు.

ఖాతాదారు కోరే సేవలుసవరించు

ఎస్ ఎమ్ ఎస్ పంపే విధానము561615 నంబరుకు మెసేజ్ పంపాలి

మీ ఈ మెయిల్ ఐడీ బ్యాంకుకు తెలియచేయడానికి


UPDATE<జాగా>మీ ఈమెయిల్ ఐడీ<జాగా>కస్టమర్ ఐడీ టైపు చేసి మెసేజ్ పంపాలి

మీ క్రెడిట్ కార్డు సమాచారం


ESTMT<జాగా>మీ ఈమెయిల్ ఐడీ<జాగా>మీ క్రెడిట్ కార్డు నాలుగు అంకెలు టైపు చేసి మెసేజ్ పంపాలి

మీ బ్యాంక్ స్టేట్ మెంట్ ను మెయిల్ చేయమని మెసేజ్ పంపాలి కోరడానికి


UPDATE<జాగా>మీ ఈమెయిల్ ఐడీ<కస్టమర్ ఐడీ టైపు చేసి ఎస్ ఎమ్ ఎస్ పంపాలి .

మీ క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్ ను మెయిల్ చేయమని కోరడానికి


ESTMT<జాగా>మీ ఈమెయిల్ ఐడీ<space>మీ క్రెడిట్ కార్డు నంబరులోని చివరి నాలుగు అంకెలు టైపు చేసి మెసేజ్ పంపాలి

డ్యూషే బ్యాంకు వారి మొబైల్ బ్యాంకింగ్ సేవల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లభ్యమయ్యే సేవలు

ఖాతాలో / ఖాతాలలో బ్యాలెన్స్ విచారణ
చిన్న స్టేట్ మెంటు – చివరి ఐదు కార్యకలాపాలు
ఎస్ బి ఐ & ఇతర బ్యాంకుల ఖాతాలకి ఫండ్స్ ని తరలింపు
చెక్ బుక్ జారీ చేయడం కోసం అభ్యర్ధనలు
విద్యుత్ బిల్లు, టెలిఫోన్ బిల్లు మొదలగు యుటిలిటీ బిల్లుల చెల్లింపులు
వ్యాపార చెల్లింపులు
మొబైల్ టాప్ అప్
ఎస్ బి ఐ జీవిత బీమాప్రీమియమ్ చెల్లింపు

ఆసక్తి ఉన్న కస్టమరు మొదట వారి ప్రధాన శాఖని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫ్ హైదరాబాద్ మొబైల్ బ్యాంకింగ్ సేవలని పొందడానికి సంపర్కం చేయాలి. సేవలకోసం నమోదు చేసే విధానం యూజర్ ఐడి పొందడానికి నమోదు

567676 కి SMS <SBIREG> <MobileMake> <MobileModel> ఎస్ ఎమ్ ఎస్ పంపండి.
మొబైల్ బ్యాంకింగ్ ధరఖాస్తు డౌను లోడు చేయడానికి ( మీకు జి పి ఆర్ ఎస్ కనెక్షన్ ఉంటే) మీకు యూజర్ ఐడి, ఎమ్ పి ఐ ఎన్, డబ్ల్యూ ఏ పి లింకుని పొందుతారు,
బ్యాంకింగ్ కు ధరఖాస్తు ( మీకు జి పి ఆర్ ఎస్ కనెక్షన్ ఉంటే )

ఈ సేవలు ప్రస్తుతం జావా కలిగి ఉన్న మొబైల్ ఫోన్స్ కు ఎస్ ఎమ్ ఎస్ / జి పి ఆర్ ఎస్ / డబ్ల్యూ ఎ పి ద్వారా, జి పి ఆర్ ఎస్ కనెక్షన్ ఉండి జావా లేని ఫోన్స్ కు లభ్యమవుతుంది. మీ మొబైల్ హ్యాండ్ సెట్ కు మొబైల్ బ్యాంకింగు ధరఖాస్తుని డౌను లోడ్ చేయటం

మీ హ్యాండ్ సెట్ లో జావా కలిగి ఉండాలి
మీకు జి పి ఆర్ ఎస్ కనెక్షన్ ఉంటే, యూజర్ ఐడితో మీరు తీసుకున్న డబ్ల్యూ ఎ పి లింక్ ఉపయోగించి ధరఖాస్తుని డౌను లోడ్ చేసుకోవచ్చు.
లేదా, బ్యాంక్ వెబ్ సైట్ www.sbi.co.in కి లాగాన్ చేసి, సేవలు - మొబైల్ బ్యాంకింగు దగ్గర నొక్కండి. మీరు డేటా-కేబుల్ లేక బ్లూటూత్ ఉపయోగించి తగిన మొబైల్ బ్యాంకింగు ధరఖాస్తుని డౌను లోడ్ చేసుకోవచ్చు