భారతదేశ ఆర్థిక సర్వే 2017-18
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
భారతదేశ ఆర్థిక సర్వే 2017-18 బడ్జెట్ సమావేశాల ముందు ఈ సర్వేను లోక్‌సభ ప్రవేశపెడుతారు. ఆర్థిక సర్వే 2017-18ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.[1]
మూఖ్యాంశాలు
మార్చు- 2017-18లో వృద్ధి రేటు 6.75 శాతంగా నమోదైనట్లు తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఈ వృద్ది రేటు 7.0 నుంచి 7.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు.
- 2018 ఆర్ధిక సంవత్సరానికి వ్యవసాయ, సేవా రంగాల వృద్ధి రేటు వరుసగా 2.1%, 8.3% దాక పెరిగింది.
- పారిశ్రామిక వృద్ధిరేటు 4.4% ఉండవచ్చని అంచనా.
- సర్వే ప్రకారం 2040 నాటికి దాదాపుగా 4.5 ట్రిలియన్ డాలర్ల మౌలిక సదుపాయాల కోసం అవసరమైన మొత్తం పెట్టుబడులు సమకూరుతాయని తెలిపారు.
- 2017 సెప్టెంబర్ నాటికి 1.15 లక్షల కి.మీ. పొడవైన జాతీయ రహదారులు ఉన్నాయని, ఇది మొత్తం రోడ్ల వాటాలో 2.06 శాతమని తెలిపింది. 2015-16లో రాష్ట్రీయ రహదారులు 1.76 లక్షల కి.మీ పొడవున ఉన్నాయని ఆర్థిక సర్వే వెల్లడించింది. 2031 నాటికి పట్టణ జనాభా 60 కోట్లకు చేరుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.
- వినియోగ సూచి ఆధారిత ద్రవ్యోల్బణం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4.5 నుంచి 5 శాతం మధ్య కొనసాగే అవకాశం.
- జీడీపీలో కరంట్ ఖాతాల లోటు 1 నుంచి 1.5 శాతం వరకూ ఉండే అవకాశం.
మూలాలు
మార్చు- ↑ భారత ఆర్థిక సర్వే 2017-18. "పన్ను సంఖ్య పెంచాలి: భారత ఆర్థిక సర్వే హైలెట్స్". telugu.oneindia. telugu.oneindia.com. Retrieved 31 January 2018.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)