భారతీయ మజ్దూర్ సంఘ్
భారతీయ మజ్దూర్ సంఘ్ భారతదేశంలోని జాతీయవాద సంస్థలలో ఒకటి. దీనిని జూలై 23, 1955 న లోక మాన్య బాల గంగాధర్ తిలక్ జన్మదినం రోజున దత్తోపంత్ ఠెన్గడీ స్థాపించారు. [1]
సభ్యత్వ వివరాలు
మార్చుబిఎంఎస్ (భారతీయ మజ్దూర్ సంఘ్) 10 మిలియన్లకు పైగా సభ్యులను కలిగి ఉంది. కార్మిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2002 లో బిఎంఎస్ సభ్యత్వం 6,215,797 గా ఉంది. బిఎంఎస్ ఏ అంతర్జాతీయ యూనియన్ సమాఖ్యకు అనుబంధంగా లేదు. ఇది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లోని కార్మిక విభాగం, సంఘ్ పరివార్లో భాగం. [2]
భావజాలం
మార్చుఇది భారతదేశ ప్రాచీన సంస్కృతి, ఆధ్యాత్మిక భావనల నుండి ప్రేరణ పొంది, శ్రమ భారతీయ సామాజిక నిర్మాణానికి పునాదిగా పరిగణించబడుతుందని నమ్ముతుంది. 'శ్రమను జాతీయం చేయండి, పరిశ్రమను శ్రమపరచండి, దేశాన్ని పారిశ్రామికీకరించండి' అనేది వీరి యొక్క నినాదం. ఇది విశ్వకర్మ జయంతి నాడు జాతీయ కార్మిక దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.