తా భూమి – జలము – అగ్ని – వాయువు – ఆకాశము, బ్రహ్మ – విష్ణు – మహేశ్వర – ఇంద్ర –సూర్య – నక్షత్రంబులు లేని వేళ విశ్వకర్మ స్వయంభు రూపమైయుండెను.భూమి నీరు అగ్ని గాలి బ్రహ్మ విష్ణు రుద్రుడు నక్షత్రా లేమియు లేనపుడు విశ్వకర్మ భగవానుడు తనంత తాను సంకల్ప ప్రభావంచేత నవతరించాడు. ఆ స్వయంభూ విశ్వకర్మ పరమేశ్వరునకే విశ్వాత్ముడు, విశ్వేశ్వరుజు, సహస్ర శిర్షుడు! సగుణ బ్రహ్మం, అంగుష్ట మాతృడు, జగద్రక్షకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మొదలైన అనంతనామనులు – అనంతరూపములు కలిగినై. “ప్రజాపతి విశ్వకర్మ మనః “అని కృష్ణ యజుర్వేదమున విశ్వకర్మయే ప్రజాపతియైన బ్రహ్మయనియు చెప్పబడింది. ఆయనకు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానము లనెడి నైదు ముఖలు.

మచిలీపట్నం విశ్వకర్మ దేవాలయం

విశ్వాన్ని సృష్టించింది విశ్వకర్మ.
శ్లో నభూమి నజలం చైవ నతేజో నచ వాయవః
నచబ్రహ్మ నచవిష్ణు నచనక్షత్ర తారకః
సర్వశూన్య నిరాంబం స్వయంభూ విశ్వకర్మణః

తా భూమి – జలము – అగ్ని – వాయువు – ఆకాశము, బ్రహ్మ – విష్ణు – మహేశ్వర – ఇంద్ర –సూర్య – నక్షత్రంబులు లేని వేళ విశ్వకర్మ స్వయంభు రూపమైయుండెను.భూమి నీరు అగ్ని గాలి బ్రహ్మ విష్ణు రుద్రుడు నక్షత్రా లేమియు లేనపుడు విశ్వకర్మ భగవానుడు తనంత తాను సంకల్ప ప్రభావంచేత నవతరించాడు. ఆ స్వయంభూ విశ్వకర్మ పరమేశ్వరునకే విశ్వాత్ముడు, విశ్వేశ్వరుజు, సహస్ర శిర్షుడు! సగుణ బ్రహ్మం, అంగుష్ట మాతృడు, జగద్రక్షకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మొదలైన అనంతనామనులు – అనంతరూపములు కలిగినై. “ప్రజాపతి విశ్వకర్మ మనః “అని కృష్ణ యజుర్వేదమున విశ్వకర్మయే ప్రజాపతియైన బ్రహ్మయనియు చెప్పబడినది. ఆయనకు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానము లనెడి నైదు ముఖలు.

శ్లో పూర్వావనా త్సానగః దక్షణా త్సనాతనః
అపరా దహభూవః ఉద్వీచ్యాం ఉర్ధవాత్సుపర్ణః

తా తూర్పు ముఖమునందు సానగ ఋషి, దక్షిణ ముఖము నందు సనాతన ఋషి, పశ్చిమ ముఖము నందు అహభూన ఋషి, ఉత్తర ముఖము నందు బ్రత్న ఋషి, ఊర్ధ్వముఖము నందు సుపర్ణ ఋషులుద్బవించిరి.విశ్వకర్మ పరాత్పరుని యొక్క తూర్పు ముఖమైన సద్యోజాతము నందు సానగబ్రహ్మర్షి మనుబ్రహ్మయు, దక్షిణముఖమైన వసుదేవము నందు సనాతన బ్రహ్మర్షి యను మయబ్రహ్మయు, పశ్చిమముఖమైన అఘేరియునందు అహభూవ బ్రహ్మర్షి యను త్వష్టబ్రహ్మయు, ఉత్తరముఖమైన తత్పురుషము నందు ప్రత్నస బ్రహ్మర్షి యను శిల్పి బ్రహ్మయు, ఊర్ధ్వముఖమైన ఈశానము నందు సువర్ణ బ్రహ్మర్షియను విశ్వజ్ఞబ్రహ్మయు ప్రభవించినట్లు చెప్పబడినది.

ఋక్ వేదం లోని పదవ మండలం 81,82 సూక్తాలు విశ్వకర్మ యొక్క సృష్టి నిర్మాణ క్రమాన్నివివరిస్తాయి. అందరికీ సుపరిచితమైన పురుష సూక్తం కూడా విశ్వకర్మను విరాట్ పురుషునిగా వర్ణించింది. విశ్వకర్మకు పర్యాయ పదంగా త్వష్ట ను గుర్తిస్తారు.

విశ్వకర్మ సమారంభాం విశ్వరూపార్య మధ్యమాం
వీరబ్రహ్మేంద్ర పర్యంతాం వందే గురుపరంపరాం

కైలాస గిరిపై పరమేశ్వరుడు ఏకాగ్రచిత్తుడై ధ్యాననిష్టుడైయున్న సమయమున షణ్ముఖుడు తండ్రిని సమీపించి ఓ తండ్రి మేమెల్లరము పరమాత్మ స్వరూపులైన మిమ్ములను , విష్ణువును , బ్రహ్మనూ ఇంకనూ ఎవరెవరిఇష్టానుసారముగా సర్వదేవతలను ఆరాధించుచుండగా సర్వజులైన తమరు లో ఎవరిని గూర్చి ధ్యానించుచున్నారు ? అని ప్రశ్నింపగా , స్థిర చిత్తుడైన శంకరుడు కుమారా ! నీవు భావించినట్లు నేను , బ్రహ్మ విష్ణు , ఇంద్ర , సూర్యులు పరిపూర్ణులము కాము , సర్వశక్తి సమన్వితులమూ కాము . ఏలననగా బ్రహ్మ సృష్ఠి, విష్ణువు పోషణ , ఇంద్రుడు లోక పాలన , సూర్యుడు ప్రకాశము . నేను లయకార్యములను మాత్రమే చేయ శక్తి కలవారమేకాని , ఒకరి కార్యమును మరొకరము చేయలేని ఆశక్తులము . కావున మాకు ఈ జన్మమును . రూపము[I think that you ఓ షణ్ముఖా ! సావధాన చిత్తుండవై శ్రద్ధతో విని తరింపుము . . . . . . . . . శ్లో | | ఓం ! నభూమి , నజలంచైవ ! నతేజో , నచవాయువః ! నచబ్రహ్మ , నచవిష్ణు ! నచరుద్రశ్చ , తారకః ! సర్వశూన్య , నిరాలంభో ! స్వయంభూ , విశ్వకర్మణః ! " భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, బ్రహ్మ, విష్ణు, రుద్రుడు ( అనగా నేను ) సూర్యుడు, చంద్రులు, నక్షత్రములు, ఇవేమియు లేక సర్వము శూన్యమై నిరాధారముగా నున్నసమయమున ప్రణవనాధంతో ప్రణవ స్వరూపంతో, నిరాకార సాకార స్వరూపముతో శ్రీ విశ్వకర్మ పరమేశ్వరుడు ముందుగా తననుతాను ( స్వయంభువుగా ) సృష్టించుకొని ఈ సమస్త సృష్టిని సృష్టించెను . ఈ విధముగా విరాట్ స్వరూపముగ సహస్రశీరుడై స్వయంభువుగా అవతరించిన వారే శ్రీ విశ్వకర్మ పరమేశ్వరుడు . . శృతి | | అధానంత వీర్యస్య శ్రీమన్మహా విశ్వకర్మణః అచింత్యా అపరిమిత శక్త్యాభియమాణస్య మహదాకాశశ్య మధ్యే పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మండానాం ఏకతమే వ్యక్తావ్యక్త మహాదహంకార పృధి, వ్యక్రేజ్ వాయుర్యాకాశాది ఆవరణేరావృతే తదధిష్టానభూత విశ్వకర్మ పరమాత్మ ప్రతిబింబిత దైవతైః “ మను , మయ , త్వష్ట , శిల్పి , విశ్వజ్ఞ , పంచబ్రహ్మటికి , పరికల్పితే బ్రహ్మ , విష్ణు , రుద్రేంద్రాదిత్య పంచమూర్తిభిః పరిపాలితే ఆస్మిన్ మహాబ్రహ్మాండ ఖండయోర్మద్యే ఆదిశక్తి , పరాశక్తి , ఇచ్చాశక్తి , క్రియాశక్తి , జ్ఞానశక్తి , అభిదాన పంచమహాశక్తిభి రావృతే ! ! ( మనుసూత్ర ప్రయోగం ) అనంతము అపరిమితము అయిన ఊహకందని బ్రహ్మాండమున తేజోమయ విశ్వకర్మ అనేక బ్రహ్మాండములకు తానొకడై ఆధారమై యుండి నిరాకార , సాకార భేదంబులతో , భూ , జల , తేజో , వాయు , ఆకాశాది ఆవరణములను కల్పించి తదధిష్టాన దేవతలుగా మను , మయ , త్వష్ట , శిల్పి , విశ్వబద్ పంచ బ్రహ్మలను , వారికి ప్రతినిధులుగా , రుద్ర , విష్ణు , బ్రహ్మ , ఇంద్ర , ఆదిత్యులను సృష్టించి ఈ మహదాకాశ మధ్యమున పరిపూర్ణుడై భూలోక , భువర్లోక , స్వర్గలోక , మహార్లోక , తపోలోక , జనలోక , సత్యలోకాది ఊర్యలోకములు , అతల , వితల , సుతల , తలాతల , రసాతల , మహాతల , పాతాళాది అధోలకములకు ఆవల అతీతమైన “ అజాన లోకంబున " దివ్యశక్తి సమన్వితమైన బంగారు శిఖరములతో తేజరిల్లు “ మేరు శిఖరంబున ” దివ్యరత్న మణిమయ సింహాసనాసీనుడై యున్న శ్రీ విశ్వకర్మ పరమేశ్వరుడు . . . పంచతత్వాత్మకుడై సద్యోజాత , వామదేవ , అఘోర , తత్పరుష , ఈశానములను పంచముఖములతో ప్రాక్ , దక్షిణ , పశ్చిమ , ఉత్తర , ఈశానములనెడి పంచదిక్కులతో , బుక్ , యజు , సామ , అధర్వణ , ప్రణవాది పంచ వేదములతో స్పటిక , నీల , తామ , ధూమ , సువర్ణాది పంచవర్ణములతో , పృధ్వీ , ఆపః , తేజో , వాయు , రాకాశాది పంచభూత తత్వముతో , త్వక్కు చక్షు , శ్రవణ , జిహ్వ , ఘణాది పంచజ్ఞానేంద్రియములతో , వాక్కు , పాణి , పాద , పాయు , గుహ్యాది , పంచ కర్మేంద్రియములతో , శబ్ద , స్పర్శ , రూప , రస , గంధాది పంచతన్మాత్రలతో , దశభుజములు దశహస్తములు గల్లి , శూలము , ఢక్కా అభయ , వరదా , గదా , శంఖ , చక్ర , అబ్ద , కోశ , లేఖిని , మొదలగు ఆయుధములు ధరించి , దేవ , దానవ , యక్ష , కిన్నర , కింపురుష , మానవాది , సమస్త జీవ జాలంబుల సృష్టించి , సంరక్షింపుచు , “ విశ్వాని కర్మాణియస్యనః ” విశ్వకర్మ అనగా సమస్త కర్మములు కలవాడు . ఆ సమస్తములైన కర్మములేవి ? అనగా సృష్టి , స్థితి , లయ , తిరోధాన , అనుగ్రహాది కర్మములు అని అర్థము . . అంతియే గాక , శ్లో | | ఆయం దేవానా మప మపస్తయో యోజనానాం రోదనీ విశ్వశంభువా వియోమమేరజస సుక్రితూయ యాజరేబి “ సంభవేబి ? ” సమాన్సచే ( ఋగ్వేద 2 , 160 ) సకల జీవులకు సుఖమును కలిగించు భూమి , ఆకాశమును ఏ దేవుడు పుట్టించెనో , ఏ దేవుడు సర్వ ప్రాణుల సౌఖ్యమునకై ఆ రెండు లోకములను దృఢమై క్రమముదప్పనియట్లు బిగించియుంచెనో అతడు దేవతలలో గొప్పవాడు , పనివారాలలో గొప్పవాడు . స్కంభనేభిః అనగా గొప్పపనివాడు అని అర్థము . అట్టి విశ్వకర్మ లోక పాలన కొరకు తన సంకల్పముచేత తన శక్తిని ప్రకృతీ పురుష విభేదమున స్త్రీ - పురుష భేదములతో సాకార విశ్వబ్రహ్మ విరాట్పురుషుని ( విశ్వకర్మ ) గా అవతరించి ప్రకృతిగా స్త్రీ స్వరూపము " గాయత్రి ( 1 ), పురుషునిగా పురుష స్వరూపమున " విశ్వకర్మ భగవానునిగా ( 2 ) నిరాకార స్వభావమున “ ఆ, ఉ, మ " అను బీజాక్షరముల కలయిక కూడిన నిరాకార “ ఓం ” అను ప్రణవాక్షర రూపముతో ప్రణవశబసగా పరబ్రహ్మగా సర్వశక్తికి మూలాధిదేవతగా ప్రకాశించుచున్నాడు . కావుననే సర్వదేవతలకు సర్వశక్తులకు మూలమైనవాడు పరబ్రహ్మ , కావుననే ఏడేనక నామమునకైననూ పరబ్రహ్మ సంకేతమైన " ఓం " అను ప్రణవము చేరుని ఫలించదు . కావుననే “ ఓం ! నారాయణ ” “ ఓం ! నమః శివాయ " అని ఎవరిని ధ్యానించిననూ మొదట ఓం అను పరబ్రహ్మ ( విశ్వకర్మ ) నామమును చేర్చనిదే ముక్తిని పొందలేరు . సాధసపక్వదశలో చేరిన తర్వాత నిరాకార పరబ్రహ్మను “ ఓం ” అను ప్రణవము నభ్యసించి , జపించి మోక్షము నందగలరు . కుమారా ! సర్వశక్తివంతమైన ప్రణవాక్షరి మహిమను కూడ తెల్పెదను . సుజ్ఞానిపై గ్రహించి తరించుము . . . . . .

ఓంకారమును సదా యుచ్చరించెదమేని ! దుర్మనోద్యాంతంబు తొలగిపోవు ! ఓంకారమును సదా యూహజేసెదమేని ! స్వాంతన బ్రహ్మతేజంబుతోచు ! ఓంకారమును సదా పుద్దీతగాపాడ ! అభిలాత్మ విభుదర్శనంబు గలు ! ఓంకారమును సదా నిశ్శంకాత్మ జపియించ ! మైమరపించి తన్మయతి జేయు ! బ్రహ్మ , విష్ణు , శిపుల పదవి దాటగ జేయు ! అమృత జలధి నోలలాడజేయు ! కాన భక్తులారా ! ఘనముముక్షులారా ! ప్రణవమభ్యసించి పరముగనరే ! ! కావుననే మహాత్ములు , మహర్షి లు , కొన్ని సందర్భములలో విశ్వకర్మను గాయత్రిగా , గాయత్రిని విశ్వకర్మగా సంభోదించి యున్నారు . కావుననే వారిరువురు ప్రకృతి పురుష భిన్న రూపులేగాని ఏకంగా ప్రణవ స్వరూపులే ! ! ) “ ఓం ” అను ప్రణవాక్షరమును ఏ భాషయందు దర్శించిననూ ప్రకృతి . పురుష స్వరూపములుగా , సంతానయజ్ఞ , సృష్టికార్య సంకేతములుగా గోచరించును . . . ఓం ! మిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్నామనుస్మరన్ ! యుః ప్రయాతీత్యజనేహం సయాతి పరమాంగలిం | | “ ఓం ! మిత్యేకాక్షరం బ్రహ్మా " ధ్యేయం సర్వముముక్షుభి//సంసార సాగర సముద్భవక మంత్రం ! బ్రహ్మది దేవ ముని పూజిత సిద్ద మంత్రం ! దారిద్ర్య దుఃఖ , భవరోగ , వినాశ మంత్రం ! వందే మహా భవ భయహారం ! గురురాజ మంత్రం ! కావున ప్రణవ మొక్కటే పరమాత్మను చేరుటకు మార్గము . . . కుమారా ! షణ్ముఖా ! ప్రణవస్వరూపుడైన శ్రీ విశ్వకర్మ భగవానుని యొక్క వారి వంశమును గూర్చి తెలిపెదను . సాకార పరబ్రహ్మగా అవతరించిన విశ్వకర్మ సర్వలోక పాలన కొరకు తన అంశచే మను , మయ , త్వష్ట , శిల్పి , విశ్వజ్ఞాది పంచ బ్రహ్మలను , వారికి భార్యలుగా ఆదిశక్తి , పరాశక్తి , ఇచ్చాశక్తి , క్రియాశక్తి , జ్ఞానశక్తులను సృష్టించి వారి అంశలుగా రుద్ర , విష్ణు , బ్రహ్మ , ఇంద్ర , సూర్యాది మూర్తులు , వారికి భార్యలుగా ఉమ , లక్ష్మి , వాణి , శచి , సంజ్ఞా , ఈ దేవతా మూర్తులను , వారికి గోత్రములుగా సానగ , సనాతన , అహభూవనస , ప్రత్నస , సుపర్ణసాధి పంచబ్రహ్మరులను సృష్టించి లోకపాలన భాద్యతలను అప్పగించెను . కావుననే మనం ప్రతినిత్యం సంధ్యావందనాది పూజా క్రతువులలో వారిని ప్రథమ దేవతలుగా ధ్యానించుచున్నాము . 1 . ఓం ! మదాదిశక్తి మనుబ్రహ్మ స్వరూపాభ్యాం ఉమా మహేవ్వరాభ్యం నమః ! 2 . ఓం ! పరాశక్తి మయబ్రహ్మ స్వరూపాభ్యాం లక్ష్మీ నారాయణాభ్యాం నమః ! 3 . ఓం ! ఇచ్చాశక్తి త్వష్టబ్రహ్మ స్వరూపాభ్యాం వాణీ హిరణ్యాభ్యాం నమః ! 4 . ఓం ! క్రియాశక్తి శిల్పి బ్రహ్మ స్వరూపాభ్యాం శచీపురందరాభ్యాం నమః ! 5 , ఓం ! జ్ఞానశక్తి విశ్వజ్ఞబ్రహ్మ స్వరూపాభ్యాం సంజ్ఞా భాస్కరాభ్యాం నమః ! అదే విధంగా విశ్వకర్మచే సృష్టించబడిన సొనగ , సనాతన , అహ భూవనస , ప్రత్నస , సుపర్ణస , పంచబ్రహ్మలు సర్వమానవ జీవనార్దము తమవంశీయులకు ( విశ్వబ్రాహ్మణులకు ) గోత్రఋషులై 1 . మనుబ్రహ్మవంశీయుల “ సానగ " గోత్రధారులై అయో ( ఇనుప ) వృత్తిని . . 2 మయ బ్రహ్మవంశీయుల “ సనాతన ” గోత్రధారులై దారు ( కొయ్య ) వృత్తిని . . 3 . త్వషబ్రహ్మవంశీయుల “ అహభూనస " గోత్రధారులై తామ్ర ( రాగి , కంచు ) వృత్తిని . . శ్రీ శిల్పి బ్రహ్మవంశీయులు ప్రత్నస " గోత్రధారులై శిల ( రాతిశిల్పి ) వృత్తిని . . 5, విశ్వజ బ్రహ్మవంశీయులు " సుపర్ణస " గోత్రధారులై సువర్ణ ( ఆభరణ ) వృత్తిని . . (ఇంకా ఉంది)

విశ్వకర్మ జయంతి

మార్చు

విరాట్ సృష్టికర్త ఐన విశ్వకర్మ జయంతి, యజ్ఞ యాగాదులను, అయన పంచముఖాల నుండి ఉద్భవించిన ఈ మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలకు జయంతులుగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17న దేవశిల్పి విశ్వకర్మ పూజను జరుపుకుంటారు. ఇవి ముఖ్యంగా కర్మాగారాలు, పారిశ్రామిక ప్రాంతాలలో తప్పకుండా జరుపుతారు. వారి పనిముట్లను విశ్వకర్మ ముందుంచి పూజిస్తారు.

విశ్వకర్మ నిర్మాణాలు

మార్చు

విశ్వకర్మ హిందూ పురాణాల ప్రకారం ఎన్నో పట్టణాలను నాలుగు యుగాలలో నిర్మించారు.సత్యయుగంలో దేవతల నివాసం కోసం స్వర్గలోకం నిర్మించారు.త్రేతాయుగంలో సువర్ణ లంకను శివుని కోసం నిర్మించారు, ద్వాపర యుగంలో ద్వారక నగరాన్ని, కలియుగంలో హస్తినాపురం, ఇంద్రప్రస్థం నిర్మించారు, పాండవులు నివసించిన మయసభను నిర్మించారు.

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు