భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్-1902

దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలను సంస్కరించుటకు తగిన సూచనలు ఇచ్చేందుకు 1902నాటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్, థామస్ రాలీ అధ్యక్షతన ఇద్దరు సభ్యులతో భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ నియమించాడు.[1]

కమిషన్ సూచించిన అంశాలు

మార్చు
  • కొత్త విశ్వవిద్యాలయాలను స్థాపించకూడదు. ఉన్న వాటిని సంస్కరించాలి.
  • విశ్వవిద్యాలయాలు సమర్థవంతంగా పనిచేసేందుకు సెనెట్, సిండికేట్ లను పునర్వ్యవస్థీకరించాలి.
  • కళాశాల అధ్యాపకులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి.
  • పరీక్ష విధానాన్ని సంస్కరించాలి.
  • కళాశాలలకు అనుబంధ ప్రతిపత్తి ఇచ్చేటప్పుడు విశ్వవిద్యాలయాలు తగు ప్రమాణాలు, సూత్రాలు పాటించాలి.
  • విశ్వవిద్యాలయాలలో గ్రంథాలయాలను, ప్రయోగశాలలను మెరుగుపరచాలి.
  • మూడేళ్ల డిగ్రీ తరగతులను ప్రవేశపెట్టి ఇంటర్మీడియట్ తరగతులను ఎత్తివేయాలి.

భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం-1904

మార్చు

1902 లో విశ్వవిద్యాలయ కమిషన్ సూచనలు అమలు చేసేందుకు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో విశ్వవిద్యాలయాల చట్టం ఆమోదించబడింది. దీనినే భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం 1904 అంటారు.[2]

చట్టంలోని ముఖ్య అంశాలు

మార్చు
  • సినెట్ లో సభ్యుల సంఖ్య తగ్గించబడింది.
  • విశ్వవిద్యాలయాలు, విధులు విస్తృతపరచబడ్డాయి. ఇవి తమంతకు తామే ప్రొఫెసర్లను లెక్చరర్లను నియమించుకోవచ్చు. పరిశోధనకు కావలసిన అవకాశాలు కల్పించారు.
  • సిండికేట్లకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వబడింది వాటి విశ్వవిద్యాలయాల ఉపాధ్యాయులకు తగిన ప్రాతినిథ్యం కల్పించబడింది.
  • కళాశాలలకు విశ్వవిద్యాలయం అనుబంధ ప్రతిపత్తి కల్పించేటప్పుడు కఠిన నియమాలు విధించబడ్డాయి.
  • కళాశాలలో విద్యా ప్రమాణాలను కాపాడేందుకు వాటిని అప్పుడప్పుడు తనిఖీ చేసేందుకు సిండికేట్కు అధికారం ఇవ్వబడింది.
  • ఈ చట్టం విశ్వవిద్యాలయాల మీద ప్రభుత్వం పట్టును మరింత పెంచింది. లిజిస్ట్రేటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న గోపాలకృష్ణ గోఖలే ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు.
  • 1904లో లార్డ్ కర్జన్ ఎలిమెంటరీ పాఠశాల నిర్వహణ కోసం ఉపాధ్యాయుల నియామకం కోసం ప్రత్యేక నిధులు విధులు విడుదల చేశాడు.[3]

మూలాలు

మార్చు
  • Jayapalan, N (2005), History of Education in India, Atlantic Publishers & Distributors, ISBN 8171569226.
  • Krishnaswamy, N; Krishnaswamy, L (2006), The Story of English in India, Foundation Books, ISBN 8175963123.

గమనికలు

మార్చు

బాహ్య లింకులు

మార్చు