భారతీయ వైద్య సంఘం

భారతీయ వైద్య సంఘం (ఆంగ్లం: Indian Medical Association) అనేది భారతదేశంలోని వైద్యుల జాతీయ స్వచ్ఛంద సంస్థ. ఇది 1928లో ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ గా స్థాపించబడింది.[2] 1930లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ)గా పేరు మార్చబడింది. ఇది సొసైటీస్ యాక్ట్ ఆఫ్ ఇండియా కింద రిజిస్టర్ అయిన సొసైటీ.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్
సంకేతాక్షరంఐఎంఎ
స్థాపన1928
ప్రధాన
కార్యాలయాలు
న్యూ ఢిల్లీ
కార్యస్థానం
  • ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఐఎంఏ హౌస్, ఐ.పి. ఎస్టేట్, వికాస్ మినార్ పక్కన, న్యూఢిల్లీ - 110002
సేవా ప్రాంతాలుభారతదేశం
సభ్యులు2019 నవంబరు 30 నాటికి 317,458[1]
జాతీయ అధ్యక్షుడుసహజానంద్ ప్రసాద్ సింగ్
డాక్టర్ బి. సి.రాయ్, ఐఎంఎ, హైదరాబాదు

కరోనా సమయంలో విశిష్ఠమైన సేవలు అందించినందుకు ఐఎంఏ, ట్రయిన్డ్‌ నర్సెస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాలకు సంయుక్తంగా 2023 నవంబరు 19న ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అందుకున్నారు.[3]

నేపథ్యం మార్చు

భారతదేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 1,700 క్రియాశీల స్థానిక శాఖలలో సుమారు 350,000 మంది వైద్యులను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కలిగి ఉంది.[4][5][6] ఇది దేశంలోని వైద్యుల అతిపెద్ద సంఘం.[7]

జర్నల్ ఆఫ్ ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మార్చు

ది జర్నల్ ఆఫ్ ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (జిఐఎంఎ), ఇండెక్స్ మెడికస్ లో ఇండెక్స్ చేయబడింది. నెలవారీగా ప్రచురించబడె జిఐఎంఎ ఎలక్ట్రానిక్ వెర్షన్ కోసం 240,000 మందికి పైగా చందాదారులు ఉన్నారు. ఇది బెల్ & హోవెల్స్, అమెరిక ద్వారా మైక్రోఫిల్మ్ లో కూడా అందుబాటులో ఉంది.[8] 1930లో కలకత్తాలో సర్ నీలరతన్ సిర్కార్, బిధన్ చంద్ర రాయ్, కుముద్ శంకర్ రే మొదలైన వారిచే జిఐఎంఎ స్థాపించబడింది.[9]

మూలాలు మార్చు

  1. "Indian Medical Association". www.ima-india.org.
  2. Ghosh, Abantika (2021-03-10). "'Voice of doctors' or 'den of politics'? Why some doctors swear by IMA, others don't care". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-04-06.
  3. "ఐఎంఏకు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం | Indira Gandhi Peace Award to IMA". web.archive.org. 2023-11-20. Archived from the original on 2023-11-20. Retrieved 2023-11-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. Ghosh, Abantika (2021-03-10). "'Voice of doctors' or 'den of politics'? Why some doctors swear by IMA, others don't care". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-04-06.
  5. Rai, D. R. (2012). "Article on Indian Medical Association in Japan Medical association Journal" (PDF). www.med.or.jp. Archived from the original (PDF) on 2021-10-22. Retrieved 2020-10-11.
  6. Patel, Jitendra B.; Saini, Narendra (2014-08-01). "Indian Medical Association". Japan Medical Association Journal: JMAJ. 57 (4): 238–244. ISSN 1346-8650. PMC 4375268. PMID 26005621.
  7. Singh, Prachi (August 12, 2020). "The Contest Between AYUSH and Allopathy Shouldn't Forget Public Health". The Wire (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2022-05-01.
  8. "Journal of the Indian Medical Association". SCImago. ISSN 0019-5847.
  9. "Journal of the Indian Medical Association". SCImago. ISSN 0019-5847.