బిధాన్ చంద్ర రాయ్

భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి

బిధాన్ చంద్ర రాయ్ (ఆంగ్లం: Bidhan Chandra Roy) (జూలై 1, 1882 - జూలై 1, 1962 ) పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుడైన ఆయన ఈ పదవిలో 14 ఏళ్ళు ఉన్నారు. వృత్తిరీత్యా వైద్యుడైన ఈయన స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు.

బిధాన్ చంద్ర రాయ్
బిధాన్ చంద్ర రాయ్


పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రి
పదవీ కాలం
14 January 1948 – 1 July 1962
ముందు ప్రఫుల్ల చంద్ర ఘోష్
తరువాత రాష్ట్రపతి పాలన

వ్యక్తిగత వివరాలు

జననం (1882-07-01)1882 జూలై 1
Bankipore, Patna, Bihar
మరణం 1962 జూలై 1(1962-07-01) (వయసు 80)
కలకత్తా, పశ్చిమ బెంగాల్
జాతీయత భారతీయులు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి అవివాహితుడు
నివాసం కలకత్తా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
పూర్వ విద్యార్థి Presidency College, Calcutta
Patna College
M.R.C.P.
F.R.C.S.
వృత్తి వైద్యులు
స్వాతంత్ర్య సమరయోధులు
రాజకీయ నాయకులు
మతం బ్రహ్మ సమాజం

జీవిత విశేషాలు

మార్చు

వీరు బీహార్ రాష్ట్రం, పాట్నా జిల్లాలోని బంకింపూర్‍‍లో జన్మించారు.ఈయన పూర్తి పేరు బిధాన చంద్ర రాయ్.తండ్రి ప్రకాశ్ చంద్ర. వీరి తండ్రి ప్రకాశ్ చంద్ర. ఇంగ్లండ్ లోని సెంట్ బెర్త్ లోమో కళాశాలలో 1909-1911 మధ్యకాలంలో M.R.C.P., F.R.C.S. డిగ్రీలను పొందారు. 1911 సంవత్సరంలో స్వదేశానికి తిరిగివచ్చి కలకత్తా వైద్య కళాశాలలో కొంతకాలం అధ్యాపకునిగా పనిచేశారు.

బిధాన చంద్ర రాయ్ 1909-11 మధ్య కాలంలో ఇంగ్లండ్ లోని సెంట్ బెర్త్ లోమో కాలేజీలో M.R.C.P, F.R.C.S అనే డిగ్రీలు పొందడానికి చదువు కొనసాగించి 1911 లో స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కోల్ కతా మెడికల్ కాలేజీలో కొంతకాలం అధ్యాపకుడిగా పనిచేసారు.ఈయన జాదవ్ పూర్ టి.బి.హాస్పిటల్, ఆర్.జి.ఖార్ మెడికల్ కాలేజీ, కమలా నెహ్రూ హాస్పిటల్, విక్టోరియా ఇన్స్టిట్యూట్, చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్ మొదలైన సంస్థలు నెలకొల్పాడు.1926 లో ప్రత్యేకంగా మహిళల కోసం, పిల్లల కోసం చిత్తరంజన్ సేవాసదన్ అనే వైద్య శాలను ఏర్పాటు చేసాడు.మహిళలకు నర్సింగ్ శిక్షణ కోసం ఒక శిక్షణా సంస్థనూ ఏర్పాటు చేసాడు.

వీరు 1922-1928 మధ్యకాలంలో కలకత్తా మెడికల్ జర్నల్కు సంపాదకత్వ బాధ్యతలను నిర్వహించారు. 1925 సంవత్సరంలో రాజకీయ రంగంలో ప్రవేశించి, బారక్‍‍పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ బెంగాల్ గా పేరొందిన సురేంద్రనాధ్ బెనర్జీని ఓడించాడు. 1928లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడైనారు. 1933లో కలకత్తా నగరానికి మేయర్‍‍గా ఎన్నికైనారు. 1942లో కలకత్తా విశ్వవిద్యాలయానికి ఉప కులపతిగా, 1943లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షునిగా నియమించబడినారు. 1948 సంవత్సరంలో జనవరి 13న పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి ముఖ్య మంత్రి పదవిని చేపట్టారు.

ఈయన పూనుకుని, జాదవపూర్ టి. బి. హాస్పిటల్, ఆర్. జి. ఖార్ వైద్య కళాశాల, కమలా నెహ్రూ హాస్పిటల్, విక్టోరియా ఇన్స్ స్టిట్యూట్, చిత్తరంజన్ కాన్సర్ హాస్పిటల్ మొదలైన సంస్థలను నెలకొల్పారు. ప్రత్యేకంగా మహిళలు, పిల్లల కోసం చిత్తరంజన్ సేవాసదన్ అనే వైద్యశాలను ఏర్పాటుచేశారు. మహిళలకు నర్సింగ్ శిక్షణ కోసం ఒక సంస్థను కూడా ప్రారంభించారు. విద్యా, వైద్య రంగాలలో ఈయన సేవలకు 1944 లో గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయబడింది.

1961 లో ఫిబ్రవరి 4 న ఈయనను భారత రత్న వరించింది.వీరి జయంతి రోజైన జూలై ఒకటినే వర్ధంతి కూడా కావడం విశేషం.ఈయన స్మారకార్ధం ప్రతీ ఏడూ జూలై ఒకటవ తేదీన వైద్యుల దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం 1962 లో ప్రకటించింది.వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి 1976 నుంచి డాక్టర్ బి.సి.రాయ్ పేరు మీద అవార్డులను ప్రధానం చేస్తున్నారు.

సంస్మరణం

మార్చు

మూలాలు

మార్చు

యితర లింకులు

మార్చు