భారత ఆర్ధిక వ్యవస్థ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ (PPP-పిపిపి) లెక్కల బట్టి 3.36 ట్రిలియన్ డాలర్ల GDP (జిడిపి అనగా ఆదాయం) తో ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉంది. డాలర్ మారక ద్రవ్య విలువల బట్టి చూసినా, భారత్ 691.87 బిలియన్ డాలర్ల GDP తో ప్రపంచంలో పదవ స్థానంలో ఉంది. 2005 మొదటి త్రైమాసికం నాటికి భారత్ 8.1 శాతం పెరుగుదలతో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది. ఐతే, భారీ జనాభా వలన తలసరి ఆదాయం మాత్రం 3,100 డాలర్లతో (PPP లెక్కల బట్టి) కొంచెం తక్కువగానే ఉంది. భారత ఆర్ధిక వ్యవస్థ వ్యవసాయం, హస్తకళలు, పరిశ్రమలు, సేవలు వంటి రంగాలతో విభిన్నమై ఉంది. నేటి భారత ఆర్ధిక వ్యవస్థ పెరుగుదలకు సేవల రంగమే దోహదపడుతున్నప్పటికీ, పని చేసే జనాభాలో మూడింట రెండొంతుల వారు వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారు. దేశంలోని ఆంగ్ల భాషా ప్రవీణులైన విద్యావంతుల సంఖ్య వలన భారత్ సాఫ్ట్‌వేర్ సేవలు, వాణిజ్య సేవలు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ఎగుమతిలో ముందంజలో ఉంది.

బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి భారత్‌లోని రెండు అతి పెద్ద స్టాక్ ఎక్స్చేంజులలో ఒకటి. దీని సూచిక భారత ఆర్ధిక వ్యవస్థ పటిష్ఠత గుర్తించడానికి వాడబడుతుంది.

భారత స్వాతంత్ర్యానంత చరిత్రలో ఎన్నో ఏళ్ళు ప్రభుత్వం సామ్యవాద విధానాన్ని ఆచరించడమే కాక, ప్రైవేటు సెక్టార్, విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులను నియంత్రించింది. 1990ల మొదలు ఆర్ధిక సంస్కరణల ద్వారా ప్రభుత్వం విదేశీ వ్యాపారంపై నియంత్రణలను తగ్గించి మార్కెట్టు వ్యవహారాలని సులభతరం చేసింది. ఐతే ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న పరిశ్రమల ప్రైవేటీకరణ మాత్రం రాజకీయ వాగ్వివాదాల మధ్య నెమ్మదిగా సాగుతోంది.

పెరుగుతున్న జనాభా, మౌలిక సదుపాయాల కొరత, పెరుగుతున్న అసమానత, నిరుద్యోగం, 1980లనుండి 10 శాతం మాత్రమే తగ్గిన పేదరికం - ఇవన్నీ భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న ఆర్ధిక-సామాజిక సమస్యలు.

ప్రపంచంలోని దేశాలను తలసరి ఆదాయం ప్రాతిపదికగా ఐక్య రాజ్య సమితి రెండు విధాలుగా విభజించింది (1) అభివృద్ధి చెందిన దేశాలు (2) అభివృద్ధి చెందుతున్న దేశాలు ; ప్రపంచ బ్యాంకు కూడా తలసరి ఆదాయం ప్రాతిపదికగా నాలుగు విధాలుగా విభజించింది.

  1. నిమ్న ఆదాయ వర్గ దేశాలు - తలసరి వార్షిక ఆదాయం 875 డాలర్ల కంటే తక్కువ ఉన్నాయి.
  2. అల్ప మధ్యస్త ఆదాయ వర్గ దేశాలు - తలసరి వార్షిక ఆదాయం 875 - 3465 డాలర్ల మధ్య ఉన్నాయి.
  3. అధిక మధ్యస్త ఆదాయ వర్గ దేశాలు - తలసరి వార్షిక ఆదాయం 3465 - 10,725 డాలర్ల మధ్య ఉన్నాయి.
  4. అధిక ఆదాయ వర్గ దేశాలు - తలసరి వార్షిక ఆదాయం 10,726 డాలర్ల కంటే ఎక్కువ ఉన్నాయి.

2005లో భారత్ తలసరి వార్షిక ఆదాయం 720 డాలర్లు కనుక భారత్ నిమ్న ఆదాయ వర్గ దేశంగా పరిగణింపబడుతున్నది.

దేశ శ్రామిక జనాభాలో 58% మంది ప్రాథమిక రంగంలో నిమగ్నమై ఉన్నారు. స్థూల జాతీయోత్పత్తిలో 19.4% ఆదాయం వీరి ద్వారా లభిస్తున్నది.

మూలాలుసవరించు

  • "ఆర్ధిక అసమానతల పరిశీలన ఎలా?" - గడవర్తి వెంకటేశ్వర్లు వ్యాసం - ఈనాడు 2008 డిసెంబరు 29. swathantryaniki mundu, daani tarvata koddi kaalam paatu samyavada ardhika vidhaanalatho prabhavitham cheeyabadindi.