నాథూ లా, చో లా ఘర్షణలు

(భారత చైనా యుద్ధం 1967 నుండి దారిమార్పు చెందింది)

1967 సెప్టెంబరు 11–14 మధ్య నాథూ లా కోసం; 1967 అక్టోబరు 1 న చో లా కోసం భారత చైనాల మధ్య చోటు చేసుకున్న సైనిక ఘర్షణలే నాథూ లా, చో లా ఘర్షణలు. ఈ ఘర్షణలు, అప్పట్లో భారత సంరక్షణలో ఉన్న హిమాలయ రాజ్యం సిక్కిం సరిహద్దు వెంట జరిగాయి.[6]

1967 చైనా - భారత సరిహద్దు ఘర్షణలు

ప్రపంచ పటంలో చైనా, భారతదేశాలు
తేదీ1967 సెప్టెంబరు 11–14  (నాథూ లా)
1967 అక్టోబరు 1 (చో లా)
ప్రదేశంభారత చైనాల సరిహద్దులో ఉన్న నాథూ లా, చో లా
ఫలితంభారత బలగాలు చైనా బలగాలను వెనక్కి తరిమాయి[1][2][3]
ప్రత్యర్థులు
భారతదేశం చైనా
సేనాపతులు, నాయకులు
జాకీర్ హుసేన్ (భారత రాష్ట్రపతి)
ఇందిరా గాంధీ (ప్రధాన మంత్రి)
స్వరణ్ సింగ్ (రక్షణ మంత్రి)
లెఫ్తి. జన జగ్‌జిత్ సింగ్ అరోరా[4]
మేజ. జన. సగత్ సింగ్[4]
మావో జెడోంగ్ (చైనా కమ్యూనిస్టు పార్టీ చైర్మన్)
డిప్యూ కమాండరు వాంగ్ చెంఘన్[5]
ప్రాణ నష్టం, నష్టాలు
భారతీయ వర్గాలు:
88 మరణాలు
163 క్షతగాత్రులు - నాథూ లా, చో లాల్లో
చీనా వర్గాలు:
నాథూ లాలో 65 మరణాలు
చో లాలో 36 మరణాలు
చైనా వర్గాలు:
నాథూ లాలో 32 మరణాలు
'unknown' in the Cho La incident
Indian sources:
340 killed
450 wounded in Cho La and Nathu La incidents combined

1967 సెప్టెంబరు 11 న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నాథూ లా లోని భారత సైనిక శిబిరాలపై దాడులు జరపడంతో ఈ ఘర్షణలు మొదలయ్యాయి. ఈ ఘర్షణలు 1967 అక్టోబరు 15 వరకూ సాగాయి. 1967 అక్టోబరులో చో లా లో కూడా ఘర్షణలు జరిగి, అదే రోజున ముగిసాయి.

కొన్ని తటస్థ వర్గాల ప్రకారం, భారత బలగాలు చైనా బలగాలపై నిర్ణయాత్మక విజయాన్ని సాధించాయి.[2][3] నాథూ లాలో చైనా సైన్యానికి చెందిన అనేక స్థావరాలను నాశనం చేసి.[5] భారత దళాలు చైనా సైన్యాలను వెనక్కు తరిమి కొట్టాయి.[1] ఈ రెండు సంఘటనల్లో రెండు వైపులా గణనీయమైన సంఖ్యలో సైన్య నష్టం జరిగింది. నష్టానికి సంబంధించి, ఇరు పక్షాలూ వేరువేరు సంఖ్యలను చూపెట్టాయి.

చుంబీ లోయలోని వివాదాస్పద భూభాగంపై ఆధిక్యత సాధించేందుకు ఇరుదేశాల మధ్య తలెత్తిన పోటీ ఈ ఘర్షణలకు ప్రధాన కారణం. భారత్ పై దాడి నిర్ణయంపై చైనా చూపిన కారణాలు ఈ ఘర్షణల కారణంగా బలహీనపడినట్లుగా పరిశీలకులు భావించారు. భారత్ మాత్రం, 1962 యుద్ధంలో పరాభవం తరువాత చేజిక్కించుకున్న ఈ విజయం తన బలగాల పాటవంలో మెరుగుదలకు సూచికగా తీసుకున్నట్లుగా కూడా పరిశీలికులు భావించారు. 

నేపథ్యం

మార్చు

1962 యుద్ధం తరువాత భారత చైనా సరిహద్దులో ఉద్రిక్తత నెలకొని ఉంది. ఆ యుద్ధంలో పరాభవం తరువాత భారత్ తన సైన్యాన్ని రెండింతలు చేసింది. సైన్యాన్ని విస్తరణలో భాగంగా ఏడు పర్వత విభాగాలను, తన ఉత్తర సరిహద్దులో చైనా నుండి ఎదురుకాగల ముప్పును ఎదుర్కొనేందుకు ఏర్పరచింది. వీటిలో చాలా వరకు సరిహద్దుకు దూరంగానే ఉన్నాయి. ఇరు సైన్యాల దళాలు దగ్గర దగ్గరగా మోహరించి ఉన్న చుంబీ లోయ మాత్రం దీనికి మినహాయింపు. మరీ ముఖ్యంగా సిక్కిం-టిబెట్ సరిహద్దు వెంట ఉన్న నాథూ లా వద్ద భారత చైనా బలగాల మధ్య 20-30 మీటర్ల ఎడం మాత్రమే ఉంది. ఇరుదేశాల మధ్య ఉన్న 4000 కి.మీ. సరిహద్దు మొత్తమ్మీద ఇదే అతి తక్కువ దూరం. ఇక్కడ సరిహద్దు రేఖను స్పష్టంగా గుర్తించలేదని అంటారు. కనుమ యొక్క ఉత్తర భాగంలో చైనా ఉండగా, దక్షిణ భాగం భారత అధీనంలో ఉంది. కనుమ ముఖ్యమైన భాగాలైన సెబు లా, కేమెల్స్ బ్యాక్ రెండు కూడా భారత అధీనంలో ఉన్నాయి.1963 నుండి తరచూ ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్న చిన్నా చితకా ఘర్షణలు పత్రికల్లో వస్తూనే ఉన్నాయి.

1967 ఆగస్టు 13 నుండి నాథూ లాకు సిక్కిం వైపున చైనా బలగాలు కందకాలు తవ్వడం మొదలుపెట్టాయి. వాటిలో కొన్ని స్పష్టంగా సిక్కిం వైపున ఉన్నట్లుగా భారత బలగాలు గమనించాయి. అదే విషయాన్ని స్థానిక చైనా కమాండరు దృష్టికి తీసుకు వెళ్ళి, అక్కడి నుండి వెనక్కి వెళ్ళాలని చెప్పాయి. సరిహద్దు రేఖ స్పష్టంగా తెలిసేలా ఉండేందుకు భారత్ ముళ్ళతీగతో కంచేను ఏర్పాటు చేయబూనింది.

అందు కనుగుణంగా ఆగస్టు 18 నుండి ముళ్ళ తీగను సరిహద్దు రేఖ వెంబడి పరచారు. దీన్ని చైనా బలగాలు నిరసించాయి. రెండు రోజుల తరువాత ఆయుధాలు ధరించిన చైనా దళాలు, తీగను కడుతున్న భారత సైనికులకు ఎదురుగా మోహరించాయి. కానీ, కాల్పులేమీ జరపలేదు.

తిరిగి సెప్టెంబరు 7 న, నాథూ లాకు దక్షిణ భాగాన ముళ్ళ తీగను పరుస్తూండగా, స్థానిక చైనా కమాండర్లు ఆ స్థలానికి వెళ్ళి, ఆ పనిని ఆపాల్సిందిగా భారత కమాండర్లకు తీవ్ర హెచ్చరిక చేసారు. ఆ తరువాత జరిగిన తోపులాటలో రెండు వైపులా సైనికులు గాయపడ్డారు. తమ సైనికు లిద్దరికి గాయాలవడంతో చైనా దళాలు ఆవేశానికి లోనయ్యాయి.

పరిస్థితిని చక్కబరచేందుకు, సరిహద్దును స్పష్టంగా గుర్తించేందుకూ కనుమకు మధ్యలో నాథూ లా నుండి సెబు లా వరకూ 1967 సెప్టెంబరు 11 నుండి మరొక తీగను పరవాలని భారత సైన్యం తలపెట్టింది.

నాథూ లా ఘర్షణలు

మార్చు

1967 సెప్టెంబరు 11 న భారత ఇంజనీర్లు, జవాన్లూ ముళ్ళ తీగను వేయడం మొదలుపెట్టారు. ఒక కథనం ప్రకారం, వెంటనే చైనా రాజకీయ కమిస్సారు కొందరు సైనికులతో కనుమ మధ్యన ఉన్న భారత లెఫ్టినెంట్ కలనల్ వద్దకు వచ్చి, తీగను పరవడం ఆపమని చెప్పాడు. తమ పనిని ఆపమని, తమకున్న ఆదేశాలను పాటిస్తామనీ భారత దళాలు చెప్పాయి. వాదనగా మొదలైనది తోపులాటగా మారింది. ఆ తరువాత చైనా దళాలు వెనక్కి వెళ్ళాయి. భారత దళాలు తమ పనిని కొనసాగించాయి.

ఆ తరువాత కొద్ది నిముషాలకే చైనా వైపు నుండి ఒక ఈల మోగింది. ఆ వెంటనే ఉత్తర దిశనుండి భారత దళంపై మీడియం మెషీన్ గన్ కాల్పులు మొదలయ్యాయి. కనుమలో తలదాచుకునే ప్రదేశం లేనందువల్ల, భారత దళాలకు తీవ్ర నష్టం కలిగింది. ఆ తరువాత కొద్ది సేపటికే, చైనా దళాలు భారత సైన్యంపై శతఘ్ని కాల్పులు మొదలుపెట్టాయి. కొద్ది సేపటి తరువాత, భారత దళాలు కూడా శతఘ్ని కాల్పులు మొదలుపెట్టాయి. ఈ కాల్పులు మూడు రోజుల పాటు రాత్రింబవళ్ళూ సాగాయి. ఈ కాల్పుల్లో భారత దళాలు చైనా దళాలను వెనక్కు తరిమాయి. కాల్పులు మొదలైన ఐదు రోజుల తరువాత సుఖమూ శాంతీ లేని సంధి ఒకటి కుదిరింది. ఎత్తులో మోహరించి ఉన్న భారత దళాలు తమకు ఉన్న అనుకూలత కారణంగా చైనా దళాలకు  చెందిన అనేక బంకర్లను ధ్వంసం చెయ్యగలిగారు. సెప్టెంబరు 15, 16 తేదీల్లో మరణించిన సైనికుల దేహాలను ఇచ్చిపుచ్చుకున్నారు.

ఈ ఘర్షణలకు చైనాయే కారణమని భారత, పాశ్చాత్య వర్గాలు పేర్కొన్నాయి. చైనా మాత్రం భారతదేశమే దాడిని మొదలు పెట్టిందని ఆరోపించింది.

చో లాలో ఘర్షణలు

మార్చు

1967 అక్టోబరు 1 న చో లా వద్ద ఇరు సైన్యాలకూ ఘర్షణ జరిగింది. ఈ ప్రదేశం నాథూ లాకు కొన్ని కిలోమీటర్లు ఉత్తరాన ఉంది.

భారత వాదన ప్రకారం, చైనా సైన్యం సిక్కిం భూభాగంలోకి వచ్చి భారత సైనికులను ఎదిరించడంతో ఈ ఘర్షణ మొదలైంది. ఈ వాదనను ఓ తటస్థ వర్గం కూడా ధ్రువీకరించింది. అయితే, చైనా మాత్రం భారతే రెచ్చగొట్టిందని చెప్పింది. భారత సైనికులు చైనా భూభాగంలోకి చొచ్చుకువచ్చి, తమ సైనికులపై కాల్పులు జరిపారని చైనా ఆరోపించింది.

ఈ ఘర్షణ ఒక రోజులో ముగిసింది. భారత వర్గాల ప్రకారం ఈ ఘర్షణతో భారత స్థైర్యం బలపడింది. ఈ ఘర్షణ తరువాత చైనా సైన్యం చో లాలో దాదాపు 3 కి.మీ. వెనక్కు వెళ్ళిపోయింది.

ఓ వర్గం అభిప్రాయం ప్రకారం, ఈ ఘర్షణల పర్యవసానంగా చైనా దళాలు జెలెప్ లాను ఆక్రమించాయి.[7] అయితే, ఆనేక ఇతర వర్గాల ప్రకారం, జెలెప్ లా 1965 నాటికే చైనా స్వాధీనంలో ఉంది.[8][9]

మరణాలు

మార్చు

చైనా నివేదికల ప్రకారం: నాథూ లాలో 32 మంది చైనా సైనికులు, 65 మంది భారత సైనికులు మరణించారు. చో లాలో 36 మంది భారత సైనికులు మరణించగా, చైనా మరణాల సంఖ్యను వెల్లడించలేదు.

భారత రక్షణ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం: రెండు సంఘటనల్లోను భారత సైనికులు 88 మంది మరణించగా, 163 మంది గాయపడ్డారు. చైనా సైనికులు 340 మంది మరణించగా, 450 మంది గాయపడ్డారు.

విశ్లేషణ

మార్చు

టేలర్ ఫ్రావెల్ ప్రకారం, చుంబీ లోయలోని వివాదాస్పద ప్రాంతంపై ఆధిపత్యం కోసం ఏర్పడిన పోటీ ఉద్రిక్తతలను పెంచేందుకు దోహదపడ్డాయి. భారత్‌పై దాడి చెయ్యాలన్న చైనా నిర్ణయం బలహీనపడడం వెనుక మూడు కారణాలున్నాయని ఫ్రావెల్ చెప్పాడు: మొదటిది, 1962 యుద్ధం తరువాత భారత సైన్యం విస్తరించుకుని చైనాతో తన  సరిహద్దును బలోపేతం చేసుకుంది. రెండవది, సరిహద్దు ప్రాంతంపై తన హక్కులను నొక్కి చెప్పింది. ఇక, భారత చర్యల పట్ల చైనా దృక్కోణం మూడవది.

చైనా నాయకులు భారత సామర్థ్యాన్నిభూతద్దంలో చూసి ఉండవచ్చని, అందుచేత తీవ్రమైన దాడి అవసరమని నిర్ణయించుకుని ఉండవచ్చనీ ఫ్రావెల్ చెప్పాడు. చైనా దాడులను కేంద్రీయ మిలిటరీ కమిషను ఆమోదించి ఉండకపోవచ్చని కూడా ఫ్రావెల్ చెప్పాడు. చైనా దాడులను మొదలుపెట్టగానే, అప్పటి చైనా ప్రధాని జౌ ఎన్ లై, ఎదురు కాల్పులు మాత్రమే జరపమని ఆదేశించినట్లు కూడా ఫ్రావెల్ చెప్పాడు.

జాన్ గార్వర్ ప్రకారం, ఈ ఘర్షణలతో సిక్కిం పట్ల చైనా ఉద్దేశాలపై భారత్‌కు ఆందోళనలు తలెత్తాయి. తమ బలగాల పనితీరుపై భారత్ సంతృప్తి చెందిందని, 1962 యుద్ధం తరువాత నాటకీయమైన పురోగతి సాధించినట్లుగా భావించిందనీ కూడా గార్వర్ చెప్పాడు.

పర్యవసానాలు

మార్చు

ఈ ఘర్షణల తరువాత భారత చైనా సరిహద్దు ప్రశాంతంగా ఉంది.

సిక్కింలో రాచరికాన్ని రద్దు చేసి, భారత్‌లో కలిపోవాలని జరిగిన ఒక రిఫరెండంలో ప్రజల తీర్పు సానుకూలంగా వెలువడ్డ తరువాత 1975 లో సిక్కిం భారత్‌లో ఒక రాష్ట్రంగా కలిసిపోయింది. ఈ విలీనాన్ని అప్పట్లో చైనా గుర్తించలేదు. 2003 లో, టిబెట్ స్వాధికార ప్రాంతాన్ని చైనాలో భాగంగా గుర్తిస్తే, సిక్కింను భారత్‌లో భాగంగా గుర్తిస్తామని చైనా చెప్పడంతో చైనా సిక్కిం విలీనాన్ని గుర్తించినట్లైంది. అయితే టిబెట్ చైనాలో భాగమని భారత్ 1953 లోనే గుర్తించింది.[10][11][12] ఈ పరస్పర ఒప్పందం రెందు దేశాల సంబంధాల్లో ప్రశాంతతకు దారితీసింది.[13]

2005 లో చైనా ప్రధాని వెన్ జియాబావో "భారత చైనా ల మధ్య సిక్కిం సమస్యేమీ కాదని చెప్పాడు"

పాదపీఠిక

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Brahma Chellaney (2006). Asian Juggernaut: The Rise of China, India, and Japan (in ఇంగ్లీష్). HarperCollins. p. 195. ISBN 9788172236502. Indeed, Beijing's acknowledgement of Indian control over Sikkim seems limited to the purpose of facilitating trade through the vertiginous Nathu-la Pass, the scene of bloody artillery duels in September 1967 when Indian troops beat back attacking Chinese forces.
  2. 2.0 2.1 Praagh, David Van (2003-10-27). Greater Game: India's Race with Destiny and China (in ఇంగ్లీష్). McGill-Queen's Press - MQUP. p. 301. ISBN 9780773525887. (Indian) jawans trained and equipped for high-altitude combat used US provided artillery, deployed on higher ground than that of their adversaries, to decisive tactical advantage at Nathu La and Cho La near the Sikkim-Tibet border.
  3. 3.0 3.1 Hoontrakul, Pongsak (2014). The Global Rise of Asian Transformation: Trends and Developments in Economic Growth Dynamics (illustrated ed.). Palgrave Macmillan. p. 37. ISBN 9781137412355. Cho La incident (1967) - Victorious: India / Defeated : China
  4. 4.0 4.1 Sheru Thapliyal (Retired Major General of the Indian Army, who commanded the Nathu La Brigade.). "The Nathu La skirmish: when Chinese were given a bloody nose". www.claws.in. Force Magazine (2009). Archived from the original on 2018-12-25. Retrieved 2017-05-29.
  5. 5.0 5.1 Fravel, M. Taylor (2008-08-25). Strong Borders, Secure Nation: Cooperation and Conflict in China's Territorial Disputes (in ఇంగ్లీష్). Princeton University Press. pp. 197–199. ISBN 1400828872.
  6. "Sikkim standoff: China's rapid escalation is limiting India's diplomatic options; can New Delhi hold its nerve?".
  7. Naidu, G. V. C.; Chen, Mumin; Narayanan, Raviprasad (2014-11-26). India and China in the Emerging Dynamics of East Asia (in ఇంగ్లీష్). Springer. p. 317. ISBN 9788132221388.
  8. Eekelen, Willem van (2015-11-06). Indian Foreign Policy and the Border Dispute with China: A New Look at Asian Relationships (in ఇంగ్లీష్). BRILL. pp. 235-. ISBN 9789004304314.
  9. Singh, V. K. (2005-03-23). Leadership in the Indian Army: Biographies of Twelve Soldiers (in ఇంగ్లీష్). SAGE Publications. pp. 309-. ISBN 9780761933229.
  10. Breslin, Shaun (2012-07-12). A Handbook of China's International Relations (in ఇంగ్లీష్). Routledge. p. 433. ISBN 9781136938450.
  11. Eekelen, Willem van (2015-11-06). Aspects of India's International Relations, 1700 to 2000: South Asia and the World (in ఇంగ్లీష్). The Netherlands: Pearson. p. 87. ISBN 9789004304314.
  12. Eekelen, Willem van (2015-11-06). Indian Foreign Policy and the Border Dispute with China: A New Look at Asian Relationships (in ఇంగ్లీష్). The Netherlands: BRILL. pp. 36-. ISBN 9789004304314.
  13. Singh, Iqbal (1998). "Between Two Fires: Towards an Understanding of Jawaharlal Nehru's Foreign Policy" (in ఇంగ్లీష్). Orient Blackswan. pp. 243-. ISBN 9788125015857.