స్వరణ్ సింగ్

భారతీయ రాజకీయవేత్త

సర్దార్ స్వరణ్ సింగ్, (1907 ఆగస్టు 19 -1994 అక్టోబరు 30) ఒక భారతీయ రాజకీయవేత్త. అతను భారతదేశంలో సుదీర్ఘకాలం పనిచేసిన కేంద్ర కేబినెట్ మంత్రి. స్వరణ్ సింగ్ పురేవాల్ 1907 ఆగస్టు 19 న పంజాబ్ లోని జలంధర్ జిల్లా లోని శంకర్ (గ్రామం) లో ఒక జాట్ సిక్కు కుటుంబంలో జన్మించాడు. అతను తన ఇంటర్మీడియట్ (హైస్కూల్) విద్యను కపూర్తాలాలోని రణధీర్ కళాశాలలో పూర్తి చేశాడు. అతను లాహోర్‌లోని ప్రభుత్వ కళాశాలలో చేరాడు. భౌతికశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేసి, గౌరవ డాక్టరేట్ పొందాడు. ఆ తర్వాత అతను లియాల్‌పూర్ ఖల్సా కళాశాలలో ఫిజిక్స్‌ లెక్చరర్‌గా పనిచేశాడు. ఆ ఉద్యోగం విడిచిపెట్టి, తర్వాత అతను లాహోర్‌లోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించాడు. 1932 లో తన ఎల్.ఎల్.బి. పట్టా అందుకున్నాడు. జలంధర్ పట్టణం సమీపంలోని తన పుట్టిన గ్రామం దగ్గర అతను క్రిమినల్ చట్టంలో నైపుణ్యంకలిగిన న్యాయవాది దగ్గర న్యాయవాద అభ్యాసం ప్రారంభించాడు. 

Sardar Swaran Singh
స్వరణ్ సింగ్


పదవీ కాలం
10 October 1974 – 1 December 1975
ముందు Jagjivan Ram
తరువాత Indira Gandhi
పదవీ కాలం
13 November 1966 – 27 June 1970
ముందు Yashwantrao Chavan
తరువాత Jagjivan Ram

పదవీ కాలం
27 June 1970 – 10 October 1974
ముందు Dinesh Singh
తరువాత Yashwantrao Chavan
పదవీ కాలం
18 July 1964 – 14 November 1966
ముందు Lal Bahadur Shastri Acting
తరువాత M. C. Chagla

పదవీ కాలం
1 September 1963 – 9 June 1964
ముందు S. K. Patil
తరువాత Chidambaram Subramaniam

పదవీ కాలం
10 April 1962 – 21 September 1963
ముందు Jagjivan Ram
తరువాత H. C. Dasappa

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
1957 – 1977
నియోజకవర్గం జుల్లుందూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1907-08-19)1907 ఆగస్టు 19
Shankar Village, Punjab Province, British India
మరణం 1994 అక్టోబరు 30(1994-10-30) (వయసు 87)
New Delhi, India
జాతీయత Indian
తల్లిదండ్రులు Sardar Pratap Singh Purewal
జీవిత భాగస్వామి Charan Kaur
సంతానం Param Panag, Sat Boparai, Iqbal Sidhu, Jasvinder Kaur
వృత్తి Politician

రాజకీయ జీవితం మార్చు

1930 లలో అతను అకాలీదళ్ రాజకీయ పార్టీలో చేరాడు. అతను 1940 ల మధ్య కాలంలో ప్రముఖ నాయకుడుగా ఎదిగాడు. 1940 ల ప్రారంభంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, అకాలీదళ్ మధ్య రాజీలో అతను ముఖ్యమైన పాత్ర పోషించాడు. 1946 ఎన్నికలకు ముందు, బలదేవ్ సింగ్ నాయకుడిగా పంథిక్ పార్టీ స్థాపించబడింది. సింగ్ దాని ఉప నాయకుడిగా ఎన్నికయ్యాడు. 1946 లో పంజాబ్ శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత పంజాబ్ సంకీర్ణ ప్రభుత్వంలో పార్లమెంటరీ కార్యదర్శి పదవి పొందాడు.

కేంద్ర ప్రభుత్వంలో స్వరణ్ సింగ్ పాత్ర మార్చు

1952లో భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలో స్వరణ్ సింగ్ స్థానం పొందాడు.అతను తన జీవితంలో 23 సంవత్సరాలు భారత ప్రభుత్వంలో ఉన్నత స్థాయి క్యాబినెట్ మంత్రిగా గడిపాడు. అతను సమర్థవంతమైన వక్త, సంధానకర్తగా పేరు పొందాడు. "తూర్పు పాకిస్తాన్ విముక్తి యుద్ధం (1971) బాగా త్రీవ స్థాయిలో ఉన్నప్పుడు బంగ్లాదేశ్ కారణానికి సంబంధించి యుఎన్ భద్రతా మండలిలో అతని చర్చలు బాగా ఆకట్టుకున్నాయి" అని ఐక్యరాజ్యసమితిలో మాజీ భారత రాయబారి నరేంద్ర పి జైన్ వక్కాణించాడు." అతని చర్చలు సాధారణంకంటే ఎక్కువ ప్రాముఖ్యతగల చర్చలుగా నిరూపించాడు. అతను అప్పటి జుల్ఫికర్ అలీ భుట్టో, యుద్ద సంఘర్షణలో సర్దార్ చేతులు రక్తంతో నిండి ఉన్నాయని అని చెప్పినప్పుడు, స్వర్ణ్ సింగ్ లేచి దానికి పాకిస్తాన్ కు ప్రతి స్పందనగా, తన శుభ్రమైన, నిష్కళంకమైన చేతులను చూపించాడు." [1] అతను అనేక భాషలతో సుపరిచితుడై ప్రావీణ్యం సంపాదించిన రాజకీయ నాయకుడు. అతను జవహర్‌లాల్ నెహ్రూకు సహాయం చేశాడు. 1960లో ఇండో-చైనా సరిహద్దు సమస్యపై చైనీస్ నాయకుడు చౌ-ఎన్-లైతో చర్చలు జరిపాడు. 1962-63లో పాకిస్థాన్‌తో ఆరు రౌండ్ల చర్చల సందర్భంగా అతను భారత ప్రతినిధి బృందంలో ఒక సభ్యుడుగా ఉన్నాడు." [2]అతను 1975 నవంబరులో రాజీనామా చేసే వరకు అతను 1957, 1962, 1967, 1972 లోక్‌సభలకు వరుసగా ఎన్నికయ్యాడు.

నిర్వహించిన క్యాబినెట్ స్థానాలు మార్చు

మంత్రిత్వ శాఖ తేదీ
పనులు, హౌసింగ్, సామాగ్రి 1952–1957
ఉక్కు గనులు, ఇంధనం 1957–1962
రైల్వేలు 1962–1963
విదేశీ వ్యవహారాలు 1964–1966
రక్షణ 1966–1970
విదేశీ వ్యవహారాలు 1970–1974
రక్షణ 1974–1976

విదేశాంగ మంత్రి మార్చు

 
ఇరాన్ పర్యటనలో మొహమ్మద్ అమీర్ ఖతామీ, అతని భార్య అసదొల్లా ఆలంతో ఇందిరా గాంధీ, స్వరణ్ సింగ్

అతను 1966 జూలైలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీతో కలిసి సోవియట్ యూనియన్ ను సందర్శించాడు.1971 ఆగస్టు 9న "యుఎస్ఎస్ఆర్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మధ్య శాంతి, స్నేహం, సహకార ఒప్పందం"పై ఆండ్రీ గ్రోమికోతో పాటు విదేశాంగమంత్రిగా సింగ్ సంతకం చేసాడు. ఇది ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక ఇతర రంగాలలో రెండు దేశాల మధ్య సన్నిహిత మెరుగుపరచింది. ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు మూడవ దేశంతో వైరుధ్యం ఏర్పడినప్పుడు పరస్పరం సహకరించుకోవాలి. ఈ ఒప్పందం జరిగిననాటినుండి 20 సంవత్సరాలు అమలులో ఉంది. 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం జరుగుతున్నసమయంలో, ఐక్యరాజ్యసమితికి భారతదేశం స్థితిని వివరించడానికి భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాడు. [3] [4]

ఆ సమయంలో ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా ఉన్న జార్జ్ బుష్, అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాడు.ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో, భారతదేశం బేషరతుగా కాల్పుల విరమణను విరమించాలని కోరింది. దీనికి స్వరణ్ సింగ్ స్పందిస్తూ, "ఈ విశిష్ట ప్రతినిధి యునైటెడ్ స్టేట్స్ ఏకపక్ష, పక్షపాత వైఖరి మమ్మల్ని ఆశ్చర్యపరిచింది, యుఎస్ దాని స్వంత అభిప్రాయాలు, వ్యాఖ్యానాలకు అర్హత కలిగి ఉంది, అలాగే మాకు కూడా ఆ అర్హత ఉంది. కానీ వాస్తవాలు పేర్కొనబడాలి. ఉపఖండంలో తలెత్తిన ఈ దురదృష్టకర పరిస్థితి ప్రారంభం నుండి, బంగ్లాదేశ్ ప్రజల ఎన్నికలలో అంగీకరించబడిన ప్రతినిధులకు ఆమోదయోగ్యమైన రాజకీయ పరిష్కారం కోసం భారతదేశం అడుగుతోంది." [5]అని వక్కాణించాడు.1971 డిసెంబరు 16న, తూర్పు పాకిస్తాన్ దళాలు బంగ్లాదేశ్, భారతదేశం ఉమ్మడి దళాలకు లొంగిపోయాయి. వారు రాజధాని నగరం డాకా (ప్రస్తుతం ఢాకా)ను స్వాధీనం చేసుకున్నారు. [6]

స్వరణ్ సింగ్ కమిటీ మార్చు

1976లో జాతీయ ఎమర్జెన్సీ సమయంలో భారత రాజ్యాంగాన్ని అధ్యయనం చేసే బాధ్యతను అప్పగించిన కమిటీకి స్వరణ్ సింగ్ అధ్యక్షుడిగా ఉన్నాడు. [7] జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన వెంటనే, ఇందిరా గాంధీ గత అనుభవాల వెలుగులో రాజ్యాంగాన్ని సవరించే ప్రశ్నను అధ్యయనం చేయడానికి స్వరణ్ సింగ్ అధ్యక్షతన ఒక సంఘాన్ని ఏర్పాటు చేశింది. దాని సిఫార్సుల ఆధారంగా, భారత రాజ్యాంగం నలభై-రెండవ సవరణ (1976లో ఆమోదించబడింది.1977 జనవరి 3నుండి అది అమల్లోకి వచ్చింది) [7] దాని ద్వారా ప్రభుత్వం ప్రవేశికతో సహా రాజ్యాంగంలో అనేక మార్పులను చేర్చింది.[7]

అవార్డులు మార్చు

సింగ్ 1992లో రిపబ్లిక్ ఆఫ్ ఇండియాచే రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ పొందాడు. [1]

యునెస్కో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మార్చు

సెషన్స్ 123 కోసం 1989 -సర్దార్ స్వరణ్ సింగ్ 1985 నుండి డైరెక్టర్ల బోర్డులో సభ్యునిగా పనిచేశాడు.132. [8]

మూలాలు మార్చు

  1. "Swarn Singh had precision, Vajpayee an instinctive feel, while Rao had hand on pulse". Hindustantimes.com. 12 July 2015. Retrieved 8 April 2018.
  2. "Archived copy". Archived from the original on 15 February 2016. Retrieved 2016-02-09.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "SYND 11-12-71 INTERVIEW WITH INDIAN FOREIGN MINISTER SWARAN SINGH IN LONDON". YouTube. 23 July 2015.
  4. "INDIA WALKOUT - SOUND". YouTube. 21 July 2015.
  5. "YouTube". YouTube.
  6. Pace, Eric. "Swaran Singh, 87, Spokesman For India During War in 1971". The New York Times. Retrieved 8 April 2018.
  7. 7.0 7.1 7.2 April 9, india today digital; July 15, 2015 ISSUE DATE; April 13, 1976UPDATED; Ist, 2015 13:26. "Swaran Singh committee recommends new chapter on fundamental duties in the Constitution". India Today. Retrieved 2021-06-19. {{cite web}}: |first4= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  8. "India - United Nations Educational, Scientific and Cultural Organization". Unesco.org. Retrieved 8 April 2018.

వెలుపలి లంకెలు మార్చు