భారత జాతీయ ఎస్సీ కమిషన్
భారత జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ 2006 ఫిబ్రవరి 19న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలను విభజించి ఏర్పాటు చేశారు. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్‌ను భారత రాజ్యాంగంలోని 338వ అధికరణం పరిధిలో ఏర్పాటు చేశారు. ఇది రాజ్యాంగం పరిధిలో షెడ్యూల్డ్ కులాలకు నిర్దేశించిన రక్షణ చర్యలను పర్యవేక్షిస్తుంది.[1]
జాతీయ ఎస్సీ కమిషన్ | |
---|---|
జాతీయ ఎస్సీ కమిషన్ | |
Commission అవలోకనం | |
స్థాపనం | 19 ఫిబ్రవరి 2004 |
పూర్వపు Commission | జాతీయ ఎస్సీ కమిషన్ , ఎస్టీ కమిషన్ 1978 |
అధికార పరిధి | కేంద్ర సామాజిక న్యాయం , సాధికారిక శాఖ , భారత ప్రభుత్వం |
ప్రధాన కార్యాలయం | న్యూఢిల్లీ |
Minister responsible | వీరేంద్ర కుమార్, కేంద్ర సామాజిక న్యాయం , సాధికారిక శాఖ మంత్రి |
Commission కార్యనిర్వాహకుడు/లు | విజయ్ సంప్లా, చైర్మన్ అరుణ్ హల్దార్, వైస్ -చైర్మన్ అంజు బాల, సభ్యురాలు సుభాష్ పార్థి, సభ్యుడు -, సభ్యుడు |
వెబ్‌సైటు | |
https://ncsc.nic.in |
నిర్మాణం, నియామకం, పదవీ కాలం
మార్చుజాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్‌లో ఒక చైర్మన్, వైస్ చైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు. ఇందులో ఒక మహిళ సభ్యురాలు తప్పనిసరి. ఈ కమిషన్ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను భారత రాష్ట్రపతి నియమిస్తారు. వీరు షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారై ఉండాలి. కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాలాన్ని రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. ప్రస్తుత కమిషన్ పదవీకాలం మూడేళ్లు. వీరిని తొలగించే అధికారం కేవలం రాష్ట్రపతికె ఉంటుంది.[2]
విధులు
మార్చు- షెడ్యూల్డ్ కులాల హక్కులను పరిరక్షించడం
- షెడ్యూల్డ్ కులాల సాంఘిక - ఆర్థిక అభివృద్ధికి వివిధ ప్రణాళికల రూపకల్పనకు కేంద్ర, #రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వడం.
- ఈ కమిషన్‌కు ఏదైనా కేసును విచారించే విషయంలో సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి.
- షెడ్యూల్డ్ కులాల హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు విచారణ చేయడం.[3]
చైర్మన్లు
మార్చునెం | పేరు | ఫోటో | పదవి చేపట్టిన తేదీ | పదవి ముగిసిన తేదీ | కమిషన్ | రాష్ట్రం | వైస్ - చైర్మన్ |
---|---|---|---|---|---|---|---|
1 | సూరజ్ బాన్ | 2004 ఫిబ్రవరి 24 | 2007 ఆగస్టు 6 | మొదటి చైర్మన్ | హర్యానా | ఫకీర్ వాఘేలా | |
2 | బూటాసింగ్ | 2007 మే 25 | 2010 మే 24 | 2వ చైర్మన్ | పంజాబ్ | ఎన్.ఎం కాంబ్లీ | |
3 | పి.ఎల్.పునియా | 2010 అక్టోబరు 15 | 2013 అక్టోబరు 14 | 3వ చైర్మన్ | హర్యానా | రాజ్ కుమార్ వేర్క | |
2013 అక్టోబరు 22 | 2016 అక్టోబరు 21 | 4వ చైర్మన్ | |||||
4 | రాంశంకర్ కఠారియా | 2017 మే 31 | 2020 మే 30 | 5వ | ఉత్తర ప్రదేశ్ | ఎల్.మురుగన్ | |
5 | విజయ్ సాంప్లా [4] | 2021 ఫిబ్రవరి 18 | 18 July 2023 | 6వ | పంజాబ్ | అరుణ్ హల్దార్ | |
6 | kishore makwana | 247 days | present | 7 | Gujarat |
మూలాలు
మార్చు- ↑ National Commission for Schedule Castes | India Environment Portal
- ↑ Eenadu (2019). "జాతీయ, రాష్ట్రీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు". Archived from the original on 24 August 2021. Retrieved 24 August 2021.
- ↑ Sakshi (2015). "జాతీయ కమిషన్లు-విధులు" (in ఇంగ్లీష్). Archived from the original on 24 August 2021. Retrieved 24 August 2021.
- ↑ Disha Career (12 April 2021). "జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా విజయ్ సాంప్లా". Archived from the original on 24 August 2021. Retrieved 24 August 2021.