ఎల్.మురుగన్

రాజకీయ నాయకుడు

లోగ‌నాథ‌న్‌ మురుగన్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 2021 నుండి కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

ఎల్. మురుగన్
ఎల్.మురుగన్


కేంద్ర పశుసంవర్థక, మ‌త్స్య‌శాఖ స‌హాయ మంత్రి
పదవీ కాలం
జులై 2021 – ప్రస్తుతం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు ప్రతాప్ చంద్ర సారంగీ

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
7 జులై 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

రాజ్యసభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2021
ముందు థావర్ చంద్ గెహ్లాట్
నియోజకవర్గం మధ్యప్రదేశ్

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు
పదవీ కాలం
11 మార్చి 2020 – 7 జులై 2021
ముందు తమిళిసై సౌందరరాజన్
తరువాత కే. అన్నామలై

పదవీ కాలం
2017 – 2020
ముందు రాజ్ కుమార్ వేర్క
తరువాత అరుణ్ హాల్డేర్

2వ తమిళనాడు సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడు
పదవీ కాలం
2021 – ప్రస్తుతం
అధ్యక్షుడు ఎం. కె. స్టాలిన్
ముందు గాయత్రి రఘురాం
తరువాత ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం (1977-05-29) 1977 మే 29 (వయసు 47)
కోనూర్,నమ్మక్కల్ జిల్లా, తమిళనాడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు వ‌రుద‌మ్మాళ్‌, లోగ‌నాథ‌న్‌
జీవిత భాగస్వామి సి. కళైయరసి
సంతానం 2
నివాసం 353, గుజ్జి 1st క్రాస్ స్ట్రీట్, అన్న నగర్, చెన్నై,
తమిళనాడు, భారతదేశం
పూర్వ విద్యార్థి * మద్రాస్ లా కాలేజీ (ఎల్‌ఎల్‌.ఎం. , పీహెచ్‌డీ)
  • డాక్టర్ అంబేద్కర్ లా కాలేజీ (ఎల్‌ఎల్‌బీ)

జననం, విద్యాభాస్యం

మార్చు

ఎల్. మురుగన్ 1977 మే 29న తమిళనాడు, నమ్మక్కల్ జిల్లా, కోనూర్ లో లోగ‌నాథ‌న్‌, వ‌రుద‌మ్మాళ్‌ దంపతులకు జన్మించాడు.[1][2] ఆయన చెన్నైలోని డాక్టర్ అంబేద్కర్ లా కాలేజీలో నుండి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు.[3]

రాజకీయ జీవితం

మార్చు

ఎల్. మురుగన్ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన తరువాత అఖిల్ భారతీయ విద్యా పరిషత్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లో సభ్యత్వం తీసుకున్నాడు. ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి వివిధ స్థాయిల్లో పనిచేసి 2017 నుండి 2020 వరకు భారత జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ ఛైర్మన్‌గా విధులు నిర్వహించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. మురుగన్ బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత బీజేపీ పార్టీ తరపున ఓ యాత్ర చేపట్టి 30 రోజుల పాటు తమిళనాడులో బీజేపీ యాత్రను విజయవంతంగా పూర్తి చేసి పార్టీకి మంచి పట్టు తీసుకువచ్చాడు.

మురుగన్ 2021లో జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. ఆయన తిరువూర్ జిల్లాలోని ధరపురం నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన నాయకత్వంలో తమిళనాడులోని కోయంబత్తూరు సౌత్, తిరునల్వేలి, నాగర్ కోవిల్, మోడక్కురిచి నియోజకవర్గాల్లో నలుగురు బీజేపీ అభ్యర్థులను గెలిపించి దాదాపుగా 20 ఏళ్ల తరువాత బీజేపీ ఎమ్మెల్యేలు తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టారు.

ఎల్. మురుగన్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆయన కేంద్రప్రభుత్వంలో నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ, పశుసంవర్థక, మ‌త్స్య‌శాఖ స‌హాయ మంత్రిగా 2021 జూలై 7న ప్రమాణస్వీకారం చేశాడు.[4] ఆయన 2021 సెప్టెంబరులో మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5]

మూలాలు

మార్చు
  1. V6 Velugu (18 July 2021). "కొడుకు మంత్రి.. పొలం పనుల్లోనే పేరెంట్స్!: హ్యాట్సాఫ్ అన్న ప్రతిపక్ష" (in ఇంగ్లీష్). Archived from the original on 18 July 2021. Retrieved 18 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Namasthe Telangana (18 July 2021). "కొడుకు కేంద్ర‌మంత్రి.. త‌ల్లిదండ్రులు ఇప్ప‌టికీ వ్య‌వ‌సాయ కూలీలే.. ఎవ‌రు వాళ్లు? ఏంటా స్టోరీ?". Retrieved 4 April 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. TV5 News (20 July 2021). "తండ్రి పొలంలో వ్యవసాయ కూలిగా.. కొడుకు కేంద్రంలో మంత్రిగా." (in ఇంగ్లీష్). Retrieved 4 April 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
  4. BBC News తెలుగు (7 July 2021). "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
  5. BhopalSeptember 28, Press Trust of India; September 28, 2021UPDATED; Ist, 2021 05:36. "Union minister L Murugan elected unopposed to Rajya Sabha from MP". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-10-08. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)